Chinni Serial Today May 24th: చిన్ని సీరియల్: దేవా ఇచ్చిన చీర కట్టి గెస్ట్ హౌస్‌కి వెళ్లిన కావేరి.. బాలరాజు ఎంట్రీ.. అదిరిపోయిన ట్విస్ట్!
Chinni Today Episode చిన్నిని చంపేస్తానని దేవా కావేరిని బెదిరించి కావేరిని గెస్ట్ హౌస్‌కి పిలవడం కావేరి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజుని కోర్టుకి తీసుకెళ్తామని సాక్ష్యాలు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి.. నాకు తెలిసి నీకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని కానిస్టేబుల్ బాబాయ్ బాలరాజు వాళ్లకి చెప్తారు. 14 ఏళ్లా అని చిన్ని ఏడుస్తూ బాలరాజుని పట్టుకొని ఏడుస్తుంది. కావేరి షాక్ అయిపోతుంది. నన్ను వదిలేసి వెళ్లిపోతావా నాన్న నేను ఉండలేను అని ఏడుస్తుంది.
బాలరాజు చిన్నితో నేను నిర్దోషి అని నిరూపించుకుంటా అని అంటాడు. కావేరితో కూడా ఉషా టీచర్ మీరు ఏం బాధ పడొద్దు నేను బయటకు వస్తాను అని అంటాడు. చిన్నిని బయటకు పంపి కావేరిని పిలుస్తాడు. దేవా చాలా డేంజర్ మనిషి ఎప్పుడు ఎటు నుంచి కాటు వేస్తాడో తెలీదు.. నువ్వు చిన్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. చిన్ని ఎక్కడ ఉందో వాడికి తెలీదు నేను చిన్నిని జాగ్రత్తగా చూసుకుంటా అని కావేరి అంటుంది. ఇక రాత్రి 11 గంటల టైంలో కావేరికి దేవేంద్ర వర్మ వీడియో కాల్ చేస్తాడు. ఈ టైంలో వీడు ఏంటి కాల్ అని కావేరి అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది.
దేవా కావేరితో నేను చెప్పిన చీర కట్టుకున్నావా.. ఇంటి నెంబరు చెప్పి ప్రస్తుతం చిన్ని అక్కడే ఉంది కదా ఆ ఇంటి చుట్టూ నా మనుషులు ఒక 50 మంది ఉన్నారు. నేను ఏం చెప్తే అది వింటారు అని అంటాడు. నీకు ఓఫొటో పెడతా చూడు అని రెక్కి ఉన్న రౌడీల ఫొటో చూసిస్తాడు. చెప్పింది వినకపోతే ఇంటిని కాల్చేస్తారు అని అంటాడు. చిన్నిని ఏం చేయొద్దు అని కావేరి అంటుంది. చిన్నిని ఏం చేయకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్లు ఉండాలి.. నా మాట విని నేను పంపిన చీర కట్టుకొని నేను చెప్పిన ప్లేస్‌కి రా అని అంటాడు.
కావేరి కుప్పకూలిపోయి ఏడుస్తుంది. చిన్ని మంటల్లో కాలిపోయినట్లు కావేరి ఊహించుకొని చెమటలు పట్టేస్తుంది. ఇక దేవా గంట మాత్రమే టైం ఉంది.. పట్టు చీర కావాలా.. కూతురి శవం కావాలా అని కావేరికి మెసేజ్‌లు చేస్తుంటాడు. దేవా ఇచ్చిన చీర కట్టుకొని ఓ చాకు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టి చిన్ని నిండు నూరేళ్లు బతకాలి అంటే ఆ దేవా గాడికి నిండు నూరేళ్లు నిండిపోవాలి అని అనుకుంటుంది. రాత్రి వేళలో దేవా గెస్ట్ హౌస్‌కి వెళ్తుంది. దేవాకి అతని మనిషి కాల్ చేసి మేడం వచ్చారు సార్ అని చెప్పగానే దేవా కూడా బయల్దేరి అక్కడికి వెళ్తాడు.
దేవా గదిలోఇక వెళ్లి నువ్వు వస్తావని నా ఢీల్‌కి ఒప్పుకుంటావని నాకు తెలుసు అని అంటాడు. గదిలో చీర కప్పుకొని కూర్చొన్నది కావేరి అని అనుకొని మీద చేయి వేస్తాడు. అక్కడ బాలరాజు ఉంటాడు. దేవా భుజం మీద పొడిచేసి దేవాని చితక్కొడతాడు. కావేరి దాక్కుంటుంది. కావేరిని తీసుకొని పారిపోయి కావేరిని ఒక ఆటో ఎక్కించి ఇంటికి పంపిస్తాడు. తర్వాత తాను మరోఆటో ఎక్కి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిపోతాడు. దేవాకి దెబ్బతగలడంతో బయటకు వస్తాడు. అక్కడికి నాగవల్లి వస్తుంది. నాగవల్లి రావడం చూసిన దేవా ఏం కాలేదు అన్నట్లు నటిస్తాడు. బాలరాజుకి వార్నింగ్ ఇవ్వాలని కావేరికి ఇక్కడికి పిలిచానని అంటాడు. తనని ఇక్కడికి ఎందుకు పిలిచావ్ అంటుంది. బాలరాజుకి తెలిసి దొంగ చాటుగా వచ్చి నా మీద అటాక్ చేశాడని అంటాడు. దేవేంద్ర వర్మకి పొడిచేసిన దెబ్బ చూసిన నాగవల్లి షాక్ అయి దేవాని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది.
ఫ్లాష్ బ్యాక్‌లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాలరాజుకి కావేరిని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కాల్ చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని కావేరి రాత్రి రావడం గురించి చెప్తాడు. దాంతో బాలరాజు పోలీస్ బాబాయ్‌ని రిక్వెస్ట్ చేసి రాత్రి బయటకు వస్తాడు. ఉదయం చిన్ని తన తండ్రికి శిక్ష పడకూడదు అని మొక్కుకుంటుంది. ఇంతలో కావేరి అక్కడికి వస్తుంది. చిన్ని కావేరిని పట్టుకొని ఏడుస్తుంది. నాకు భయంగా ఉంది అమ్మఅంటే మీ నాన్న నిర్దోషిగా బయటకు వస్తారు అని కావేరి ధైర్యం చెప్పి చిన్నిని కోర్టుకి తీసుకెళ్తుంది. బాలరాజుని కూడా కోర్టుకి తీసుకొస్తుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















