Chinni Serial Today May 5th: చిన్ని సీరియల్: రాజుతో వెళ్లిపోతానన్న కావేరి.. కుప్పకూలిపోయిన సత్యం.. సందడి చేసిన చిన్ని!
Chinni Today Episode చిన్ని పుష్పవతి అయిందని తెలిసి కావేరి, బాలరాజు చాలా సంతోషపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజుని కలవడానికి చిన్ని, ఉషలు బాలరాజు ఇంటి దగ్గర ఉన్న పార్క్‌కి వెళ్తారు. చిన్ని, ఉషలు బాలరాజు ఇంటి వైపు వెళ్లడం సత్యంబాబు చూసి వీళ్లేంటి బాలరాజు ఉండే కాలనీ వైపు వెళ్తున్నారు అనుకొని వాళ్లని ఫాలో అవుతాడు. మధ్యలో చిన్ని వాళ్లు మిస్ అయిపోవడంతో మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో చిన్ని, ఉషలు రాజు దగ్గరకు వెళ్లిపోతారు. అమ్మనువ్వు మాట్లాడుకోండి నాన్న అని చెప్పి చిన్ని పక్కకు వెళ్లిపోతుంది.
బాలరాజు: ఏదో మాట్లాడాలి అన్నావ్ అంట.
కావేరి: నువ్వు దేవా దగ్గరకు వెళ్లి గొడవ పడ్డావా. వాడు నాకు ఫోన్ చేశాడు. నన్ను బెదిరించాడు. నిన్ను నన్ను చిన్నిని చంపేస్తా అని బెదిరిస్తున్నాడు.
బాలరాజు: తెలుసు వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. వాడిని చంపేయాలి అని నాకు చాలా సార్లు అనిపించింది కానీ వాడిని చంపి నేను జైలుకి వెళ్తే చిన్ని బాధ పడుతుందని ఆగిపోయా. ఇక్కడే ఉంటే ఆ దేవా గాడు ఎంతకి తెగిస్తాడో నాకు తెలుసు మనతో పాటు మీ అన్నయ్య ఫ్యామిలీని కూడా వదలడు. మనతో పాటు వాళ్లకి కూడా ప్రమాదమే.
సత్యంబాబు: కావేరి ఈ దుర్మార్గుడితో మాట్లాడటం ఏంటి.
బాలరాజు: అందుకే వీలైనంత త్వరగా నువ్వు, నేను, చిన్ని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోదాం. నీకు చిన్నికీ ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము చిన్నిని తీసుకొని వచ్చేయ్ కావేరి.
కావేరి: నేను చిన్ని వచ్చేస్తా ముగ్గురం కలిసి ఏటైనా వెళ్లిపోదాం. ఆ మాటలు విన్న సత్యంబాబు నీరుగారిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నీతో వస్తుంది నీ కోసం కాదు చిన్ని సంతోషం కోసం మా అన్నయ్య వాళ్ల సంతోషం కోసం.
కావేరి, బాలరాజుల మాటలు విన్న సత్యంబాబు తన బండి దగ్గర కుప్పకూలిపోతాడు. రాజుని చాలా సంతోషంగా చూసిన చిన్ని ఏమైందని అడిగితే మీ అమ్మని అడుగు అంటాడు. ఇంతలో ఆఫ్ టికెట్ వస్తే చిన్ని తనతో అమ్మకి నాన్న మీద కోపం పోయిందని చెప్తుంది. చిన్ని, ఆఫ్ టికెట్, రాజు డ్యాన్స్ వేస్తారు. సత్యంబాబు కావేరి నిర్ణయం గురించి ఆలోచిస్తాడు. కావేరి తీసుకున్నది తొందరపాటు నిర్ణయమని తనకు ఏదో విధంగా చెప్పాలి అనుకుంటాడు. ఇక కావేరి కూడా తాను తీసుకున్నది తొందరపాటు నిర్ణయం కాదు కదా బాలరాజుని నమ్మొచ్చు కదా అని అనుకుంటుంది.
పిల్లలు అంతా సరదాగా ఆడుకుంటుంటారు. ఇంతలో చిన్ని కడుపునొప్పి అని కడుపు పట్టుకొని ఏడుస్తుంది. పిల్లలు అందరూ కంగారు పడతారు. అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. కావేరి పరుగున వచ్చి చూస్తుంది. హాస్పిటల్‌కి వెళ్దామని అంటే భారతి వచ్చి చూసి ఏం అవసరం లేదని చిన్ని పుష్పవతి అయిందని చెప్తుంది. కావేరి చాలా సంతోషపడుతుంది. భారతి కావేరితో ఇది మేనమామ చేయాల్సిన కార్యం అని సత్యంబాబుకి కాల్ చేసి రమ్మని చెప్పమని అంటుంది. మరోవైపు భారతి బాలరాజుకి కాల్ చేసి నీ కూతురు ఇలా చేస్తుంది అనుకోలేదురా పెద్ద ఘనకార్యం చేసిందిరా నీ కూతురు పెద్ద మనిషి అయిందిరా అని అంటుంది. బాలరాజు, ఆఫ్ టికెట్ చాలా సంబరపడిపోతారు. బాలరాజు కాలనీలో అందరికీ పిలిచి నా కూతురు పెద్దమనిషి అయింది అక్క మనం వాళ్ల ఇంటికి వెళ్లాలి అని చెప్తాడు. ఒట్టి చేతులతో వెళ్ల కూడదు అని వాళ్ల చెప్తారు. ఏం కావాలో మీరే తీసుకురండి అని చెప్పి డబ్బులు ఇస్తాడు. ఆఫ్ టికెట్ గొడవ అవుతుందని భయపడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!





















