Chinni Serial Today May 31st: చిన్ని సీరియల్: మళ్లీ పెళ్లితో ఒక్కటైన కావేరి, బాల.. కళ్లల్లో నిప్పులు పోసుకున్న దేవా, నాగవల్లి!
Chinni Today Episode చిన్ని తల్లీదండ్రులకు మళ్లీ పెళ్లి చేయడం దేవా, నాగవల్లికి విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని బాలరాజు, కావేరిలను పెళ్లికి ఒప్పిస్తుంది. దేవేంద్ర వర్మ కావేరి, బాలరాజుని పెళ్లి బట్టల్లో చూసి షాక్ అయిపోతాడు. తన రౌడీని పిలిపిస్తాడు. మహి వాళ్లని పంపేసి ఏం చేయాలో రౌడీకి చెప్తాడు. కావేరి బాలరాజు ఇద్దరిని తీసుకొస్తారు. పంతులు ఇద్దరికీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్తారు.
కావేరి, బాలరాజు వెళ్తారు. కావేరి బాలరాజుతో బాల ఇప్పటికీ ఇలాగే ఉంటావు కదా ఎప్పటికీ నన్ను బాధ పెట్టవు కదా అంటే బాలరాజు ప్రామిస్ చేస్తాడు. ఇంతలో రౌడీ అటాక్ చేయడం కావేరి చూసి బాల అని అరుస్తుంది. బాలరాజు చూసి తప్పించుకోబోతే చేతికి గాయం అవుతుంది. రక్తం ఎగిరి కావేరి నుదిట సింధూరంలా తుళ్లుతుంది. బాలరాజు రౌడీని కొట్టి తరిమేస్తాడు. రౌడీని తిట్టుకుంటూ దేవా వెళ్లిపోతాడు. కావేరి భర్తకి పసుపు పెట్టి కట్టు కడుతుంది. చిన్ని వాళ్లు కూడా కంగారు పడతారు. చిన్ని గాయమే ఏం కాదు అని బాలరాజు చెప్తాడు. శుభమా అని పెళ్లి జరిగుతుంటే ఇలా జరిగింది ఏంటి అని కావేరి అంటే దానికి భారతి దిష్టి ఈ విధంగా పోయిందిలేమ్మా మా బాలరాజు నీ నుదిటిన రక్తపు కుంకుమ పెట్టాలని ఉంది అందుకే ఇలా జరిగింది అంటుంది.
కావేరి, బాలరాజు పీటల మీద కూర్చొంటారు. జీలకర్రా బెల్లం పెట్టుకుంటారు. బాలరాజు తాళి కట్టడంతో కావేరి ఎమోషనల్ అవుతుంది. బాలరాజు కన్నీరు తుడుస్తాడు. తర్వాత ఇద్దరూ దండలు మార్చుకొని రింగ్ ఆట ఆడుతారు. ఏడు అడుగులు వేస్తారు. అదంతా చూసి దేవా కోపంతో రగిలిపోతాడు. కావేరి, బాలరాజు పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. దేవా జరిగిన విషయం నాగవల్లికి చెప్తాడు. నాగవల్లి కోపంతో వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అది కావేరి అని తెలియగానే ముక్కలు ముక్కలు నరికేయాల్సింది నీ వల్ల ఆగిపోయాను.. మా అక్కని చంపిన దాన్ని నా చేతులతోనే నేను చంపేస్తా అని అంటుంది. దేవా నాగవల్లిని ఆవేశపడొద్దు అని బాలరాజు ఫ్యామిలీ మొత్తానికి స్పాట్ పెడతాను అని దేవా అంటాడు.
కావేరి, బాలరాజు ఇంటికి వస్తారు. భారతి ఇద్దరికీ దిష్టి తీస్తుంది. ఇద్దరినీ పేర్లు చెప్పుకొని రమ్మని అంటారు. ఇద్దరూ పేర్లు చెప్పుకొని లోపలికి వస్తారు. ముగ్గురిని కుడి కాలు లోపల పెట్టి రమ్మని భారతి చెప్తుంది. లోపలికి వచ్చిన తర్వాత కావేరి ఇంట్లో దీపం వెలిగిస్తుంది. అందరూ దండం పెట్టుకుంటారు. బాలరాజు ఏడుస్తాడు. జీవితంలో మళ్లీ ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని కావేరి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు. అందరూ భోజనాలు చేయడానికి వెళ్తారు. ఇంతలో బాలరాజుకి దేవా కాల్ చేస్తాడు.
బాలరాజు కాల్ లిఫ్ట్ చేస్తాడు. నీ కొత్త నెంబరు నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా.. నీ పెళ్లి విషయమే తెలిసింది నెంబరు గురించి తెలీదా అని అనుకుంటాడు. నీ హనీ మూన్ ఎప్పుడు అంటే బాలరాజు తిడతాడు. దాంతో దేవా నువ్వు బయట రెండు రోజులే ఉంది తర్వాత నీ కూతురు నీ భార్య మాత్రమే బయట ఉంటారు అని అంటాడు. బాల ఫోన్ పెట్టేస్తాడు. లాయర్‌తో వాడు నన్ను బయటకు రాకుండా చేయాలి అని సాక్ష్యాలు అన్నీ లేకుండా చేశాడు ఇప్పుడు ఏదో ఒకటి చేసి నేను నిర్దోషి అని నిరూపించుకోవాలి అని అంటాడు. లాయర్ రాజుతో మన ప్రయత్నం చేద్దాం అని అంటాడు.
బాలరాజు, కావేరికి ఒకే ఆకులో భోజనం వడ్డిస్తారు. ఆఫ్ టికెట్ ఫొటోలు తీస్తాడు. కావేరి బాలరాజుకి తినిపిస్తుంది. బాలరాజు కూడా కావేరికి తినిపిస్తాడు. తర్వాత ఇద్దరూ చిన్నికి తినిపిస్తారు. కావేరి తన కొంగు బాలరాజుకి ఇచ్చి తుడుచుకోమని అంటుంది. ఇంతలో చందు కాల్ చేసి అమ్మ చాలా సార్లు అడిగింది త్వరగా రా అంటాడు. కావేరి వస్తున్నా అని చెప్తుంది. కావేరి కోసం సరళ ఎదురు చూస్తూ ఉంటుంది. కావేరిని చూసి పొద్దున్న వెళ్లావ్ రాత్రి వరకు రాకుండా ఏం చేశావ్ అని అడుగుతుంది. కాళ్లకు పారాణి మెడలో పసుపు తాడు చూసి సరళ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్..!





















