Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాని హాస్పిటల్‌కి తీసుకెళ్లిన మిత్ర, లక్ష్మీ.. బండారం బయట పడుతుందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode వివేక్ జానుల్లో ప్రాబ్లమ్ ఎవరికీ ఉందో తెలుసుకోవడానికి దేవయాని హాస్పిటల్‌కి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో అందరూ తల పట్టుకొని కూర్చొంటారు. దేవయాని మనీషా దగ్గరకు వచ్చి వివేక్కి ప్రాబ్లమ్ ఉందని అంటే జానుకి ఉండి వివేక్ జానుని కాపాడటానికి అలా చెప్పొచ్చని అంటుంది. వివేక్ రిపోర్ట్స్ కూడా చూపించాడని అంటుంది. ఇక మనీషా మిత్రతో తాను కలిసి ఉండటానికి దేవయానికి మిత్ర దగ్గరకు వెళ్లి మాట్లాడమని ఏదో చెప్తుంది. మిత్ర మనీషా మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
మిత్ర దగ్గరకు లక్ష్మీ కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. మనీషా ప్రెగ్నెంట్ అని తెలిసినా ఏం ప్రశ్నించడం లేదని నిలదీయడం కూడా లేదని మిత్ర అంటే మీరు తప్పు చేయలేదు అని లక్ష్మీ అంటుంది. తప్పు జరిగిపోయింది లక్ష్మీ సాక్ష్యం కూడా వచ్చింది కదా తలెత్తుకోలేకపోతున్నా అని అంటాడు. ఇంతలో దేవయాని వచ్చి లక్ష్మీ నువ్వు మిత్ర దగ్గర ఉన్నావు కానీ మనీషా ఒక్కదాయి ఉంది. మిత్ర కోసం అంకుల్‌ని కూడా వదిలేసింది ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయి ఇబ్బంది పడుతుంది. కనీసం తన చెవులు కూడా మూసే వాళ్లు లేరని నువ్వు అయినా అర్థం చేసుకొని పక్కన ఉండాలి కదా లక్ష్మీ అని అంటుంది. ఇంతలో మిత్ర వెళ్లి మనీషా చెవులు మూసి మనీషాని జాగ్రత్తగా చూసుకొని సేవలు చేస్తాడు. లక్ష్మీ ఆ సీన్ చూసి ఇబ్బంది పడి తల దించుకుంటుంది. మిత్ర మనీషాని కూర్చొ పెట్టి పక్కన కూర్చొంటాడు.
నిన్ను ఈ టైంలో ఎవరో ఒకరు చూసుకోవాలి మిత్ర దగ్గరుండి చూసుకుంటాడు అని అంటుంది. ఇక లక్ష్మీ ఇంతలో మనీషా డాక్టర్ చెప్పినప్పటి నుంచి నువ్వు హాస్పిటల్‌కి వెళ్లలేదు కదా ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే గర్భం పోతుందని మిత్రతో మనీషాని ఇప్పుడే హాస్పిటల్‌కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించి వాంతులు ఆగడానికి ఏవైనా మందులు తీసుకోండి అని చెప్తుంది. లక్ష్మీ మనీషాతో రెడీగా ఉండు మనీషా ఆయన తీసుకెళ్తారు హాస్పిటల్‌కి వెళ్తే అన్నీ తెలుస్తాయని అంటుంది.
దేవయాని మనీషాతో లక్ష్మీకి నీ మీద ఎంత ప్రేమ అంటే అది ప్రేమ కాదు తొక్క కాదు టెస్టులు చేయిస్తే నేను ప్రెగ్నెంట్ కాదు అని మిత్రకు తెలిసేలా చేయాలి అని అనుకుంటుందని అంటుంది. ఇప్పుడేం చేస్తావ్ అని దేవయాని అంటే నా ప్లాన్ నాకు ఉంది అంటుంది. ఇక దేవయాని వివేక్ విషయంలో వివేక్ అబద్ధం చెప్తున్నాడని అంటుంది కదా నిజం ఎంత ఉందో తెలుసుకోవాలని వివేక్ గదికి వెళ్లి రిపోర్ట్స్ తీసుకొని వెళ్తుంది. వెళ్తూ కాళ్లకి మంచం తగలడంతో అబ్బా అంటుంది. ఇంతలో జాను వచ్చి చూస్తే ఉండదు. వివేక్ రాగానే జాను ఎవరో గదిలోకి వచ్చినట్లు అనిపించిందని అంటుంది. దిగులుగా ఉన్న జానుతో వివేక్ మందులు వేయించి తాను వేసినట్లు నటించి ట్యాబ్లెట్ గదిలోనే పడేస్తాడు.
మిత్ర, మనీషాని తీసుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతాడు. లక్ష్మీ మిత్రతో మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లమని అంటుంది. నిన్న చూసిన డాక్టర్ దగ్గరకు వెళ్దామని అంటే మన నందన్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్తేనే మనకు మంచిది అని అంటుంది. అందరితో పాటు మిత్ర కూడా మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకే వెళ్దాం అంటాడు. ఇక మిత్ర లక్ష్మీని పిలిస్తే నాకు ఏం అభ్యంతరం లేదు మనీషాకి ఓకే అయితే నాకు ఓకే అంటుంది. లక్ష్మీ మిత్రతో నేనే మనీషాని దగ్గరుండి చూసుకుంటా అని అంటుంది. రాజేశ్వరిదేవి, జయదేవ్‌లు కూడా మనీషాని లక్ష్మీ జాగ్రత్తగా చూసుకుంటుంది అని అంటారు.
మిత్ర అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. మిత్ర, లక్ష్మీ, మనీషా వాళ్లు హాస్పిటల్‌కి వెళ్తారు. మరోవైపు దేవయాని కూడా హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇంట్లో వివేక్‌కి తల్లి కనిపించకపోవడంతో జానుని, అత్తని అడుగుతాడు. దాంతో రాజేశ్వరిదేవి ఎక్కడికో ఒక్కర్తే వెళ్లిందని అంటుంది. వివేక్ దేవయానికి ఫోన్ చేస్తే గుడికి వచ్చానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!





















