అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 3rd: పక్కింట్లో పాలు తెచ్చి టీ పెట్టిందిని శ్రీలక్ష్మీపై గొడవపడిన ప్రియంవద...భార్యను తీసుకుని గుడికి వెళ్లమని మ్యాడీని ఆదేశించిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 3rd: పక్కింట్లో పాలు తెచ్చి టీ పెట్టిందిని శ్రీలక్ష్మీపై గొడవపడిన ప్రియంవద...భార్యను తీసుకుని గుడికి వెళ్లమని మ్యాడీని ఆదేశించిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: పక్కింటికి వెళ్లి పాలుతీసుకొచ్చి శ్రీలక్ష్మీ ఇంట్లో అందరికీ టీ పెట్టి ఇస్తుంది.అందరూ ఎంతో అద్భుతంగా ఉందని అంటారు. మ్యాడీకి టీ ఇస్తే అతను తాగడు.నాకు టీ వద్దని చెప్పగా....వాళ్ల పిన్ని నీకు టీ అంటే ఇష్టం కదరా అంటుంది. తన చేతులతో ఇచ్చిన టీ తాగనని అనగా...మీతోనే  నా చేతి టీ తాగిస్తానని లక్ష్మీఅంటుంది. వాచ్‌మెన్‌కు టీ ఇవ్వడానికి లక్ష్మీ వెళ్లగానే పక్కింటి సుశీల వస్తుంది. ఇందిరను పలకరిస్తుంది.ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావని ఇందిర అడగ్గా....మీఇంటి పని అమ్మాయి కోసం వచ్చానని చెబుతుంది. మా ఇంట్లో పని అమ్మాయి  లేదని చెప్పినా....లేదు ఇందిర మీ ఇంట్లో నుంచే వచ్చాని చెప్పి పాలు తీసుకుని వచ్చిందని చెబుతుంది.ఇవాళ మా ఇంట్లో పనిఅమ్మాయి రాకపోతే ఇంట్లో గిన్నెలన్నీ తోమి వచ్చిందని....హడావుడిలో ఆమెకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయానని...ఇప్పుడు ఇచ్చి వెళ్తామని వచ్చానంటూ చెబుతుంది. అసలు మా ఇంట్లో పనిఅమ్మాయిలు ఎవరూ లేరని చెప్పినా  వినదు.ఇంతలో శ్రీలక్ష్మీ వచ్చి ఏంటి అమ్మగారు ఇలా వచ్చారని అనగా....ఇదిగో ఈ అమ్మాయే అంటూ ఆమె చేతిలో డబ్బులు పెడుతుంది. మీకు చేతకావడం  లేదంటే  పని చేసిపెట్టానే గానీ..డబ్బులు కోసం కాదని చెప్పడంతో  అందరూ శ్రీలక్ష్మీని అదోరకంగా చూస్తారు.ఇంతలో సూర్యనారాయణ లేచి...ఆ  అమ్మాయి పని అమ్మాయి కాదని మా ఇంటి కోడలని చెబుతాడు. అదేంటి మీరు ఎవరికీ చెప్పకుండానే మీ మనవరాలి పెళ్లి చేశారు. ఆ విషయం మీ వాచ్‌మెన్‌ చెబితేనే తెలిసిందని....ఇప్పుడు ఈ పెళ్లి ఎప్పుడు చేశారని అడుగుతుంది. అక్కడే పెళ్లి చేయాల్సి వచ్చిందని...ఆ అమ్మాయి మా మధుసూధన్ భార్య అని చెబుతాడు. దీంతో ఆమె ఇంట్లో ఉన్న అందరికి క్షమాపణలు చెబుతుంది. ఏమాటకామాటే గానీ...ఈ అమ్మాయి ఎంతో మంచిదని, మీ ఇంట్లో వాళ్లు ఎవరినీ కలవరని, కానీ ఈ  అమ్మాయి అలా కాదని అందరితో కలుపుగోలుతనంగా ఉందని చెబుతుంది. ఇంత పెద్దింటికి కోడలు అయినా నేను అడగ్గానే మా ఇంట్లో పనులన్నీ చేసిపెట్టిందని....ఈ  అమ్మాయిని మీకోడలుగా తెచ్చకోవడం మీరు చేసుకున్న అదృష్టమని చెబుతుంది. ఏమీ అనుకోవద్దని చెప్పి వెళ్లిపోతుంది. శ్రీలక్ష్మీని పిలిచి సూర్యనారాయణ ఎంతో సంతోషపడతాడు.నువ్వు మాకే కాదని...చుట్టుపక్కల వారికి కూడా ఎంతో నచ్చుతున్నావని అంటాడు. ఇంతలో ప్రియంవద కలుగజేసుకుని ఆ పాతచీరకట్టుకుని పనిమనిషిలా ఉండకపోతే కొంచెం మంచి చీర కట్టుకోవచ్చు కదా అని అంటుంది.దీంతో సూర్యనారాయణ ఇంట్లో వాళ్లపై మండిపడతాడు.ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఓ కొత్త చీర కోడలికి ఇవ్వడం తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసి భార్యను తీసుకుని బయటకు వెళ్లిపోతాడు.
                                      సూర్యనారాయణ వెళ్లిన వెంటనే అందరూ టీ గ్లాస్‌లు కిందపడేస్తారు. పక్కింట్లో తెచ్చిన పాలతో మాకు టీ పెట్టి ఇస్తావా అని అంటారు. ఇందులో తప్పేమి ఉందని...మనకు పాలు రావని వాచ్‌మెన్‌ చెబితే పక్కింటికి వెళ్లి అడిగి తీసుకొచ్చానని ఇందులో తప్పేమి ఉందని శ్రీలక్ష్మీ అంటుంది. ఈ మాటలు కోపం వచ్చిన ప్రియంవద ఆమె ముఖంపై టీ కొడుతుంది. మమ్మల్ని పాలకు కూడా గతిలేని వాళ్లను చేశావు కదే అంటూ మండిపడుతుంది. ఇళ్ల నెంట తిరిగి అడుక్కునే బుద్ది ఎక్కడి నుంచి వ‌చ్చిందన మండిపడుతుంది. అయినా వాళ్లకు పాలుపోసిన వాళ్లే మనకు పాలు పోస్తారని...ఇందులోతేడా  ఏం ఉందని శ్రీలక్ష్మీఅంటుంది. మీకు పొద్దున్నే టీ ఇవ్వాలని ఆలోచించానే తప్ప....ఇలా అడుక్కుని తెచ్చానని అనుకోలేదని అంటుంది. లోపలికి వెళ్లి చీపురు తీసుకుని వచ్చి ఊడ్చేందుకు సిద్ధమవుతుండగా...సూర్యనారాయణ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. మ్యాడీ చెప్పొద్దని సైగ చేయడంతో చేతిలో టీ కప్పు కిందపడిపోయిందని శ్రీలక్ష్మీ అబద్దం చెబుతుంది.ఆయన సరేనని కొత్త చీర ఆమెకు ఇచ్చి కట్టుకుని రమ్మని అంటాడు.ఇంతలో మ్యాడీ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా  ఆగమని చెబుతాడు. నీ భార్యను తీసుకుని గుడికి వెళ్లమని చెబుతాడు. నాకు బయట పని ఉందని చెప్పినా...ముందు గుడికి తీసుకెళ్లి ఆ తర్వాత వెళ్లమని హెచ్చరిస్తాడు. ప్రియంవద వాళ్లిద్దరే ఎందుకు మనం కూడా వెళ్ధామని అన్నా కూడా....లేదు వాళ్లనే వెళ్లనివ్వండని సూర్యనారాణయ చెబుతాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget