Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 21st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: యమున ప్రాణాలకు ముప్పు! విహారి, లక్ష్మీల ఆవేదన!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode February 21st యమునని భుజంగం చంపేస్తానని విహారికి కాల్ చేసి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అజ్జాతవ్యక్తి భుజంగం విహారికి కాల్ చేసి మీ అమ్మ గురించి అంబులెన్స్ బుక్ చేయ్.. అని బెదిరిస్తాడు. విహారి, లక్ష్మీలు షాక్ అయిపోతారు. మీ అమ్మని కాల్చడానికి స్మశానంలో కట్టెలు ఆర్డర్ చేసుకో అని అంటాడు. విహారి కంగారు పడి అమ్మని వాడు టార్గెట్ చేశాడు.. నువ్వు వాడి డిటైల్స్ సేకరించు.. నేను అమ్మని కాపాడుతా అని అంటాడు.అక్కడే బిచ్చగాళ్లలా ఉన్న అమ్మిరాజు తండ్రిని పని వాడు విహారి, లక్ష్మీలను చూస్తారు. లక్ష్మీ వాళ్లని గుర్తు పట్టకుండా దాక్కుంటారు.
లక్ష్మీ యమున గురించి ఆలోచిస్తుంది. యమునమ్మని కిడ్నాప్ చేయాలి అని చూస్తుంది ఎవరు.. బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరు అని అనుకుంటూ వెళ్తుంది. ఇంతలో అమ్మిరాజు తండ్రి, పానకాలు లక్ష్మీని కొట్టాలి అనుకుంటారు. లక్ష్మీని వేరే వాళ్లు పిలవడంతో లక్ష్మీ వెళ్లిపోతుంది. దాంతో పానకాలు అయ్యగారినే చితక్కొట్టేస్తాడు. లక్ష్మీ భుజంగం కోసం డిటైల్స్ తెలుసుకునే పనిలో ఉంటుంది. తర్వాత లక్ష్మీ సంధ్యకి కాల్ చేస్తుంది. అడ్రస్ గురించి చెప్తుంది. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌లో పర్మిషన్స్ ముఖ్యమని చెప్తుంది. ఈ ఒక్కసారికి సాయం చేయమని అడుగుతుంది. దాంతో సంధ్య సరే అంటుంది.
విహారి తల్లి కోసం ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు యమున గుడికి బయల్దేరుతుంది. విహారి కంగారుగా ఇంటికి వచ్చి పండుతో అమ్మ ఇంట్లోనే ఉంది కదా.. ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని అడుగుతాడు. ఇప్పుడే అమ్మగారు గుడికి వెళ్లారని పండు చెప్పడంతో విహారి చాలా కంగారు పడతాడు. అమ్మతో నువ్వు ఎందుకు వెళ్లలేదురా.. అమ్మని చూసుకోవడం తప్ప నీకు ఇంకా ముఖ్యమైన పని ఏం ఉందిరా అని తిట్టి యమున కోసం పరుగులు పెడతాడు. యుమున గుడికి వెళ్తుంది. యుమనని కిడ్నాప్ చేయడానికి భుజంగం మారువేషంలో గుడిలో కాపు కాసి ఉంటాడు. విహారి కింటిన్యూగా యమునకు కాల్ చేస్తూనే ఉంటాడు. యమున ఫోన్ కారులో ఉండిపోవడంతో లిఫ్ట్ చేయదు.. అదే టైంలో విహారికి లక్ష్మీ కాల్ చేస్తుంది. విహారి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో లక్ష్మీ కూడా చాలా కంగారు పడుతుంది.
అమ్మిరాజు తండ్రి, పానకాలు గుడిలో అడుక్కుంటూ ఉంటారు. వాళ్ల పక్కనే భుజంగం అడుకున్న వ్యక్తిలా గెటప్ వేసి అక్కడే కూర్చొంటాడు. యమున గుడిలోకి వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవణ్ని దర్శించుకోవడానికి వెళ్తుంది. భుజంగం యమున కోసం కాపు కాస్తూ ఉంటాడు. మరోవైపు విహారి తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కంగారు పడి స్పీడ్‌గా కారు డ్రైవ్ చేస్తూ వస్తుంటాడు. యమున విహారి జీవితం రోజు రోజుకి కష్టతరం అయిపోతుందని లక్ష్మీ గురించి విహారి నిజం చెప్పేలా చేయమని దేవుడికి దండం పెట్టుకొని చేతిలో హారతి వెలిగించుకుంటుంది.
మరోవైపు లక్ష్మీ పండుకి కాల్ చేసి యమున గురించి అడుగుతుంది. యమునమ్మ ఇంట్లో లేరని గుడికి వెళ్లినట్లు పండు చెప్తాడు. లక్ష్మీ కంగారు పడుతుంది. ఏమైందని పండు అడుగుతాడు. లక్ష్మీ కూడా గుడికి బయల్దేరుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























