Chinni Serial Today November 1st: చిన్ని సీరియల్: లోహిత, శ్రేయల మధ్య భావోద్వేగ సన్నివేశం! బాలరాజుని ఆఫ్ టికెట్ తప్పిస్తాడా!
Chinni Serial Today Episode November 1st బాలరాజు కోసం వెళ్లిన ఆఫ్‌టికెట్‌ని దేవా బంధించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహితను చూసి శ్రేయ కన్నీరు పెట్టుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. లోహిత కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఎలా ఉన్నావ్ లోహి అని శ్రేయ అడిగితే నువ్వు నాకు వరుణ్‌కి పెళ్లిలో సపోర్ట్ చేస్తావ్ అనుకున్నా కానీ నువ్వు సపోర్ట్ చేయలేదు..ఇప్పుడు చూడు నేను వరుణ్ ఎలా రోడ్డున పడ్డామో.. అని అంటుంది.
శ్రేయ లోహితో ముందే నువ్వు నాకు చెప్పుంటే నేను సాయం చేసేదాన్ని.. మధు మీకు పెళ్లి చేయడం వల్ల ఎవరికి మంచి జరిగిందో కానీ నీకు, నాకు, వరుణ్, బావకి చెడు జరిగింది.. అందరం విడిపోయాం,,బావ దూరం అయిపోయాడు అని శ్రేయ అంటుంది. ఇంతలో చందు అటు నుంచి వస్తుంటే లోహిత చూసి దాక్కుంటుంది. శ్రేయ చూసి షాక్ అయిపోతుంది. అతను మన స్టాఫ్ మెంబర్ కదా అతన్ని చూసి నువ్వు దాక్కుంటావేంటి అని శ్రేయ అడుగుతుంది. దానికి లోహి అతను మా ఫ్యామిలీ మెంబర్ అని అంటుంది. అదేంటి అని శ్రేయ షాక్ అయితే మా ఇంటి పనులు చూసుకుంటారు అని కవర్ చేస్తుంది.
లోహిత శ్రేయతో మధు మేటర్‌ని నువ్వు సీరియస్‌గా ట్రై చేయ్..మధు మ్యాడీని వలలో వేసుకోవాలని చూస్తుంది. నువ్వు జాగ్రత్త పడు.. మధుని కంట్రోల్ చేయ్ అంటుంది. శ్రేయ సంజయ్‌ని చూసి మధుని కంట్రోల్ చేయాలి అంటే సంజునే కరెక్ట్ అని అంటుంది. మ్యాడీ తన ఫ్రెండ్ రాహుల్‌తో చిన్ని గుడికి వచ్చిందని నిమ్మకాయ దీపం పెట్టిందని చెప్తాడు. గుడి వరకు వచ్చిన ఇద్దరం గుడిలో కలుసుకోలేకపోయాం అని మ్యాడీ ఫీలవుతాడు.
మ్యాడీ ఒక్కడే ఉండటం చూసిన మధు మ్యాడీకి కొత్త నెంబరు నుంచి కాల్ చేస్తుంది. మీరు ఎంతో బిజీగా ఉన్నా ఈ చిన్ని ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశారు అంటుంది. ఏంటి అని మ్యాడీ అంటే కవర్ చేస్తుంది మధు. మీ భర్త్‌డే ఉంది కదా నాకు పండగ అని గుడిలో పూజలే కాకుండా బ్లడ్ డొనేట్ చేస్తున్నామని చెప్పి తన పేరు చిన్మయి అని చెప్తుంది. మేం మీ ఫ్యాన్స్ అని గ్రూప్ ఉంది.. ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ చేస్తామని అంటుంది. ఇక మ్యాడీ డ్రస్ బాలేదని చెప్తుంది. దాంతో మ్యాడీ కాలేజ్‌లోనే ఉందేమో అని మొత్తం చూస్తాడు. నాగురించి నీకు ఎలా తెలుసు అని మ్యాడీ అడిగితే మీకు కూడా ఎవరి మీద అయినా ఇంట్రస్ట్ ఉంటే తన గురించి తెలుస్తాయని అంటుంది. మ్యాడీ చిన్నిని తలచుకొని నవ్వుతాడు.
కాలేజ్‌లోనే ఉంటూ నన్ను గమనిస్తున్నావ్ అని మ్యాడీ అంటే మధు ఫోన్ కట్ చేసేసి సిమ్ తీసేస్తుంది. తర్వాత మ్యాడీ దగ్గరకు వచ్చి ఏంటి హలో హలో అని అరుస్తున్నావ్ అంటుంది. కాలేజ్ అమ్మాయి కాల్ చేస్తుంది అని మ్యాడీ అంటే నిన్ను లవ్ చేస్తుందేమో అని మధు అంటుంది. దాంతో చిన్ని తప్ప ఇంకెవరూ నాకు లవర్‌గా రారు అని మ్యాడీ అంటాడు.
హాఫ్ టికెట్‌ని అతని మనిషి బాలరాజు ఉన్న లొకేషన్‌కి వస్తారు. ఆఫ్ టికెట్ రౌడీల కోసం టీ పట్టుకొని వెళ్తాడు. వాళ్లకి టీ ఇచ్చి తర్వాత వాళ్ల సిగరెట్ తాగడానికి వెళ్తే బాలరాజు దగ్గరకు వెళ్తాడు. కట్లు విప్పుతాడు. చిన్ని ఈ ఊరిలోనే ఉందని చెప్తాడు. ఇద్దరూ చిన్ని దగ్గరకు వెళ్దామని బయల్దేరితే దేవా వచ్చేస్తాడు. చిన్ని ఎక్కడుందో నీకు తెలుసా.. చిన్నిని నువ్వు చూశావా అని ఆఫ్ టికెట్‌ని కొడతాడు. చిన్ని గురించి చెప్పకపోతే చంపేస్తా అంటాడు. నన్ను చంపినా చెప్పను అని ఆఫ్ టికెట్ అంటే తనని కూడా కట్టేయమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















