అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 26th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రను కాపాడిన లక్ష్మీ, అర్జున్‌లు.. క్రెడిట్ కొట్టేసిన మనీషా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode సంయుక్త, అర్జున్‌లు రిస్క్ చేసి మిత్రని కాపాడితే మనీషా తాను మిత్రని కాపాడినట్లు ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode సంయుక్త లక్ష్మీ ఒక్కరే అని అరవిందకు తెలిసిపోతుంది.. లక్ష్మీ గురించి చెప్పుకొని అరవింద జాను దగ్గర బాధ పడుతుంది. మిత్ర కోసం తను చాలా కష్టపడుతుంటే నిజం తెలుసుకోకుండా చనిపోయిందనే భ్రమలో ఉన్నామని అరవింద ఎమోషనల్ అవుతుంది. జయదేవ్ అరవిందను ఓదార్చుతాడు. మరోవైపు లక్ష్మీ, అర్జున్లు మిత్ర గురించి వీధి వీధి తిరుగుతూ వెతుకుతుంటారు. మరోవైపు మిత్రని తప్పించేయాలని రౌడీలు సిద్ధమవుతుంటారు. మిత్ర ఇచ్చిన క్లూ ద్వారా లక్ష్మీ, అర్జున్‌లు వెతుకుతారు. ఉల్లిపాయలు అమ్మే వ్యక్తికి రూట్ అడుగుతారు. ఫోన్‌లో విన్న మాటలు బట్టి సంయుక్త, అర్జున్ అటుగా వెళ్తారు. 

సంయుక్త, అర్జున్‌లు కిడ్నాప్ చేసిన వ్యాన్ గుర్తు పడతారు. ఇద్దరూ మెల్లగా కిడ్నాపర్లు చూడకుండా మిత్రని కనిపెడతారు. మిత్రని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుంటారు. ఇక వాళ్లని మనీషా ఫాలో అవుతుంది. మనీషా కూడా మిత్రని ముందు తానే కాపాడినట్లు నటించి క్రెడిట్ కొట్టేయాలని అనుకుంటుంది. అర్జున్ రౌడీలను కొట్టడానికి రెడీ అవుతాడు. మరోవైపు మనీషా మిత్ర వాళ్ల దగ్గరకు వెళ్తుంది. పక్కనే ఉన్న రాడ్ తన్నేయడంతో సౌండ్ వచ్చి మనీషాని పట్టుకోవడానికి రౌడీలు వస్తే అర్జున్, సంయుక్త వాళ్లని చితక్కొడతారు. ఇక మనీషా మిత్ర దగ్గరకు వెళ్లి కట్లు విప్పుతుంది. రౌడీలు ఏమైనా చేస్తారు వెళ్లిపో అని మిత్ర అన్నా మనీషా చావు అయినా చస్తా కానీ వెళ్లను అంటుంది. ఇక రౌడీలు మనీషాని కొడతారు. మనీషా ముందే మిత్రని చంపాలని కత్తి తీస్తారు. మిత్రని పొడవబోతే లక్ష్మీ వచ్చి కత్తి పట్టుకొని రౌడీ మెడ పట్టుకుంటుంది. ఆ క్రమంలో లక్ష్మీ రౌడీని తీసుకెళ్లిపోతే కత్తి కింద పడిపోతుంది. మనీషా ఆ కత్తి తీసుకొని తన చేయి కట్ చేసుకుంటుంది. రౌడీలే ఏదో చేశారని మిత్ర అనుకుంటాడు. అర్జున్, సంయుక్తలు కూడా షాక్ అయిపోతారు. 

మనీషా ఏదో సాధించినట్లు నవ్వుతుంది. మిత్ర మనీషా మనీషా అని కంగారు పడతాడు. మిత్రని తీసుకొని మనీషా వెళ్లిపోతుంది. సంయుక్త, అర్జున్ ఇద్దరూ మనీషా లేకపోవడం చూసి షాక్ అయిపోతారు. మనీషా, మిత్ర ఇద్దరూ వెళ్లిపోతారు. మనీషా చేతికి దెబ్బ తగలడంతో మిత్ర విలవిల్లాడిపోతాడు. ఇద్దరూ కలిసి కారులో వెళ్లిపోతారు. సంయుక్త, అర్జున్ వెనుకే వెళ్లినప్పటికి ఇద్దరూ వెళ్లిపోతారు. ఇక అర్జున్ సంయుక్త చేతికి కట్టు కడతాడు. మరోవైపు మిత్ర ఇంటిలో అందరూ మిత్ర కోసం ఎదురు చూస్తున్నారు. సంయుక్తకి కాల్ చేస్తారు జయదేవ్. మిత్రకు ఏం కాలేదని సేవ్ చేశామని ఇంటికి వస్తున్నాం అని సంయుక్త చెప్తుంది. మనీషా మిత్రను తీసుకొని వస్తుంది. అందరూ షాక్ అవుతారు. మనీషా కాపాడిందని  చెప్తాడు. మనీషా తన చేతి గాయాన్ని కూడా చూపిస్తుంది. మిత్ర మనీషాకి కట్టు కడతాడు. మనీషా అంతా యాక్టింగ్ అన్నట్లు దేవయానికి సైగ చేస్తుంది. దాంతో దేవయాని మనీషాని పొగుడుతుంది. ఇక అరవింద సంయుక్త, అర్జున్‌ల గురించి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి ఫోన్లో కార్తీక్ దీపల ముచ్చట్లు.. కాశీ, స్వప్నల ప్రేమని తెలుసుకున్న కావేరి, టెన్షన్‌ అందుకేనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget