Chinni Serial Today May 2nd: చిన్ని సీరియల్: దేవాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాల.. తప్పుగా అర్థం చేసుకున్న సత్యం!
Chinni Today Episode బాలరాజుని తప్పుగా అర్థం చేసుకున్న సత్యం ఇకపై పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లడానికి కూడా రావొద్దని చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్రవర్మ కావేరితో మిస్ బిహేవ్ చేశాడని తెలుసుకున్న బాలరాజు ఆవేశంగా దేవేంద్రవర్మ దగ్గరకు వస్తాడు. ఏం జరిగింది బాల అని దేవా అడిగితే ఏం జరిగిందో నీకు గుర్తు లేదా అని ఆవేశంగా అడుగుతాడు. గుర్తొచ్చింది అని మహి పుట్టినరోజుకి పిలవలేదు అని ఫీలవుతున్నావా అంటాడు.
ఉష జోలికి వస్తే చంపేస్తా..
పీటీ టీచర్ ఉష గురించి అని బాలరాజు అంటే నీకు పర్సనల్ విషయాలు కూడా చెప్పింది అంటే నీ భార్య ఏనా అని అడుగుతాడు. తను నీ భార్య కానప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నీకు ఏంటి అని దేవా బాలని అడుగుతాడు. నువ్వు ఏమైనా నీ భార్యలా ఉందని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను పక్కకు తప్పుకుంటా నీ ఫ్రెండ్‌నే కదా అని అంటాడు. బాల దేవాని తిడతాడు. నీ వల్ల ఎవరికి ఇబ్బంది జరిగినా నిన్ను వదలను అని అంటాడు. ఇంకోసారి ఆ పీటీ టీచర్‌ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా నిన్ను వదలను అని అంటాడు.
ప్రాణ మిత్రున్ని శత్రువులా చూస్తున్నావ్..
దేవా బాలతో నువ్వు చెప్పింది నేను విన్నా ఇప్పుడు నేను చెప్పింది విను. ప్రాణ మిత్రుడు అయిన నన్ను నువ్వు బద్ధ శత్రువులా చూస్తున్నావు. దానికి కారణం నీ భార్య. నీ భార్య జైలులో చనిపోయిందనే కారణంతో నన్ను అలా చూస్తున్నావు. జరిగిపోయింది జరిగిపోయింది పోయిన కాలం తిరిగి రాదు కానీ స్నేహం తిరిగి వస్తుంది. నేను మళ్లీ నీ స్నేహాన్ని పొందాలి అనుకుంటున్నా దయచేసి కాదు అనకు. అని బాలరాజుని దేవా హగ్ చేసుకుంటాడు. అది సత్యంబాబు చూసేస్తాడు. ఇద్దరూ స్నేహితులు అనుకొని నరరూప రాక్షసులు అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాల దేవాతో ఒకసారి నీతో స్నేహం చేసినందుకే జీవితానికి సరిపడా అనుభవిస్తున్నా. ఇదే నీకు చివరి వార్నింగ్ ఉష టీచర్ విషయంలో నీ ప్రవర్తన మారకపోతే నేను మళ్లీ రాక్షసుడిలా మారాల్సి వస్తుందని జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. బాల వార్నింగ్ చూసిన దేవా వీడు ఇంతలా రియాక్ట్ అయ్యాడు అంటే అది కచ్చితంగా కావేరినే అని అనుకుంటాడు.
తల పగలగొట్టేస్తా..
సత్యంబాబు చాటుగా చూసి దేవేంద్ర వర్మ ఈ బాలరాజు కలిశారు అంటే మళ్లీ ఏదో కుట్ర చేసే ఉంటారని ముందు దేవేంద్ర వర్మని చంపేస్తా అని రాడ్ పట్టుకొని బయల్దేరుతాడు. ముందు దేవేంద్ర వర్మ అంతు చూసి తర్వాత బాలరాజు అంతు చూస్తాను అనుకుంటాడు. ఇంతలో లాయర్ సత్యంబాబుకి కాల్ చేసి విషయం తెలుసుకొని అంతా తెలిసి ఇలా ఆవేశపడొద్దని నీ ఆవేశం వల్ల చాలా మంది జీవితాలు తలకిందులైపోతాయని చెప్తాడు. లాయర్ మాటలకు సత్యంబాబు రాడ్ పడేసి వెళ్లిపోతాడు. సత్యంబాబు ఇంకా రాలేదని దేవేంద్రవర్మ అనుకుంటాడు.
వాళ్లని వదలను అమ్మ..
చిన్ని ఇంటికి వచ్చిన సత్యంబాబుకి నీరు ఇస్తుంది. నువ్వేంటి అప్పుడే వచ్చేశావ్ అంటే టీచరమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది దాంతో సత్యంబాబు కంగారు పడతాడు. ఇంతలో కావేరి వచ్చి కంగారు పడొద్దు బ్రో అని అంటుంది. ఇది ఎవరో కావాలనే చేస్తున్నారని వాళ్ల అంతు చూస్తానని సత్యంబాబు అంటాడు. దేవేంద్ర గురించి అన్నయ్యకి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని అన్నయ్యని డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. స్కూల్ ల్యాండ్ కబ్జా చేసిన వాడితో గొడవ అయింది ఆయనే అయింటారని అంటుంది. ఇక చిన్ని ఉష టీచర్ ఏం తినలేదు అని అంటుంది. దాంతో సత్యంబాబు చెల్లికి చిన్నికి దగ్గరుండి తినిపిస్తాడు.
ఇంకోసారి నువ్వు ఇటు రావొద్దు..
బాలరాజు లోహితను డ్రాప్ చేసి పీటీ టీచర్‌ని ఒకసారి పిలమని చెప్తాడు. లోహిత సరే అంటుంది. ఇంతలో సత్యంబాబు బయట బాలరాజుని చూస్తాడు. లోహిత, చిన్ని, ఉష కిందకి వస్తారు. చిన్నితో సత్యంబాబు ఎక్కడికి అని అడుగుతాడు. రాజు టీచరమ్మతో మాట్లాడాలి అంటే వెళ్తున్నాం అని చిన్ని చెప్తుంది. దాంతో సత్యంబాబు వెళ్లి ఏం మాట్లాడుతావురా అసలు నువ్వు ఎవడివిరా ఇంకోసారి ఈ ఇంటి ముందుకి వస్తే కాళ్లు చేతులు విరిచేస్తా అంటాడు. ఆటో కూడా వద్దని చెప్తాడు. ఉష వచ్చి ఏం జరిగింది బ్రో అంటే నీకు తెలీదమ్మ ఈ సమస్య పెరిగి పెద్దది అవకూడదు అంటే వాడు వెళ్లిపోవాలి అంటాడు. చిన్ని మాట్లాడితే సత్యంబాబు పెద్దవాళ్ల విషయంలో జోక్యం వద్దు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!





















