(Source: Poll of Polls)
Illu Illalu Pillalu Serial Today November 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సందడిగా రామరాజు ఇంట్లో వేడుక! భద్రావతి ప్లానేంటి! ప్రేమ, ధీరజ్ ఇకపై ఫ్రెండ్స్!
Illu Illalu Pillalu Serial Today Episode November 1st రామరాజు తన కోడళ్లు తన పరువు కాపాడారని భద్రవతి వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode వేదవతి, ముగ్గురు కోడళ్ల సాహసం వల్ల ధీరజ్‌ని విడుదల చేస్తారు. ప్రేమ వెళ్లి ధీరజ్‌ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అందరూ ధరీజ్‌ని పట్టుకొని ఏడుస్తారు. శోభ ధీరజ్‌కి సారీ చెప్తుంది. ధీరజ్‌ని తీసుకొని ఇంటికి వెళ్లమని పోలీసులు చెప్తారు. 
భద్రావతి, సేనాపతి, విశ్వ వాళ్లు హ్యాపీగా దీపావళి వేడుక జరుపుకుంటారు. రామరాజు ఇళ్లు చీకటిగా ఉంటుంది. భద్రావతి తమ్ముడితో ప్రతీ రోజు దీపావళికి వెలుగులతో ఉన్న రామరాజు ఇల్లు చీకటి అయిపోయింది. వాడి పతనం మొదలైంది అని సంతోషపడతారు. ఇంతో రామరాజు కుటుంబం మొత్తం రెడీ అయి వచ్చేస్తారు. సేన, భద్రావతి షాక్ అయపోతారు.
రామరాజు ధీరజ్ భుజం మీద చేయి వేసి నా కొడుకు గురించి ఏం అన్నారురా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడా.. నా పరువు తీశాడన్నారు కదరా.. ఓ అమ్మాయి జీవితం కాపాడాడురా.. నా ఇళ్లు చీకటి అయిపోయిందని సంబరపడిపోయారు కదరా నా ముగ్గురు కోడళ్లు నా ఇంటికి వెలుగు తీసుకొచ్చారురా.. నాకు నా కుటుంబం అండగా ఉన్నంత కాలం మీరు నన్నేం చేయలేరురా గుర్తు పెట్టుకోండి.. ఇల్లు ఇల్లాలు పిల్లలతో నా కుటుంబం వెలిగిపోతుందిరా..మతాబులు వెలిగించండ్రా వీళ్ల చెవులు దద్దరిల్లిపోవాలి అని కొడుకుకి చెప్తాడు. ధీరజ్, చందు సాగర్ మతాబులు వెలిగిస్తారు. అందరూ సంతోషంగా దీపావళి చేసుకుంటారు. 
భద్రావతి విశ్వని పక్కకు తీసుకెళ్లి తట్టుకోలేకపోతున్నానురా ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నానురా.. ఆ రామరాజు ముఖంలో నవ్వు చూసి తట్టుకోలేకపోతున్నానురా.. వాడికి అది దూరం చేయాలి.. వాడి కుటుంబం మొత్తాన్ని చెల్లా చెదురు చేయాలి.. నువ్వు అస్సలు లేటు చేయకుండా అమూల్యని నీ దారిలోకి తీసుకొచ్చేయ్‌రా అని అంటుంది. రేపు నేను వేసే ప్లాన్‌కి అమూల్య నన్ను నమ్ముతుంది. నాతో ప్రేమలో పడుతుంది. 
ప్రేమ, ధీరజ్‌లు అరుగు మీద కూర్చొంటారు. ధీరజ్ ప్రేమతో నువ్వు నన్ను బయటకు తీసుకురావడానికి నువ్వు పడిన తపనకు ఆరాటానికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటాడు. ఆరాటం పోరాటం ఏం లేవు అంత ఊహించుకోకు.. నాది చాలా జాలి గుండె.. ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉంటే నేను తపన పడతా అంతే నీ విషయంలోనూ అంతే నీ ప్లేస్‌లో ఎవరూ ఉంటే ఇలాగే కాపాడుతా కానీ నీ విషయంలో కొంచెం డిఫరెంట్లే .. నువ్వు నా మెడలో తాళి కట్టావ్ కాబట్టి భర్త అనే బాధ్యత ఏడ్చింది కాబట్టి నేను నీ కోసం నీ భార్యగా ఇలా చేశా.. ఏం చేస్తాం నలుగురి కోసం నటించాలి కదా అని అంటుంది. 
ధీరజ్ ప్రేమకు సారీ చెప్పి ఫ్రెండ్స్‌లా ఉందా అని అంటాడు. నీతో నాకు ఫ్రెండ్షిప్ వద్దని అంటుంది. ధీరజ్ బతిమాలుతాడు. దాంతో ప్రేమ సరే అని షేక్హ్యాండ్ ఇస్తుంది. శోభని ఎలా కనిపెట్టావు.. అసలు నీకు బుర్రే లేదు కదా అని ధీరజ్ అంటే నాలో ఒక కరుడు కట్టిన పోలీస్ ఉన్నాడు.. చిన్నప్పుడు నేను లేడీ పోలీస్ సినిమాలు చూసి చూసి లేడీ పోలీస్ అవ్వాలి అనుకున్నా అంటుంది. ధీరజ్ నువ్వు పోలీస్ అవుతావా అని నవ్వుతాడు. మన హైట్ పర్సనాలిటీకీ నువ్వు పోలీస్‌వా పిచ్చ కామెడీగా ఉందే అని ధీరజ్ నవ్వుతాడు. నన్ను టార్చర్ చేయడం కంటే నీకు ఇంకే పని ఉందే అని అంటాడు. నేను రన్నింగ్‌లో తోపురా రేపు ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందాం అని ఛాలెంజ్ చేసుకుంటారు.
సాగర్ నర్మదని ఎత్తుకొని గిరగిరా తిప్పేసి నువ్వు గ్రేట్ నర్మద. నాన్న నన్ను పొగిడితే నాకు చాలా సంతోషం వేసింది. అందరి కోసం నిలబడతావ్. ఎంత కష్టం అయినా నిలబడతావ్.. బడ్జెట్ లేకుండా ఆగాను కానీ లేదంటే నీ కోసం గుడి కట్టేయానా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















