Chinni Serial Today May 3rd: చిన్ని సీరియల్: "నువ్వు కావేరివే.. నీ భర్తని కూతుర్ని చంపేస్తా.. ఈ దేవా అసలైన ఆట ఇప్పుడు చూడు"
Chinni Today Episode కావేరికి దేవా కాల్ చేసి బాలరాజు, చిన్నిలను చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజుని తన ఇంటి వైపు రావొద్దని పిల్లలకు స్కూల్‌కి కూడా తీసుకెళ్లొద్దని సత్యంబాబు చెప్పేస్తాడు. కావేరి, చిన్ని వస్తారు. ఏమైందని అడిగితే ఈ సమస్య పెరగకూడదు అంటే వాడు వెళ్లిపోవాలని అంటాడు. పిల్లలు ఎవరినీ రాజు ఆటో ఎక్కొద్దని చెప్పి రాజుని తరిమేస్తాడు. చిన్ని బాలా బాధ పడుతుంది. తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. రాత్రి సత్యంబాబు ఓ వైపు కావేరి మరోవైపు రాజు ఇలా ముగ్గురూ ఆలోచిస్తూ ఉంటారు. సత్యంబాబు వీలైనంత త్వరగా దేవేంద్ర వర్మ దగ్గర సాక్ష్యాలు సంపాదించి వాడిని బాలరాజుని జైలుకి పంపాలని అనుకుంటాడు. మరోవైపు బాలరాజు కావేరికి కాల్ చేస్తాడు.
బాలరాజు: హలో కావేరి మీ అన్నయ్య నన్ను ఎందుకు రావొద్దని అన్నాడో నీకు తెలుసా.
కావేరి: తెలీదు.
బాలరాజు: కావేరి చిన్నిని చూడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇన్నాళ్లు తను నాకు దూరం అయినా కనీసం ఏదో కొద్ది సేపు తనతో గడిపేస్తున్నా అని సర్ది చెప్పుకునే వాడిని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నా వల్ల కావడంలేదు కావేరి. అందుకే ప్లీజ్ నువ్వు నేను చెప్పిన దాని కోసం ఆలోచించు మన ముగ్గురం కలిసి ఎటైనా దూరం వెళ్లిపోదాం. మనం సంతోషంగా ఉండొచ్చు మీ అన్నయ్య వాళ్లు కూడా ఇక్కడ సంతోషంగా ఉంటారు. ఇది నా స్వార్థం కోసం కాదు కావేరి అందరి మంచి కోరే చెప్తున్నా. దయచేసి నీ నిర్ణయం వీలైనంత త్వరగా చెప్పు కావేరి. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు.
కావేరి: అలాగే చెప్తాను.
చిన్ని: ఎవరమ్మా ఫోన్‌లో నాన్నే కదా. నాన్నకి నీ నిర్ణయం త్వరగా చెప్పమ్మా.
దేవేంద్ర వర్మకి ప్రమీల కాఫీ ఇచ్చి బామర్దిగారితో కలిసి కాఫీ తాగుతా అని మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇంతలో నాగవల్లి వచ్చి ఆ కాఫీ తీసుకుంటుంది. ఈ నాగవల్లి బామ్మర్దితో కలిసి కాఫీ కూడా తాగనివ్వడం లేదని అనుకుంటుంది. ఇంతలో సత్యంబాబు రావడం చూసి దేవేంద్ర వర్మ నాగవల్లితో అదిగో బలి అయిపోవడానికి బకరా వస్తున్నాడు చూడు అని అంటాడు. ఇక సత్యం బాబు దేవాని కలుస్తాడు. ఇద్దరూ బిజినెస్ కోసం మాట్లాడుకుంటారు. మీ ఇళ్లు బాగుందని సత్యంబాబు అంటాడు. నా ఐడియా వర్కౌట్ అయితే నువ్వు ఇలాంటి ఇళ్లు కట్టుకోవచ్చని దేవా అంటాడు. సత్యంబాబు దేవాతో మీ ఇళ్లు చూడొచ్చా అంటే దేవా తీసుకెళ్లి దగ్గరుండి చూపిస్తాడు.
సత్యంబాబు దేవా భార్య పార్వతి ఫొటో ఉంటే చూస్తాడు. అక్కడే ఉన్న ఆల్బమ్‌కి సత్యంబాబు చేయి తగిలి పడిపోతుంది. అందులో దేవా భార్య పార్వతితో కావేరి ఫొటోస్ ఉంటాయి. అవి చూసి మా ఇంటి దగ్గర ఉన్న ఉష కదా అని అంటే కాదు నా భార్యని చంపిన కావేరి అని చెప్తారు. దేవా సత్యంబాబుతో మీ ఇంట్లో ఉన్న ఉషనే కావేరి అని నాకు అనుమానంగా ఉందని మీరు తను ఎవరో నాకు కాస్త తెలిసేలా చేయండి అంటారు. కావేరి ఎలా మీ భార్యని చంపిందని అడిగితే ఆ కావేరి నా మీద కన్నేసింది అడ్డుగా ఉందని నా భార్యని చంపేసిందని అంటాడు. సత్యంబాబు రక్తం మరిగిపోతుంది.
సత్యంబాబు వెళ్లిపోయిన తర్వాత కావేరికి దేవా కాల్ చేస్తాడు. కావేరి కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో తన మనిషి ఫోన్‌తో దేవా కాల్ చేస్తాడు. కావేరి కాల్ లిఫ్ట్ చేస్తుంది. నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. ఏంటి అంతే నువ్వు కావేరినా ఉషనా అని అడుగుతాడు. దాంతో నువ్వు కావేరి కాకపోతే నీ మొగుడు మా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడం పద్ధతేనా అని అడుగుతాడు. కావేరి షాక్ అయిపోతుంది. నీకు నిన్న యాక్సిడెంట్ అయితే వాడు వచ్చి వాడి పెళ్లానికి యాక్సిడెంట్ అయినట్లు నాకు వార్నింగ్ ఇచ్చాడు. జైలు నుంచి తప్పించుకొని పీఈటీ టీచర్‌గా బతకాలి అనుకుంటున్నావ్ కదా నిన్ను బతకనివ్వను. ముందు నీ తాళి బంధాన్ని అంటే ఆ బాలరాజుని తర్వాత నీ కూతుర్ని ఆ రెండు శవాల మధ్య నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేసి నిన్నూ చంపేస్తా అని అంటాడు. దేవేంద్రలా నేను అసలైన గేమ్ ఆడుతా నువ్వు చచ్చిపోవడానికి రెడీగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. కావేరి కుప్పకూలిపోతుంది. అలా జరగకూడదని నా గురించి తెలుసుకున్న దేవా నా అన్న కుటుంబాన్ని వదలడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అనుకుంటుంది. వెంటనే బాలరాజుతో మాట్లాడాలి అనుకుంటుంది. కావేరి, చిన్నిలు ఇద్దరూ బాలరాజుని కలవడానికి బయల్దేరుతారు. చిన్ని వాళ్లు వెళ్లడం సత్యంబాబు చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!






















