Chinni Serial Today March 29th: చిన్ని సీరియల్: చిన్నికి దగ్గరైన విజయ్ కావేరి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయగలడా.. దేవా ప్లాన్ ఏంటి!
Chinni Today Episode విజయ్ దేవాని కలిసి కావేరి కేసు గురించి చెప్పడం దేవా తెలివిగా తనకు ఏం తెలీదు అన్నట్లు తప్పించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు కావేరి, చిన్ని, సత్యంల జీవితాల్లో జరుగున్న పరిస్థితులకు ఏడుస్తాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా విజయ్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడని ఎలా ఆపాలో అర్థం కావడం లేదని బాధ పడతాడు. ఇంతలో కావేరి ఫోన్ చేస్తుంది. ఈ సారి ఏసీపీ ఏ విధంగా ఇన్విస్టిగేషన్ చేస్తాడో అర్థం కావడం లేదని ఆలోచించి ఇద్దరూ ఒకే సారి చిన్ని అని కంగారు పడతారు.
కావేరి: చిన్ని వైపు నుంచి ఇన్విస్టిగేషన్ మొదలు పెడతారు అంటారా.
రాజు: అది తప్ప అతనికి వేరే మార్గం లేదు అనిపిస్తుంది.
కావేరి: పరిస్థితి అంత దూరం రాకూడదు అండీ. ఏసీపీ చిన్నికి ఇబ్బంది పెట్టకూడదు. పెద్ద వాడు కాబట్టి అన్నయ్య తట్టుకున్నాడు కానీ నా కూతురు చిన్నది తను తట్టుకోలేదు. నేను ఉషని కాదు కావేరి అని చెప్పేస్తా అండీ.
రాజు: వద్దండీ మీరు అలా చెప్పొద్దు. దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు. జైలులో మిమల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. మీ అన్నయ్య కూతురిని బయట బతకనివ్వరు నన్ను నమ్మండి ప్లీజ్.
కావేరి: ఆ దేవుడి తర్వాత నేను నమ్మేది మిమల్నే అండీ.
చిన్ని: అమ్మా ఏమైంది ఏం బాధ పడకు. అంతా మంచే జరుగుతుంది అమ్మ.
విజయ్ దేవాని కలుస్తాడు. బిజినెస్ గురించి మాట్లాడటానికి విజయ్ పిలిచాడని అనుకొని దేవా బిజినెస్ గురించి మాట్లాడితే నేను బిజినెస్ గురించి మాట్లాడటానికి రాలేదు నేను పోలీస్ ఆఫీసర్ అని గన్ తీసి పక్కన పెడతాడు. నాకు తెలుసు అని దేవా అంటాడు. కావేరి కేసు గురించి వచ్చాను అంటే కావేరి కేసు ఏంటి అని అడుగుతాడు. మీ భార్యని చంపిన కావేరి అనగానే అవునా గుర్తొచ్చిందని దేవా అంటాడు. కావేరి కేసు గురించి ఏం తెలియనట్లు మాట్లాడుతారు. కావేరి బతికే ఉందని ఉషలా ఈ ఊరిలోనే ఉందని విజయ్ చెప్తాడు. తన దారిన తనే పోతుంది. మీరు వదిలేయండి అని అంటాడు దేవేంద్ర. దానికి విజయ్ మేం మా దారిన పోతే మీరు కావేరిని చంపేస్తారా అని విజయ్ అడిగితే నేను చంపడం ఏంటి అని రివర్స్ అయిపోతాడు. మీ భార్యని చంపిందని కోపంతో ఏం చేయొద్దని మీ మీద నేను ఇంకా నిఘా పెట్టలేదని కేవలం కావేరి కేసు మీదే ఉన్నానని అంటాడు. దేవాని పంపిన తర్వాత దేవా మీద ఓ కన్నేసి ఉంచమని చెప్తాడు.
విజయ్ తర్వాత డీసీపీ కాల్స్ చూసి కాల్ బ్యాక్ చేస్తాడు. దేవా చాటుగా వింటాడు. ఏ కేసు అయినా గంటల్లో క్లోజ్ చేసిన నువ్వు ఈ కేసు కోసం ఇంత టైం తీసుకోవడం షాకింగ్‌గా ఉందని డీసీపీ అంటారు. దానికి విజయ్ 24 గంటల్లో కేసు క్లోజ్ చేస్తానని అంటాడు. దేవా చాటుగా ఈ లోపు నా పని నేను పూర్తి చేసేస్తా అనుకుంటాడు. చిన్ని తన తల్లికి ఏం ఇబ్బంది కాకుండా చూడమని కోరుకుంటుంది. ఇక మామయ్యకి పాలు ఇచ్చి ఏసీపీ విజయ్‌కి టిఫెన్ ఇస్తానని అంటుంది. సరళ ప్రశ్నించడంతో కుదిరినప్పుడల్లా ఆయనకు ఫుడ్ ఇస్తానని చెప్పానని అంటుంది. ఇంత జరిగిన తర్వాత ఆయనకు ఇవ్వొద్దని అంటుంది. కావేరి కూడా వచ్చి మీ అత్త చెప్పిందే నిజం అని అంటుంది. పరిస్థితులు మారినంత మాత్రాన మనం మనం ఇచ్చిన మాట మారకూడదని చిన్నితో పాటు సత్యంబాబు అంటారు. సత్యం చిన్నిని వెళ్లమని తోడుగా కొడుకుని వెళ్లమంటే వెళ్లను అనేస్తాడు. నేనే వస్తానని సత్యం అంటాడు. దాంతో చిన్ని రాజుతో వెళ్తానని చెప్పి వెళ్తుంది. ఉష కంగారు పడుతుంది.
విజయ్‌తో సీఐ చిన్నిని ఇంటరాగేషన్ చేసి కావేరి గురించి తెలుసుకుందామని అంటాడు. చిన్నిని ఎలా హ్యాండిల్ చేయాలా అని విజయ్ అంటాడు. దానికి పోలీస్ అధికారి మాకు మీ పెయిన్ అర్థమైంది సార్ చిన్నిని మీరు మనసుకి చాలా దగ్గరగా అనుకుంటున్నారు అందుకే తనని మీరు హ్యాండిల్ చేయలేరు నేను చేస్తా సార్ అని చెప్తారు. జాగ్రత్తగా చేయమని విజయ్ చెప్తాడు. ఇంతలో చిన్ని టిఫెన్ తీసుకొస్తుంది. దానికి విజయ్ మీ అమ్మ కేసు మేం విచారిస్తున్నాం. మీ మామయ్యని మా పోలీసులు కొట్టారు అయినా నువ్వు ఎందుకు వచ్చావ్ ఎలా పంపారు నిన్ను మీ వాళ్లు అని విజయ్ అడిగితే ఎలాంటి పరిస్థితిలో అయినా ఇచ్చిన మాట తప్పొద్దని మా అమ్మ, మామయ్య చెప్పారు వాళ్ల పెంపకంలో పెరిగాను సార్ అని అంటుంది. ఇద్దరికీ టిఫెన్ పెడుతుంది. పోలీస్ చిన్నికి సారీ చెప్తే మీ డ్యూటీ మీరు చేశారు ఏం పర్లేదు అంటుంది.
చిన్ని వెళ్తూ వెళ్తూ విజయ్‌తో విజ్జూ సార్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ తప్పు చేయదు అని అమ్మ చేస్తే అది తప్పు కాదు అని మా అమ్మ కేసు క్లోజ్ చేయండి సార్ మా వాళ్లని ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటుంది. విజయ్ పోలీస్‌తో చిన్ని మాటలతో కావేరి తప్పు చేయదు అని అనిపిస్తుంది కానీ ఓ పోలీస్ అధికారిగా కావేరి తప్పు చేసిందని అనిపిస్తుంది అంటాడు. దేవా కావేరిని చంపడటం తన వల్ల కాదని తన భార్యను కావేరి చంపలేదని తానే చంపాడని చెప్తే తాను జైలుకి వెళ్లాల్సి వస్తుందని అందుకు వెంటనే కావేరిని చంపాలని అనుకుంటాడు. రౌడీలను పిలిచి కనిపించిన వెంటనే కావేరిని చంపేయమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















