Chinni Serial Today March 20th: చిన్ని సీరియల్: కావేరి కోసం రంగంలోకి దిగిన ముగ్గురు మొనగాళ్లు.. RRR రేంజ్ ఎలివేషన్!!
Chinni Today Episode నాగవల్లి రౌడీలు ఉష మీద దాడి చేయడం రాజు, విజయ్, సత్యం రౌడీలను చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode విజయ్ కూడా కావేరి వాళ్ల దగ్గరకు వచ్చి హోళీ ఆడుతాడు. కావేరి (ఉష) విజయ్‌ని గమనిస్తూ ఉంటుంది. అందరూ సంతోషంగా హోలీ ఆడుతుంటే నాగవల్లి కూడా అక్కడికి రంగులు పూసుకొని తన రౌడీలను తీసుకొని వస్తుంది. డ్యాన్స్ చేసి చేసి అలసిపోయానని ఉష నీరు తాగడానికి వెళ్తుంది.
ఉష వెనకాలే రౌడీ ఫాలో అయి ఉషని పొడవబోతే రాజు వెనకాలే వచ్చి కత్తి పట్టుకుంటాడు. రాజు చేతికి గాయం అవుతుంది. ఇక విజయ్ వచ్చి రౌడీ మెడ పట్టుకుంటాడు. ఉష షాక్ అయిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలివేషన్ రాజు, విజయ్‌లకు ఇస్తారు. ఉష ఇద్దరినీ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చిన్ని, సత్యం వాళ్లు చూస్తారు. ఉషని పక్కకు తీసుకెళ్లిన తర్వాత విజయ్, రాజు, సత్యం ముగ్గురూ రౌడీలను చితక్కొడతారు. ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా అని విజయ్ అడిగితే తెలీదు అని ఉష చెప్తుంది. తెలీకుండా ఎవరో ఉండే ఉంటారు అని రాజు అంటాడు. ఇక రాజు మనిషి, ఉషలు రాజు గాయం చూసి కంగారు పడతారు. చిన్ని రాజుకి కట్టు కడుతుంది. రాజుకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి అని చందు అడిగితే ఉష రాజుకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత రాజు విజయ్‌కి కూడా థ్యాంక్స్ చెప్పమంటే ఉష చెప్తుంది.
చందు చిన్నికి ఉట్టి కొట్టడానికి రమ్మని చెప్తే టీచరమ్మకి అలా అయింది కదా నా మూడ్ బాలేదు రాను అంటుంది. ఎవరు ఎంత చెప్పినా చిన్ని వినకుండా వెళ్లిపోతుంది. దాంతో అందరూ సత్యం చెప్తేనే వింటుంది కదా అని వెళ్లమని చెప్తాడు. ఉష కూడా చిన్నిని పిలిస్తే రాను అంటుంది. దాంతో సత్యం వెళ్లి నువ్వు రాకపోతే ఎవరూ రారు కదా నువ్వు రాకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనవి ఉట్టి కొడితే 10 వేలు ఇస్తానన్నారని ఆ డబ్బు సంపాదించి నువ్వు వాచ్మెన్ కూతురికి బుక్స్ కొంటా అన్నావ్ కదా మరి నువ్వు రాకపోతే ఎలా అంటే చిన్ని వస్తానని చెప్తుంది. ఉట్టి కొట్టే కార్యక్రమం మొదలవుతుంది.
అందరూ సంతోషంగా ఉట్టి కొడతారు. చందు,సరళ, సత్యం, లోహిత అందరూ ఉట్టి కొడతారు. ఇక సత్యం విజయ్‌ని పిలుస్తాడు. విజయ్ కూడా ఉట్టి కొట్టడానికి వెళ్తాడు. తర్వాత ఉష కూడా వెళ్తుంది. ఇక రాజుని కూడా వెళ్లమని ఉష చెప్తుంది. విజయ్, ఉష కొట్టలేకపోతే రాజు వెళ్తాడు. రాజు కూడా ఉట్టి కొట్టలేకపోతాడు. ఇక విజయ్ చిన్నిని కొట్టమని చెప్తాడు. చిన్ని ఉట్టి కొడితే విజయ్ తాడు లాగుతాడు. చిన్ని మొదటి సారి కొట్టలేకపోతే రెండో సారి కావేరి, రాజు ఇద్దరూ కూతుర్ని ఎత్తుకొని ఉట్టి కొట్టిస్తారు. చిన్ని ఉట్టి కొడుతుంది. అందరూ చాలా సంతోష పడతారు.
చిన్ని మనసులో అమ్మానాన్నల్ని దేవుడు ఇలా దీవించినట్లున్నాడని అనుకుంటుంది. తర్వాత ఉట్టి కొట్టినందుకు కాలనీ తరఫున పదివేల నూట పదహారు రూపాయల్ని చిన్నికి ఇస్తామని పెద్ద మనుషులు అంటే చిన్ని మామయ్య చేతితో ఇప్పించమని అంటుంది. తర్వాత చిన్ని ఆ డబ్బుని పూజారికి ఇచ్చి వాచ్ మెన్‌కి ఇవ్వమని వాళ్ల కూతురికి బుక్స్ కొనమని చెప్తుంది. చిన్న మంచి తనానికి పంతులు చిన్నిని దీవిస్తారు. మరోవైపు గౌతమ్ డెహ్రాడూన్ వెళ్తాడు. ఆ విషయం విజయ్‌కి చెప్తాడు. చిన్ని విజయ్ దగ్గరకు వచ్చి విజ్జు వెళ్లలేదా అంటే నిన్ను వదిలి వెళ్లాలి అంటే ఏదోలా ఉంది చిన్ని అంతలా దగ్గరైపోయావ్ అని తన కూతురి బొమ్మని తీసుకొచ్చి నాకు ఎంతో ఇష్టమైన ఈ బొమ్మ నాకు ఎంతో ఇష్టమైన నీకు ఇస్తున్నా అని చిన్నికి ఇస్తాడు. ఇక పీటీ టీచర్‌ని పిలవమని చెప్తాడు. చిన్ని ఉషకి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?





















