Chinni Serial Today May 6th: చిన్ని సీరియల్: "నేనే కావేరిని అన్నయ్య.. నా భర్తని చిన్ని ఫంక్షన్‌లో ఉండనివ్వు". సంతోషంలో ఫ్యామిలీ!
Chinni Today Episode చిన్ని పుష్పవతి అలంకరణకు కావేరి తన భర్త బాలరాజుని ఉండనివ్వమని అన్నయ్యతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని పుష్పవతి అయిందని తెలిసి సత్యంబాబు సంతోషంతో అందుకు కావాల్సినవన్నీ తీసుకొని వస్తాడు. ఇక బాలరాజు కూడా కాలనీలో ముగ్గురు ఆడవాళ్లతో కలిసి పువ్వులు, పళ్లు, తాంబూలం అన్నీ తీసుకొని బయల్దేరుతారు. సత్యంబాబు కొన్ని వస్తువులు మర్చిపోవడంతో చందుని పంపిస్తాడు. ఇక సరళ ముత్తయిదువుల్ని పిలుస్తా అని చెప్పి చిన్నీకి డ్రస్ వేయమని ఉషకి చెప్తుంది.
చిన్ని పట్టు బట్టలు పట్టుకొని కావేరి మురిసిపోతుంది. బాలరాజు అక్కడికి వస్తాడు. ముందు తాను సత్యంబాబుతో మాట్లాడిన తర్వాత ఇంటికి మీరు వద్దురు అని చెప్పి వెళ్తాడు. చిన్ని సంతోషిస్తుంది. కావేరి వాళ్లు టెన్షన్ పడతారు. సత్యంబాబు రాజుతో ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. ఇలాంటి టైంలో రాకుండా ఎలా ఉంటాను సత్యంబాబు ఎంతైనా తన తండ్రిని నేను అంటాడు. ఏమైనా నువ్వు రాకూడదు అని సత్యంబాబు అంటాడు. దానికి రాజు ప్లీజ్ సత్యంబాబు ఉన్న ఒక్కగానొక్క కూతురు తనకి సంబంధించిన వేడుక ఇది ఆ వేడుక కల్లారా చూసే అదృష్టం నాకు ఇవ్వు సత్యంబాబు అని బతిమాలుతాడు. సత్యంబాబు కాలు పట్టుకుంటాడు. నీలాంటి వాడి చేతులు తగిలినా మాకు పాపం చుట్టుకుంటుంది మర్యాదగా వెళ్లిపో అని అంటాడు.
సత్యంబాబుని రాజు చాలా బతిమాలుతాడు. ఇంతలో చిన్ని మామయ్య ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని టీచర్ చెప్పింది ఈ టైంలో నాన్న కూడా ఉంటే బాగుంటుంది మామయ్య ఉండనివ్వు మామయ్య అంటుంది. సత్యంబాబు మాత్రం వద్దని అంటాడు. రాజు మెడ పట్టుకొని గెంటేయబోతే కావేరి ఆపి సత్యంబాబుని మాట్లాడాలి అని లోపలికి తీసుకెళ్తుంది. చిన్ని కోరుకున్నట్లు తనని ఉండనివ్వమని అడుగుతుంది. సత్యంబాబు మాత్రం వద్దని అంటాడు. వాడు దుర్మార్గుడని నీకు వాడి గురించి తెలీదు అని అంటాడు. దానికి కావేరి నాకు తెలుసు వాడి గురించి నా కంటే ఎవరికీ ఎక్కువ తెలీదు ఎందుకంటే నేను ఉషని కాదు కావేరిని అన్నయ్య అని కావేరి నిజం చెప్పేస్తుంది.
సత్యంబాబు కావేరిని దగ్గరకు తీసుకొని నాకు తెలుసమ్మా కానీ నువ్వు చెప్పేవరకు అడగకూడదని ఊరుకున్నానని అంటాడు. కావేరి అన్నయ్యని హగ్ చేసుకొని ఏడుస్తుంది. చూడమ్మా చెల్లి బతికే ఉందని తెలిసి కూడా చెల్లి ఫొటోకి దండ వేశానమ్మా ఈ దుస్థితి ఏ అన్నకు రాకూడదు అని అంటాడు. కావేరి అన్నయ్యతో తల్లిలా చిన్ని పక్కన ఈ సమయంలో నేను ఉండలేనన్నయ్యా కనీసం ఆయన్ని అయినా తండ్రిలా ఉండనివ్వు అని చెప్తుంది. అన్నయ్యని బతిమాలుతుంది. దాంతో సత్యంబాబు సరే అంటాడు.
సత్యంబాబు బయటకు వచ్చి అతన్ని ఉండమను కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండమని చెప్పమని అంటాడు. సత్యంబాబు సంతోషంతో అందర్నీ తీసుకొస్తాడు. చిన్ని, కావేరి చాలా సంతోషపడతారు. ఇక లోహిత తల్లితో నువ్వేంటి అమ్మ చిన్ని మెచ్చూర్ అయితే ఇంత సంతోషంగా ఉన్నావని అంటుంది. దాంతో సరళ చాలా గిఫ్ట్‌లు వస్తాయి కదా అందుకే అని అంటుంది. మన వాళ్లు అయితే చిన్న గిఫ్ట్‌లు ఇస్తారు అదే నాగవల్లి ఆంటీ వాళ్లు అయితే కాస్లీ గిఫ్ట్‌లు ఇస్తారని అంటుంది. దాంతో సరళ వెంటనే నాగవల్లికి కాల్ చేసి విషయం చెప్తుంది. సరళ ముత్తయిదువుల్ని పిలిచి వెంట తీసుకెళ్తుంది.
ముత్తయిదువులు అందరూ చిన్నిని కూర్చొపెట్టి దీవిస్తారు. బాలరాజు కూడా కూతుర్ని దీవిస్తాడు. కావేరి, బాలరాజు, సరళ, సత్యంబాబు అందరూ చాలా సంతోషపడతారు. మంగళహారతి ఇస్తారు.మరోవైపు నాగవల్లి దేవా దగ్గరకు పరుగులు తీసి పీటీ టీచర్ ఇంటికి వెళ్లే టైం వచ్చిందని చిన్ని మెచ్చూర్ అయిందని చెప్తుంది. ఈ సారి తనని వదిలేదే లేదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















