అన్వేషించండి

Karthika Deepam 2 Serial August 26th: కార్తీకదీపం 2 సీరియల్:  రాత్రి ఫోన్లో కార్తీక్ దీపల ముచ్చట్లు.. కాశీ, స్వప్నల ప్రేమని తెలుసుకున్న కావేరి, టెన్షన్‌ అందుకేనా!

Karthika Deepam 2 Today Episode కాశీని ప్రేమిస్తున్నానని స్వప్న తల్లి కావేరితో చెప్పడం కావేరి కంగారు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి రావడంతో జ్యోత్స్న దీపని అడ్డుకుంటుంది. ఓ ప్రాణం కాపాడి అందరి ముందు దేవత అయి నన్ను విలన్ని చేశావని అంటుంది. అందరూ మన ఇద్దరి గురించే మాట్లాడుతున్నారని ప్రమాదాలు అన్నీ నువ్వు వెళ్లే దారిలోనే అవుతున్నాయని ఆ వీడియో నువ్వే తీయించి సోషల్ మీడియాలో పెట్టించావ్ అని అంటుంది. దానికి దీప ఎవరి దృష్టిలో గొప్ప అవడానికి అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని అంటుంది. 

ఇక దీప జ్యోత్స్నతో అహంకారంగా ఉండొద్దని నీ అదృష్టాన్ని నీ నుంచి ఎవరూ తీసుకోరని నీ ప్రవర్తనతో నువ్వే దాన్ని పాడు చేసుకుంటున్నావ్ అని కార్తీక్ గురించి చెప్తుంది. ఇక జ్యోత్స్న మనసులో బావని నిన్ను ఎలా దూరం చేయాలో నాకు తెలుసని అనుకుంటుంది. స్వప్న స్నానం చేసి వస్తుంది. కావేరి స్వప్న ఫోన్‌లో కాశీ స్వప్న క్లోజ్‌గా ఉన్న ఫొటోలు చూస్తుంది. ప్రేమ గురించి నిలదీస్తుంది. చెప్పేలోపే నువ్వే సీక్రెట్ ఏజెంట్‌లా కనిపెట్టేశావని స్వప్న తల్లితో అంటుంది. ఇక కావేరి స్వప్నని కొడుతుంది. నమ్మినందుకు తగిన బుద్ధి  చెప్పావని ఈ విషయం మీ డాడీకి చెప్తానని కావేరి అంటే స్వప్న తల్లి కాళ్ల మీద పడుతుంది. తండ్రికి విషయం చెప్పొద్దని ప్రాధేయపడుతుంది. కాశీ గురించి స్వప్న తల్లితో చెప్తుంది. కాశీకి జాబ్ వచ్చిన తర్వాత చెప్దామని అనుకునేలోపే యాక్సిడెంట్ జరిగిందని దీప కాపాడిందని స్వప్న చెప్తుంది. దీపని అపార్థం చేసుకున్నాం తనే లేకపోతే కాశీ బతికేవాడు కాదని అంటుంది. ఇక కావేరి కాశీ తల్లిదండ్రుల గురించి అడిగితే స్వప్న తెలీదని అంటుంది.

కావేరి: కాశీ జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్నావా. తన జీవితంలో నువ్వే ఉన్నావా ఇంకెవరైనా ఉన్నారా.
స్వప్న: అదేంటి మమ్మీ అలా అడిగావ్.
కావేరి: మనసులో నా జీవితంలా నీ జీవితం కాకూడదని. ఇంటి ఆడపిల్లని ఇవ్వాలి అంటే మొత్తం ఆలోచించాలి కదా మగాళ్లని అంత ఈజీగా నమ్మకూడదమ్మా. సరే నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుదాం.
స్వప్న: మమ్మీ ప్లీజ్ ఈ  విషయం అప్పుడే డాడీకి చెప్పకు ప్లీజ్ మమ్మీ.
కావేరి: మనసులో ముందు వాడు ఎవడో వాడి చరిత్ర తెలుసుకోవాలి నా లా నువ్వు మోసపోకూడదు నా జీవితంలా నీ జీవితం కాకూడదు.

శౌర్య ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ విషయం చెప్పడానికి కార్తీక్‌కి కాల్ చేస్తుంది. కార్తీక్ కూడా ప్రేమగా మాట్లాడుతాడు. ఇక దీప ఫోన్ లాక్కొని పక్కనే పెట్టేసి శౌర్యకి క్లాస్ పీకుతుంది. కార్తీక్ ఫోన్లో ఇద్దరి మాటలు వినుకొని నవ్వుకుంటాడు. ఇక శౌర్యని పడుకోమని దీప చెప్తుంది. కార్తీక్ మళ్లీ దీపకి కాల్ చేస్తాడు. దీప అన్న మాటలన్నీ నేను విన్నానని కార్తీక్ చెప్తాడు. తనకు ఇబ్బంది లేదు అని శౌర్యకి తన తప్ప ఇంక ఎవరూ లేరని అంటాడు. శౌర్య విషయంలో తనకు కూడా అంతే బాధ్యత ఉందని తను మాట్లాడాలి అనుకుంటే తనని మాట్లాడనివ్వమని అంటాడు. 

కార్తీక్ చిన్నప్పుడు దీప తనని కాపాడిన సంగతి గుర్తు చేసుకొని ఆ లాకెట్‌తో మాట్లాడుతాడు. ఎక్కడున్నావ్ ఎప్పుడు కనిపిస్తావ్ అని అనుకుంటాడు. కార్తీక్‌కి తను దీప అని తెలీదు. మరోవైపు దీప కార్తీక్ అప్పు తీర్చడానికి ఏర్పాటు చేసిన డబ్బా చూసి తొందర్లోనే అప్పు తీర్చేస్తానని అనుకుంటుంది. ఇక తొందరగా జ్యోత్స్నకి నీకు పెళ్లి అయితే పాపని తీసుకొని వెళ్లిపోతానని అనుకుంటుంది. 

కార్తీక్ ఉదయం స్వప్న గురించి ఆలోచిస్తాడు. నువ్వు నా చెల్లి అని అదే పెద్ద ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు నీ ప్రేమ గురించి ఇంకా పెద్ద సమస్య అని ఫీలవుతాడు. తన తల్లికి నిజం తెలిస్తే తట్టుకోలేదని బాధ పడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ పెళ్లి ఎలా చేయగలను అని అంటాడు. ఇక కాంచన వచ్చి కార్తీక్‌తో బేబీ అని ఎవర్ని పిలుస్తారని అంటుంది. ఎందుకు అలా అడిగావ్ అని కార్తీక్ అడిగితే మీ నాన్నకి ఒకావిడి కాల్ చేసి బేబీ అని పిలిచిందని నాన్నని అడిగితే ఏవేవో చెప్తున్నాడని అంటుంది. తండ్రి మీద తల్లికి అనుమానం వచ్చిందంటే నిజం తెలుసుకునే వరకు వదలదని కార్తీక్ అనుకుంటాడు. ఇక కాంచన నీ లైఫ్‌లో ఎవరైనా బేబీ ఉందా అని అడుగుతుంది. దాంతో కార్తీక్ ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  పాపను పాముల పడగపై పెట్టగానే ఏం జరుగుతుంది..? పెట్టె గురించి గురువుగారు చెప్పిన రహస్యం ఏంటి..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget