అన్వేషించండి

Chinni Serial Today February 4th: చిన్ని సీరియల్: మధు కిడ్నాప్! చెత్తబండితో హైడ్రామా! మ్యాడీ కనిపెడతాడా!

Chinni Serial Today Episode February 4th చెత్త ఎత్తుకునేవాళ్లలా దేవా మనుషులు వచ్చి మధుని కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధునే చిన్ని అని తెలుసుకున్న దేవా మధుని కిడ్నాప్ చేసి తన మనుషులకు చెప్తాడు. మరోవైపు లోహిత ఎలా అయినా మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసేలా చేయాలి అని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. దేవా మనుషులు చెత్త ఎత్తుకునే వాళ్లలా వ్యాన్ తీసుకొని వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా మధుని తీసుకెళ్లిపోవాలని అనుకుంటారు. 

మధు వాళ్ల ఇంటికి కూడా వెళ్లి చెత్త అడుగుతారు. రోజు ఉదయం వస్తారు కదా సాయంత్రం వచ్చారేంటి అంటే రేపు ఉదయం రావడం లేదు అని ఇప్పుడు వచ్చాం అంటారు.. దాంతో స్వరూప మధుకి చెత్త వేయమని అంటుంది. మధు చెత్త వేయడానికి వెళ్లగానే మధుని కిడ్నాప్ చేస్తారు. అప్పుడే మార్కెట్ నుంచి వచ్చిన చంటి, సుబ్బారావులు మీరు ఎవరు ఎప్పుడూ చూడలేదు అని అంటే రోజూ వచ్చే రంగారావు తమ్ముడిని అని చెప్పి కవర్ చేసివెళ్తారు. కాస్త దూరం వెళ్లే సరికి బండి ట్రబుల్ ఇస్తుంది. అప్పుడే మ్యాడీ అటుగా బైక్ మీద నుంచి వస్తుంటాడు. మ్యాడీ బాబు చూసేస్తాడేమో అని వాళ్లు కంగారు పడతారు. మ్యాడీ వచ్చి నేను సాయం చేస్తాను అని మరోవ్యక్తితో కలిసి వ్యాన్ నెట్టుతాడు. ఇక మధుని కట్టేసిన మూట కిందకి జారి మధు చేయి కనిపిస్తుంది. మ్యాడీ చూసేస్తాడేమో అని చాలా కంగారు పడతారు. మ్యాడీకి అతని మీద అనుమానం వస్తుంది. అడిగితే ఏదేదో చెప్పి తప్పించుకుంటాడు.

మరోవైపు ఇంట్లో అందరూ మధు కనిపించడం లేదని కంగారు పడతారు. ఇంతలో మ్యాడీ రావడంతో మధు కనిపించడం లేదని తెలుస్తుంది. ఏం టెన్షన్ పడొద్దు.. అని మ్యాడీ చెప్పి చివరి సారి మధుతో ఎవరు మాట్లాడారు అని అడుగుతాడు. చెత్త ఇవ్వడానికి బయటకు వెళ్లింది తర్వాత లోపలికి రాలేదు అని స్వరూప ఏడుస్తుంది. రోజు పొద్దున్నే వచ్చేవాడు ఈరోజు సాయంత్రం వచ్చాడు అని అంటుంది. చెత్తబండి వాళ్లే మధుని కిడ్నాప్ చేశారు అంటావా అని లోహిత అంటుంది. ఇక మ్యాడీ మొత్తం గుర్తు చేసుకొని చెత్తబండివాళ్లు మధుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు లోహి అని అడుగుతాడు. ఇంతలో చెత్తకి కొత్తవాళ్లు వచ్చారని అంటాడు. దాంతో మ్యాడీ ఆ చెత్త బండి వాళ్లే మధుని కిడ్నాప్ చేశారు అని వరుణ్, మ్యాడీ వెళ్తారు. లోహిత చాలా ఖుషీ అయిపోతుంది. 

మ్యాడీ, వరుణ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక కిడ్నాపర్లు బండీ మార్చేసి మధుని ఓ ఇంటికి తీసుకెళ్తారు. ఓ కుర్చీకి మధుని కట్టేస్తారు. మ్యాడీ, వరుణ్‌లు చెత్త కలెక్ట్ చేసే వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం అడిగితే అలా సాయంత్రం రారు.. ఉదయం మాత్రమే చెత్త కలెక్ట్ చేస్తారని చెప్తారు. దాంతో మ్యాడీ పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారు అని అంటాడు. వరుణ్, మ్యాడీ ఇద్దరూ మధుని వెతకడానికి మళ్లీ వెతుకుతారు. మరోవైపు లోహిత నాగవల్లికి కాల్ చేస్తుంది. ప్లాన్ ఏ వేస్ట్ అయినా ప్లాన్‌ బీ వర్కౌట్ అయింది ఆంటీ మీరు వెరైటీగా చెత్త మనుషులతో మధుని కిడ్నాప్ చేయించారని నాకు తెలుసు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget