అన్వేషించండి

Chinni Serial Today February 23rd:చిన్ని సీరియల్: మధునే చిన్ని అని చెప్పించడానికి నాగవల్లి రంగం సిద్ధం! జైలర్ నిజం చెప్పేస్తుందా?

Chinni Serial Today Episode February 23rd మధుకి మ్యాడీ ఐలవ్‌యూ చెప్పాలి అనుకోవడం ఆ విషయం నాగవల్లి, దేవాలకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు లోహితతో నీ గురించి నేను చెప్తా  చందుని, అత్తని తీసుకొస్తా కానీ నేను అలా చెప్పను అని అంటే నువ్వు చెప్పినా నాకు ఏం కాదు.. నేను వరుణ్‌ని పెళ్లి చేసుకోవడానికి అబద్ధం చెప్పాను అని అందరికీ చెప్తా అని అంటుంది. ముందు అందరూ నా మీద ఆవేశపడినా తర్వాత నా ప్రేమ అర్థం చేసుకొని ఇంట్లోకి తీసుకొస్తారు.. కానీ నువ్వు చిన్ని అని తెలిశాక నిన్ను రానివ్వరు.. నేను ఆస్తి కోసం మాత్రమే మోసం చేశా.. నువ్వు మాత్రం చిన్ని ప్రేమని అడ్డు పెట్టుకొని నాటకం ఆడావు.. అయినా నీ మీద నాగవల్లి ఆంటీకి చాలా కోపం ఉంది.. అది గుర్తు పెట్టుకో అని అంటుంది.

మ్యాడీ ప్రేమికుల రోజు కోసం డెకరేషన్ చేయించడానికి మాట్లాడుతూఉంటాడు. అటుగా వరుణ్ వెళ్లి మాట్లాడుతాడు. నాగవల్లి, దేవా అటుగా వెళ్తూ ఆ మాటలు వింటారు. రేపు అందరి ముందు మధుకి ఐలవ్‌యూ చెప్తానని మ్యాడీ అంటాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. రేపటితో గందరగోళాలు అన్నీ పోయి జీవితాంతం మధుతో సంతోషంగా ఉంటాను అని అంటాడు. వరుణ్ చాలా సంతోషపడతాడు. మా ఇద్దరినీ ఆ దేవుడు కూడా విడదీయలేడు అంత ప్రేమ మధు వల్లే అని అంటాడు. దేవా ఆలోచిస్తూ మధుకి వీడు ఇంత కనెక్ట్ అయిపోతున్నాడు ఏంటి.. అదే చిన్ని అని తెలిసినా ఇలాగే ప్రేమిస్తాడా అని అనుకుంటాడు. దేవా అక్కడి నుంచి వెళ్లడం నాగవల్లి చూస్తుంది. 

చిన్నిని చంపేసుంటే బాగుండేది.. చిన్ని ఇప్పుడు జాగ్రత్త పడిపోయింది.. మ్యాడీని వెంట తీసుకెళ్తుంది. ఎలా దాన్ని బయటకు పంపాలి.. ఎలా మ్యాడీకీ దూరం చేయాలి అని అనుకుంటాడు. ఇంతలో నాగవల్లి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అని అంటే మ్యాడీ నుంచి చిన్నిని దూరం చేయడం ఎలా అని అంటాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. చిన్నిని మ్యాడీని దూరం చేయడం ఏంటి అని అడిగితే మధుని మ్యాడీనీ దూరం చేయాలి అని అంటాడు. మధు, చిన్ని ఒక్కరేనా అని అడుగుతుంది. అలా కాదు.. ఇద్దరూ వేరు వేరు అని కవర్ చేస్తాడు. మధు, మ్యాడీలను ఎలా దూరం చేస్తున్నావ్ అని దేవా అడిగితే ప్రేమికుల రోజున విడదీస్తా అని అంటుంది. 

మధు నిద్రపోతున్న మ్యాడీని చూసి నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి.. మధుగా నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావ్,.. మధుగా నువ్వు నన్ను ప్రేమించొద్దు.. చిన్నిగానే ఆ ప్రేమ నాకు కావాలి.. నువ్వు నాకు చిన్నిగానే ప్రేమించాలి.. నీ ప్రేమ అయినా ద్వేషం అయినా నాకు చిన్ని గానే కావాలి.. రేపు నువ్వు నాకు నీ మనసులో ప్రేమ చెప్పడానికి ఒక్క నిమిషం ముందు అయినా నేను నీకు నేనే చిన్ని అని చెప్పేస్తా అని అనుకుంటుంది. నేను చెప్పిన నిజం విని నన్ను క్షమిస్తావా.. లేదంటే ద్వేషిస్తావో నీ ఇష్టం అని అనుకుంటుంది. 

నాగవల్లి సీరియస్‌గా ఉంటే లోహిత కాఫీ తీసుకెళ్తుంది. నాగవల్లితో ఈరోజు ఫిబ్రవరి 14 అని చెప్తుంది. ఈ రోజు ప్రేమికుల రోజు కదా ఆంటీ అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నావో నేరుగా చెప్పు అని నాగవల్లి అంటే ఈ రోజు మ్యాడీతో చిన్నిని గెంటేస్తా అన్నారు కదా అంటుంది. దానికి నాగవల్లి నా దగ్గర ప్లాన్ ఉంది అది అమలు చేయాల్సింది నువ్వే అని లోహితకు ప్లాన్ చెప్తుంది. మీరు చెప్పింది చెప్పినట్లే చేస్తా అని లోహిత అంటుంది. నాగవల్లి తనకు ప్లాన్ చెప్పలేదు కాబట్టి ప్లాన్ బీ కూడా రెడీ చేసుకోవాలి అని దేవా ప్లాన్ చేస్తారు. అందుకు జైలర్‌ని ఇంటికి పిలుస్తాడు. వచ్చి తనేం చేయాలో మొత్తం చెప్తాడు. జైలర్ సరే అంటుంది. 

జైలర్ ఇంటికి వస్తుంది. తనకు ప్రమోషన్ వచ్చిందని దేవా, నాగవల్లితో చెప్తుంది. మధు కాఫీ చేస్తుంటే నాగవల్లి మరో కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. దేవా జైలర్‌తో నేను చెప్పినట్లు చేయ్ అని అంటాడు. ఇంతలో మ్యాడీ రావడంతో దేవా మ్యాడీని పరిచయం చేస్తాడు. మధు కాఫీ తెస్తూ జైలర్‌ని చూసి షాక్ అయిపోతుంది. ఆవిడను చూసి మధు కంగారుగా మళ్లీ లోపలికి వెళ్లిపోతుంది. నాగవల్లి మధుని పిలుస్తుంది. మధు కంగారు పడటం చూసి జైలర్‌ని చూసి షాక్ అయినట్లు ఉందని అనుకొని మధు దగ్గరకు వెళ్లి ఇక్కడే ఉన్నావ్ ఏంటి రా అని పిలుస్తుంది. మధుని తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget