అన్వేషించండి
Advertisement
Trinayani Serial Today August 24th: పాపను పాముల పడగపై పెట్టగానే ఏం జరుగుతుంది..? పెట్టె గురించి గురువుగారు చెప్పిన రహస్యం ఏంటి..?
Trinayani Today Episode: పెట్టకు ఉన్న నాగబంధనాలు ఎలా తొలిగిపోయాయి..ఈ పెట్టె వెనక ఉన్న మర్మం గురించి గురువుగారు ఏం చెప్పారు.ఈరోజు ఏపిసోడ్‌లో చూద్దాం
Trinayani Serial Today Episode: ఉలిచి పాపను బుట్టలో పెట్టుకుని ఆ రెండు నాగుపాముల పడగ మీద ఉంచుతుంది నయనీ. వెంటనే ఆ పాపలో నుంచి శక్తి వెళ్లి పెట్టెకు కట్టిన తాళ్లు తెంపేస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. నా కుమార్తె వల్లే ఇది సాధ్యమైంది కాబట్టి ఆ పెట్టే నాకే ఇవ్వాలంటూ సుమన అంటుంది. అందరూ వారిస్తున్నా వినకుండా వెళ్లి పెట్టె ముట్టుకుంటుంది. అంతే వెంటనే అది షాక్ కొడుతుంది. ఎక్కువ ఆశపెడితే ప్రమాదంలో పడతావని గురువుగారు హెచ్చరిస్తారు. ఆ పెట్టెను విశాల్ కన్నతల్లి గాయత్రీదేవి లేదా నయనీ తప్ప ఇంకెవ్వరూ తాకలేరని గురువుగారు చెబుతారు.
మా అమ్మ ఆత్మ ఈ పెట్టను ఎలా తాకగలదని విశాల్ గురువుగారిని అడుగుతాడు. అందుకు సమాధానంగా మీకు తెలియని విషయం ఏమిటంటే...ఆ పెట్టుకు తాళ్లు చుట్టమని నాగమయ్యను పురమాయించిందే గాయత్రీదేవి అని చెబుతాడు. దాన్ని పాతిపెట్టింది కూడా గాయత్రీదేవియేనంటాడు. ఉలిచి పాప కాళ్లకు వేసిన సాక్స్‌లు తీసివేయమని చెబుతాడు.
అలా చేస్తే ఉలిచి పాప పాముగా మారిపోతుందని హాసిని చెబుతుంది. ఇకపై అలా జరగదని గురువుగారు అభయమిస్తాడు. దీంతో పాప కాళ్లకు వేసిన సాక్స్‌లు తీసివేస్తారు. కాలిన గాయాలు కూడా తగ్గిపోతాయి
కాలిన గాయాలు కూడా మానిపోయాయి అంటే ఈ పెట్టెకు ఎన్నో మహిమలు ఉన్నాయన్నమాట అని తిలోత్తమ అనగా...కాస్త ఓపికపడితే అందులోఏం ఉందో కూడా చూడొచ్చని విశాల్ అంటాడు.
సుమన రమ్మనడంతో నయనీ మేడపైన గదిలోకి వెళ్తుంది. అప్పుడే కాఫీ కప్పులతో సుమన అక్కడికి వస్తుంది. నయనీకి,విక్రాంత్‌కు కాఫీ కప్పులు అందించి తాగమని చెబుతుంది. నయనీ కాఫీ తాగేందుకు ఉపక్రమించగా...విక్రాంత్ ఆపి కప్పులు మార్చుకుందామని అంటాడు. ఎందుకని నయనీ అనగా....నేను అందులోవిషం కలిపి ఉంటానని ఆయన అనుమానం అని సుమని నిట్టూరుస్తుంది. కప్పులు మార్చడంతో ఇద్దరూ కాఫీ తాగుతారు. ఇంతకు ఎందుకు పిలిచావని నయనీ అడగడంతో ఏం లేదని ఊరకే పిలిచానని చెబుతుంది. నాకూతురు పుట్టినరోజు ఫంక్షన్ చేసినందుకు కాఫీ ఇచ్చి కృతజ్ఞతలు చెప్పానని అంటుంది సుమన. ఈ ఫంక్షన్ చేసిన విశాల్ అన్న అయితే...ఆయనకు కాఫీ ఇవ్వకుండా వదిన్ని పిలిచి ఎందుకు ఇచ్చావని విక్రాంత్ ప్రశ్నిస్తాడు. కాసేపట్లో గురువుగారు చెప్పిన ముహూర్తం వస్తుంది కదా...పెట్టే తెరవడానికి నయనీకి శక్తి కావాలి కాబట్టే పిలిచి కాఫీ ఇచ్చానని చెబుతుంది సుమన
సుమన మాటలు విన్న విక్రాంత్...అసలు కథ అది వదినా..నువ్వు మాత్రమే ఆ బాక్స్ తెరిచే అవకాశం ఉండటంతో కాఫీలు ఇచ్చి మచ్చిక చేసుకోవడానికి సుమని ఎత్తులు వేస్తోందని అంటాడు. అటు హాల్లో ఉన్న పెట్టేలో ఏముందో చూడాలని తిలోత్తమ ప్రయత్నిస్తుంది. వల్లభ వద్దని వారిస్తున్నా వినదు. నేరుగా తాకితే షాక్ కొడుతుంది కాబట్టి కర్రతో ఓపెన్ చేసి చూద్దామని అంటుంది. వాళ్లిద్దరూ ఆ ప్రయత్నాల్లో ఉండగా అక్కడికి వచ్చిన హాసినీ వారిని వారిస్తుంది. కాసేపట్లో నయనీ తెరుస్తుంది కదా అప్పుడే కక్కుర్తి ఎందుకని మండిపడుతుంది. వాళ్లిద్దరూ రెచ్చగొట్టి హాసినీతోనే పెట్టె తెరిపించాలని చూస్తారు. హాసిని కర్రతో పెట్టె తెరిచినట్లు నటించి షాక్‌కు గురైనట్లు గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఏమైందని అందరూ అడగ్గా...గట్టిగా నవ్వుతుంది..దీంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
అమరావతి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion