Chinni Serial Today September 9th: చిన్ని సీరియల్: మ్యాడీ కావేరి ఫొటో చూసేశాడా? మధుకి గాజులు తొడిగిన మహికి పెళ్లి కొడుకు మీద అనుమానం!!
Chinni Serial Today Episode September 9th మహి మధుకి పెళ్లి చీర తీసుకొచ్చి తన చేతులతో గాజులు తొడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని కోసం వచ్చిన పోలీసుల్ని లోహిత తప్పుదారి పట్టిస్తుంది. తర్వాత శ్రేయ లోహిత కాల్ మాట్లాడుతారు. మధు, చిన్నిల శని తప్పిపోతే తర్వాత నేను మా బావ మహి పెళ్లి చేసుకుంటాం అని శ్రేయ అంటుంది. అప్పుడే వరుణ్ వచ్చి ఎప్పుడూ పెళ్లి గోలేనా చదువు గురించి ఏం ఉండదా అని అడుగుతాడు.

వరుణ్ మాటలు లోహిత విని నేను మాట్లాడుతా అంటుంది. ఏంటి సార్ మమల్ని పూర్తిగా మర్చిపోయారు.. బాగా బిజీ అని మాట్లాడుతుంది. పెళ్లికి రావాల్సింది అంటుంది. మా బావకి మధు ఫ్రెండ్ కాబట్టి మా అత్తయ్య పంపింది.. నన్ను అయితే పంపదు అని అంటాడు. ఇక లోహిత వరుణ్‌కి నాలో నీకు నచ్చేది ఏంటి అని క్వాలిటీస్ అడుగుతుంది. వరుణ్ లోహిత గురించి చెప్తాడు. నువ్వు మంచిదానివి,, మంచి ఫ్రెండ్‌వి.. కోపం ఎక్కువా ఇలా నీ క్వాలిటీస్ నచ్చుతాయి అని అంటాడు. దానికి లోహిత ఇవన్నీ గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుదాం అంటుంది. ఇక వరుణ్ అయితే లోహిత తనని ఇష్టపడుతుందేమో అని అనుమాన పడతాడు. 
మధు పెళ్లి వేడుకుల అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మొన్న హల్దీ, నిన్న మెహిందీ ఫంక్షన్ సంతోషంగా జరిగాయి.. మహి ఫ్రెండ్ అంతా సందడిగా పెళ్లి మండపం డెకరేషన్ చేస్తుంటారు. మహి అందరికీ పనులు పురమాయిస్తుంటాడు. మహి వాళ్లకి సుబ్బు కాఫీ ఇస్తాడు. కోట్ల ఆస్తి ఉన్న నువ్వు కూడా ఇలా పని చేయడం నీ లాంటి ఫ్రెండ్ ఉండటం మధుతో పాటు అందరూ చాలా అదృష్టవంతులు అని అంటారు. చంటి పరుగులు పెడుతూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. అతని ఫోన్ పడిపోతుంది. అతను మధు ఫొటో చూస్తూ వస్తాడు. 
చంటిని ఆ వ్యక్తి తిడుతుంటే మహి వెళ్లి కూల్ చేసి ఫోన్ ఇస్తాడు. అందులో మధు ఫొటో చూసి మీ దగ్గర మధు ఫొటో ఉంది ఏంటా అనుకుంటాడు. తర్వాత అతన్ని ఎంక్వైరీ చేస్తాడు. శివ ఫ్రెండ్ అని మధు ఫొటో అందరికీ వాట్సాప్ చేయమని చెప్పాడని అంటాడు. మహికి అతని ప్రవర్తన మీద అనుమానం వస్తుంది.
మధుని సుబ్బు, స్వరూపలు కావేరి ఫొటో దగ్గరకు తీసుకెళ్లి దీపం పెట్టి దండం వేయమని చెప్తారు. మధు ఏడుస్తూ చేస్తుంది. తల్లికి దండం పెట్టుకుంటూ అమ్మ నా పెళ్లికి నువ్వు పై నుంచి ఆశీర్వాదం ఇస్తావని నాకు తెలుసు కానీ నాన్న ఆచూకి ఎక్కడ ఉందో తెలీడం లేదు.. నాన్నకి నా పెళ్లి చూసే అదృష్టం లేదని ఏడుస్తూ నాన్న ఆచూకి తెలిసేలా చేయమని అంటుంది. 
స్వరూప ఏడుస్తూ కావేరమ్మా నీకు ఇచ్చిన మాట ప్రకారం మధుని మా కన్నబిడ్డలా చూసుకున్నాం. ఓ మంచి సంబంధం వచ్చింది.. మధు పిల్లాపాపలతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి.. మధుని దగ్గరకు తీసుకొని నిన్ను నవమాసాలు మోసి కనకపోయినా నీకు పెళ్లి అవుతుంటే నాకు గుండె తరుక్కుపోతుందని ఏడుస్తుంది. సుబ్బారావు కూడా ఏడుస్తాడు. 
లోహిత చాటుగా అంతా చూస్తుంది. అక్కడే ఉన్న కావేరి ఫొటో చూసి షాక్ అయిపోతుంది. కావేరి ఫొటో మ్యాడీ చూస్తే మధునే చిన్ని అని తెలిసిపోతుంది. మ్యాడీ ఈ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి అనుకుంటుంది. లోహిత ఏం తెలీకుండా ఎవరు అది అని అడుగుతుంది. దాంతో స్వరూప తను మా అక్క అని అంటుంది. మధు కోసం మ్యాడీ అటుగా వస్తాడు. కావేరి ఫొటో కనిపించకుండా ఆ ఫొటోకి అడ్డుగా నిల్చొంటుంది. 
మ్యాడీ మధుతో మధు నీకు స్పెషల్‌గా చీర తెస్తాను అన్నాను కదా అని చీర ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు. మధు చాలా బాగుంది అని అంటుంది. నువ్వు పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి అని అంటాడు. దానికి స్వరూప అదే కట్టుకుంటుంది బాబు.. నువ్వు చెప్పావని మేం పెళ్లి చీర తీసుకోలేదు అని అంటుంది. ఇక మ్యాడీ మధు కోసం గాజులు కూడా ఇస్తాడు. చాలా బాగున్నాయి అని మధు ఎమోషనల్ అయిపోతూ గాజులు వేసుకుంటుంటే నేను హెల్ప్ చేస్తా అని మ్యాడీ మధుకి గాజులు వేస్తాడు. మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. చీర దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి కట్టుకుందువురామ్మా అని మధుని స్వరూప తీసుకెళ్తుంది. 
లోహిత మనసులో నీ ముఖానికి అంత కాస్లీ చీర కావాలా అని అనుకుంటుంది. పెళ్లి కొడుకు శివకి మధుని బేరమాడిన వ్యక్తి ఇంకో 50 లక్షలు ఎక్కువైనా ఇస్తాం కానీ మధుని రేపు సాయంత్రం హైదరాబాద్ తీసుకురావాలని చెప్తాడు. డబ్బుకి ఆశపడిన శివ ఒకే అని అంటాడు. శివ టెన్షన్ పడటం మహి చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















