అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 22 th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రాను వెతకడం కోసం లక్ష్మీ చేసిన సాహసం ఏంటి..?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode: మిత్రాను వెతకడం కోసం ఎస్‌ఐను కలిసి కిడ్నాపర్ల లిస్ట్ తీసుకున్న లక్ష్మీ ఏం చేసింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi : రాఖీ పండుగ సందర్భంగా లక్కీ వాళ్ల అన్నకు రాఖీ కడుతుంది. అందుకు ప్రతిఫలంగా మిత్ర బొమ్మను పెన్సిల్‌తో గీసి బహుమతిగా ఇవ్వడంతో లక్కీ ఎంతో సంతోషపడుతుంది. వాళ్ల నాన్న గుర్తుకు వచ్చి ఏడుస్తుంది లక్కీ. లక్ష్మీమిత్రా గురించే ఆలోచిస్తుండటంతో అర్జున్ ఆమెను సముదాయిస్తాడు. బాధపడుతూ కూర్చుంటే పరిష్కారం కనుగొనలేమని హితబోధ చేస్తాడు, పోలీసులను నమ్ముకుంటే లాభం లేదని వివేక్‌ అంటాడు. అసలు మిత్రాను కిడ్నాపర్లు ఎందుకు అపహరించారో తెలియడం లేదని ముగ్గురూ అనుకుంటారు. 
 
వివేక్‌: ఖచ్చితంగా వాళ్లు డబ్బుకోసమే అన్నయ్యను కిడ్నాప్ చేసి ఉంటారు
లక్ష్మీ: లేదు వివేక్..డబ్బు కోసమే అయితే ఈపాటికి వాళ్లు ఫోన్ చేసి డబ్బులు అడిగే వారు..ఇంకా ఏదో కారణం అయి ఉంటుంది.అందేంటో మనం కనుక్కోవాలి.
అర్జున్: కనుక్కోవాలి అంటే...అసలు ఎవరు కిడ్నాప్ చేశారో మనకు తెలియాలి కదా...కనీసం ఒక్క ఆధారం కూడా లేదు.
 
                మిత్రా కనిపించకపోవడంతో మనీషా చాలా కంగారుపడుతుంటుంది. నేనే ఓ నాలుగు అడుగులు ముందుకు వేసి మిత్రాను కనిపెట్టి తీరతానంటుంది. దీంతో దేవయాని ఆమెను వారిస్తుంది. పోలీసులు, సంయుక్త వాళ్లు వెతుకుతున్నారు కదా...మధ్యలో నీకు ఎందుకు కంగారు అని వారిస్తుంది. మిత్రకోసం నేను తాపత్రయపడుతున్నానని మిత్రకు తెలియాలని మనీషా అంటుంది. ఆపద నుంచి కాపాడినందుకైనా  తనను పెళ్లి చేసుకోవాలని మిత్రాకు ఆలోచన వస్తుందంటుంది. దీనికి దేవయాని కంగారు పడొద్దని చెబుతుంది. మనం అనుకున్నట్లు సంయుక్తే లక్ష్మీ అయి ఉంటే ఖచ్చితంగా మిత్ర కోసం వెతుకుతుంది. మనం సంయుక్తను ఫాలో అయితే సరిపోతుంది. చివరి నిమిషంలో మిత్రను మననే రక్షించామని క్రెడిట్ కొట్టేయవచ్చని సలహా ఇస్తుంది. స్మార్ట్‌ వర్క్ చేయడం నేర్చుకోమంటుంది.
           
                               లక్ష్మీ, అర్జున్, వివేక్ ముగ్గురు కలిసి మిత్రాను కిడ్నాప్‌ చేసిన చోటకు వెళతారు.అక్కడ ఏమైనా ఆధారాలు లభిస్తాయోమనని వెతుకుతారు. వాళ్లను మనీషా దేవయాని ఫాలో అవుతారు. మిత్రాను కిడ్నాప్‌ చేసిన కారు పాతకారు కాబట్టి...అది ఖచ్చితంగా పాతకార్లు కొనే షాపులోనే కొనిఉంటారని లక్ష్మీ చెబుతుంది. మనం అక్కడి వెళ్లి ఎంక్వయిరీ చేద్దామంటుంది. వివేక్‌ను వెళ్లి ఆరా తీయమని చెబుతుంది. దీంతో అతను వెళ్లిపోతాడు. నెంబర్‌ ప్లేట్ లేని కారులో ప్రయాణం చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉండటంతో వారు మిత్రాను సిటీలోనే ఎక్కడో దాచిపెట్టి ఉంటారని లక్ష్మీ చెబుతుంది. దీంతో అర్జున్ ఈ రోడ్డు నుంచి వెళ్లే దారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తానని వెళ్లిపోతాడు. ఆ తర్వాత లక్ష్మీ ఎస్సైను కలవడానికి వెళ్తుంది.
 
                                 మిత్రా ఎక్కడికి వెళ్లాడో తెలియదని అరవింద, దేవయాని వెళ్లి దీక్షితులు గారికి చెబుతారు. మీరు హెచ్చరించిన తర్వాత మేం వెళ్లి కాపాడే సరికి అతన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతారు. దీంతో అతన్ని మృత్యువు వెంటాడుతోందని దీక్షితులు హెచ్చరిస్తాడు. ఈ గండం నుంచి గట్టెక్కించమని అరవింద ప్రాధేయపడగా...వరలక్ష్మీ వ్రతం చేయాల్సిందిగా ఆయన సూచిస్తాడు. మిత్ర భార్య లక్ష్మీయే చేయాలని చెబుతాడు. దీంతో అరవింద కంగారుపడుతుంది. లక్ష్మీ మన దగ్గర లేదని చెబుతుంది. ఏడ్చుకుంటూ అరవింద అక్కడి నుంచి వెళ్లిపోగానే....జయదేవ్ దీక్షితులతో లక్ష్మీ బ్రతికే ఉందని చెబుతాడు. ఆ విషయం తనకు తెలుసునని దీక్షితులు చెబుతాడు. తన ఉనికి గురించి బయటకు తెలిస్తే నందన్ కుటుంబానికి ప్రమాదమని తాను బయటపడలేదని...నేను కూడా తన గురించి చెప్పకూడదని తన వద్ద  ప్రమాణం తీసుకుందని దీక్షితులు చెబుతాడు. అందుకే ఇన్నాళ్లు మీకు చెప్పలేదంటాడు. ఏదేమైనా లక్ష్మీ మాకోసం తిరిగొచ్చి అది చాలంటాడు. ఈ వ్రతం కూడా ఎవరికీ తెలియకుండా లక్ష్మీతో చేయిద్దామని జయదేవ్ చెబుతాడు. ఇంట్లో తనతో పూజ చేయించే అవకాశం లేదు కాబట్టి గుడిలో చేయిద్దామి జయదేవ్ చెబుతాడు.
 
                             ఎస్‌ఐని కలిసి లక్ష్మీ నేరస్థుల లిస్టు అడుగుతుంది. వాళ్ల లిస్టు తీసుకుని ఏం చేసుకుంటారని ఎస్‌ఐ అడగగా...కేవలం కిడ్నాప్ చేసే వారి జాబితా ఇస్తే చాలంటుంది. గతంలో చేసిన వారే ఇప్పుడు చేశారని ఎలా అనుకుంటారు అని ఎస్‌ఐ అడగ్గా...సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే..వాళ్ల చాలా ఫ్రొపెషనల్‌గా చేశారని తెలిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా పాత కిడ్నాపర్లే అయి ఉంటారని అంటుంది. దీంతో ఆ లిస్ట్ లక్ష్మీకి అందిస్తాడు ఎస్‌ఐ. ఈలోగా  వివేక్ పాత కార్లు అమ్మే దుకాణాలకు వెళ్లి ఎంక్వయిరీ చేస్తాడు. మరోవైపు అర్జున్ సీసీ కెమెరాలు శోధిస్తుంటాడు. ఇలా ముగ్గురు మూడు దారుల్లో పరిశోధన చేస్తుంటారు. కిడ్నాప్లు చేసే వాళ్ల ఫోన్ నెంబర్లను ఎస్‌ఐ నుంచి లక్ష్మీ సేకరిస్తుంది. ఇవన్నీ చాటుగా గమిస్తూ లక్ష్మీ ఏం చేస్తుందోనని ఆమెను  మనీషా, దేవయాని ఫాలో చేయడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Weather Today: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Navaratri 3rd day: ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!
ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!
Mysuru Dasara 2024: దసరా ఉత్సవాలకు రారాజు  మైసూరు దసరా -  రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!
దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!
Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget