Chinni Serial Today January 5th: చిన్ని సీరియల్: నువ్వు నా భార్యవి కాదు.. అది పెళ్లే కాదు.. మధుకి షాక్ ఇచ్చిన మ్యాడీ!
Chinni Serial Today Episode January 5th మధుతో మ్యాడీ నువ్వు నాభార్యవి కాదు.. ఇది అసలు పెళ్లే కాదు నీకు మరో పెళ్లి చేస్తా అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు మ్యాడీల పెళ్లిని అంగీకరించినట్లు నాగవల్లి అందరి ముందు చెప్తుంది. ఇద్దరినీ ఇంట్లోకి హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. మధు కొత్త కోడలిగా మ్యాడీ ఇంట్లో ఉంటుంది. మధు తన అంతరాత్మతో మాట్లాడుతుంది. మధు అయినా చిన్ని అయినా నువ్వే కదా.. మ్యాడీ అయినా మహి అని తనే కదా ఇక ప్రాబ్లమ్ ఏంటి అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది.
మధు అద్దంలో కనిపిస్తున్న తన అంతరాత్మతో అదే పెద్ద సమస్య. మహి వాళ్ల అమ్మని చంపింది మా అమ్మే అని మహి నమ్ముతున్నాడు. నింద నిరూపించుకోకుండా మధుగా ఉన్న నన్ను మ్యాడీ పెళ్లి చేసుకున్నాడు. నేను చిన్నిగా ఓడిపోయాను.. మధుగా కూడా ఓడిపోయాను.. ఇప్పటి వరకు మా అమ్మ మీద ఉన్న నింద తొలగించలేక.. చిన్నగా ఓడిపోయాను.. నా మెడలో తాళి కట్టిన తర్వాత అయినా సరే నేను చిన్నిని అని మ్యాడీకి చెప్పకుండా ఓడిపోయాను.. మ్యాడీని మోసం చేశాను.. నా ముందు నిశ్చితార్థం జరిగింది.. పెళ్లి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రేయకి కాబోయే భర్తని పెళ్లి చేసుకొని తనని మోసం చేశా అని అనుకుంటుంది.
మ్యాడీని నువ్వేం మోసం చేయలేదు అని అంతరాత్మ మధుతో చెప్తుంది. శ్రేయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మ్యాడీ చెప్పాడు కదా.. అందులోనూ నీ తప్పు లేదు అని అంటుంది. ఈ పెళ్లి నువ్వు అనుకుంటే జరగలేదు కదా.. మహి, చిన్నిలుగా మీరు భవిష్యత్‌లో కలవడానికే ఈ తాళి నీ మెడలో పడింది అని అంటుంది. మ్యాడీ భార్యగా ఈ ఇంటి కోడలిగా నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తించాలే తప్ప జరిగింది తలచుకొని బాధ పడకూడదు అని అంతరాత్మ చెప్తుంది.
లోహిత నెత్తిమీద ఐస్ బ్యాగ్ పెట్టుకొని అసలు నాగవల్లి ఆంటీ ఆ మధుని ఎందుకు రమ్మని చెప్పింది.. వచ్చిందే అనుకో.. దాన్ని గుడిలో పెట్టాలి అని నాకు ఎందుకు అనిపించింది.. అని ఆలోచిస్తూ ఇక ముందు ముందు ఏం ఏం అవుతుందో ఏంటో అని అనుకుంటుంది. ఇంతలో వరుణ్ వచ్చి ఏమైంది అంటే జరిగిన దారుణానికి తల వేడెక్కిపోయింది అందుకే ఐస్ ప్యాక్ పెట్టుకున్నా అంటుంది. నీ చెల్లిని పెళ్లి చేసుకున్న వాడు ఆ మధుని చేసుకొని వచ్చాడు అది ఆలోచించు అని లోహిత అంటే.. అంతా తలరాత నువ్వు మా బావని బ్లేమ్ చేయకు అని అంటాడు.
మధు వెళ్తుంటే నాగవల్లి చిటికెలు వేసి పిలుస్తుంది. హారతి ఇచ్చి లోపలికి పిలిచానని ఆనందపడిపోతున్నావా.. కొత్త కోడలా.. నువ్వే చిన్ని అని తెలిసినా నీకు హారతి ఇచ్చి ఎందుకు పిలిచానో తెలుసా కొత్త కోడలా.. అవును గుడిలో ఏంటి కొత్త స్టోరీ అల్లారు.. నువ్వు మ్యాడీ ప్రేమించుకున్నారా.. ఆ గుడి సంప్రదాయం తెలిసే ప్లాన్ చేసుకొని రాత్రి అంతా గుడిలో ఉండి ఉదయం పెళ్లి చేసుకున్నారా.. నమ్మేశా అనుకున్నారా.. ప్రపంచం మొత్తం ఆ స్టోరీ నమ్మినా నీ నాగవల్లి చచ్చినా నమ్మదు అని నాగవల్లి అంటుంది. దానికి మధు మరి మ్యాడీ నా మెడలో ఎందుకు తాళి కట్టారు అని నమ్ముతున్నారు అని అడుగుతుంది.
దానికి నాగవల్లి జాలితో కేవలం నీ మీద జాలితో కట్టాడు. జీవితాంతం నువ్వు పెళ్లి చేసుకోకుండా నువ్వు మిగిలిపోతావని తాళి కట్టాడు. వాడు ప్రేమించిన చిన్నిని వాడు పెళ్లి చేసుకునే అవకాశం లేదు కాబట్టి జీవితాంతం బ్రహ్మచారిలో ఉండిపోవడానికి వాడికేం అభ్యంతరం లేదు.. హ్యాపీగా ఉంటాడు. కానీ నీ భవిష్యత్ కోసం అందరి ముందు జాలి పడి తాళి కట్టాడు. ఆ పెళ్లిని బొమ్మల పెళ్లిలా భావించి నీ మెడలో కట్టేసిన తాళి తీసేసి నీకు మరో పెళ్లి చేసి నీ లైఫ్ సెటిల్ చేయాలని ఆలోచించి ఉంటాడు నా కొడుకు మ్యాడీ. దాన్ని నువ్వు అపార్థం చేసుకొని వాడి మనసులో నీకు భార్య స్థానం ఇస్తాడని కలలు కనొద్దు. వాడి మనసులో నీకు ఎప్పటికీ భార్య స్థానం రాదు అని నాగవల్లి అంటుంది.
మధు అత్తతో ఈ రోజు జాలితో నా మెడలో తాళి కట్టేవాడు నన్ను భార్యగా ఎందుకు అనడు అని మధు అంటే నీ మీద ద్వేషం కలిగేలా చేస్తా.. అసహ్యం కలిగేలా చేస్తా అని అంటుంది. మ్యాడీ త్వరలోనే నాతో ఏడు అడుగులు వేసి నాకు భార్య స్థానం ఇస్తాడు. మధుగా చిన్నిగా మ్యాడీ మీద నాకు ఉన్న ప్రేమ చూసుకొని అంత నమ్మకం అని మధు అంటుంది. మీ అందరి ముందు నేను ప్రేమించిన వాడితో ఆ దేవుడు తాళి కట్టించాడు అంటే దేవుడు నా వైపు ఉన్నప్పుడే.. విడదీయడానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి.. కలవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తా.. ఫైనల్‌గా ఆ మెంటల్‌గా బాగా ప్రిపేర్ అవ్వండి లేదంటే అప్పుడు తట్టుకోలేరు అని మధు అంటుంది. మెడలో తాళి పడేసరికి ఇది రెచ్చిపోతుంది. నా ముందు రెచ్చిపోయిన వాళ్లకి చావు తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు అని నాగవల్లి అనుకుంటుంది.
మ్యాడీ గదిలోకి మధు వెళ్తుంది. మ్యాడీ మధుకి సారీ చెప్తాడు. గుడిలో అందరి ముందు మనం ప్రేమించుకున్నామని చెప్పాను క్షమించు అంటాడు. జీవితంలో లవ్‌లో ఫెయిల్ అయిన నాకు జీవితాంతం బ్రహ్మచారిలా ఉండిపోవడానికి ఏ అభ్యంతరం లేదు.. కానీ నీ జీవితం అలా అయిపోకూడదు అని నీ మెడలో తాళి కట్టాను అని చెప్తాడు. ఆ మాటలో మధు షాక్ అయిపోతుంది. తప్పు చేసిన వాళ్లు సారీ చెప్తారు నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు అంటాడు. థ్యాంక్స్ మధు నన్ను అర్థం చేసుకున్నావ్,, జరిగిన దాని కోసం నువ్వేం బాధ పడకు.. నీ చదువు పూర్తయిన తర్వాత నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి మధు ఏం అంటున్నావ్..మ్యాడీ పెళ్లి అయిన నాతో భర్తగా నువ్వు అనాల్సిన మాటలేనా అవి అని అంటుంది. అది తాళి కాదు.. జరిగింది పెళ్లి కాదు.. నేను నీ భర్తని కాను.. కేవలం అపద్ధర్మంగా నీ మెడలో తాళి కట్టాను అంతే అని మ్యాడీ అంటాడు. ఎలా అయినా ఇది తాళే నువ్వు నా భర్తవే.. కష్టసుఖమైనా నీతో కలిసి పంచుకుంటాను అని అంటుంది. నో నేను అలా అనుకోను నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఫ్రెండ్‌వి మాత్రమే భార్యవి మాత్రం కాలేవు అని మ్యాడీ అంటాడు. నా దృష్టిలో నువ్వు ఫ్రెండ్‌వి మాత్రమే కాదు భర్తవి అని మధు అంటే నేను నిన్ను భార్యగా చూడలేను అని మ్యాడీ అంటాడు. నేను చిన్నిని తప్ప ఇంకెవరినీ ప్రేమించలేను కాబట్టి నిన్ను ఎప్పటికీ భార్యగా చూడలేను అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















