Chinni Serial Today June 4th: చిన్ని సీరియల్: దగ్గరవుతున్న కావేరి, బాలరాజు.. మహి కోసం నాగవల్లి తపన..!
Chinni Today Episode కావేరి కోసం బాలరాజు వంట చేయడం మహిని నాగవల్లి తల్లిలా చూసుకుంటే మహి క్షేమం కోసం పూజలు చేయించాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని గుడికి రాలేదని చిన్ని కోసం మహి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆశ్రమానికి వస్తాడు. నువ్వు గుడికి రాలేవని నీ కోసం తీసుకొచ్చా అని మహి చిన్నికి చెప్తాడు. చిన్ని దండం పెట్టుకుంటుంది. తర్వాత మహి చిన్నికి ఆంజనేయ స్వామి రక్ష కడతాడు. నా కోసం మా ఫ్రెండ్ దేవుణ్నే తీసుకొచ్చాడు టీచరమ్మా అని చిన్ని అంటుంది.
మహి చిన్నితో మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని చేయి అందిస్తాడు. బాలరాజు దేవా దగ్గరకు వెళ్లి ఫ్రెండ్స్ అంటే వాళ్లలా ఉండాలి అని చెప్తాడు. ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్ ప్రాణాలు కాపాడాలి అనుకుంటుంది కానీ తీయాలి అనుకోదు.. ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటాడు. దేవా కూడా చిన్నితో మాట్లాడుతాడు. తర్వాత మహిని తీసుకొని వెళ్తాడు. చిన్ని తల్లితో తగ్గితే గుడికి వెళ్దాం అనుకున్నా కానీ మహి నా దగ్గరకు దేవుడిని తీసుకొని వచ్చాడు అని చెప్తుంది. దేవుడి దయ నీ దగ్గర ఉందని కావేరి అంటుంది.
చిన్నిని తీసుకొని ఇంటికి వెళ్తే భారతి దిష్టి తీస్తుంది. నీకు ఏమైనా అయితే మేం తట్టుకోలేం అని కావేరి అంటుంది. ఆఫ్ టికెట్ నీకు కూడా వాళ్లు అంటే అంతే ఇష్టం కదా చిన్ని వాళ్ల కలలను నువ్వే నిజం చేయాలి అంటాడు. దాంతో చిన్ని నేనే చేస్తాను అంటుంది. కావేరి వంట చేస్తానని వెళ్తూ డైనింగ్ టేబుల్కి కాలు తగిలి అమ్మా అని అరుస్తుంది. కావేరి కాలికి రక్తం వస్తే కంగారు పడకు కావేరి అని పసుపు పెట్టి బాలరాజు బాగా కంగారు పడతాడు. కావేరి పెద్దగా నవ్వి నన్ను కంగారు పడొద్దు అని నువ్వు బాగా కంగారు పడుతున్నావ్ అంటుంది. కావేరి నడవలేకపోతే బాలరాజు నడిపించి తీసుకెళ్తా అంటాడు. చిన్ని సైగ చేసి ఎత్తుకోమని చెప్తుంది.
బాలరాజు కావేరిని ఎత్తుకొని తీసుకెళ్తాడు. తర్వాత చిన్ని భారతితో నానమ్మా నువ్వు ఏమైనా అనుకో కానీ నీ కొడుకుకు కొంచెం బుర్ర తక్కువ అన్నీ కూతురే చెప్పాలి అని అంటుంది. భారతి వాళ్లు నవ్వుకుంటారు. ఇక మహికి నాగవల్లి దగ్గరుండి భోజనం తినిపిస్తుంది. మహి తినను అన్నా నాగవల్లి బుజ్జగిస్తూ తినిపిస్తుంది. లాయర్ వచ్చి దేవా దగ్గరకు వస్తాడు. మీ మరదలికి మీ కొడుకు అంటే చాలా ఇష్టం అని అంటే దానికి దేవా నాగవల్లికి మహి అంటే ప్రాణం అని చెప్తాడు. ఇక లాయర్‌తో బెయిల్ మీద వచ్చిన బాలరాజు సంగతి చూడు అవసరం అయితే వాడి వీక్ నెస్ అయిన కూతురి మీద కొట్టు అంటుంది. అమ్మ ముద్దు తిను అని మహిని నాగవల్లి అంటుంది. మహి, నాగవల్లి ఇద్దరూ పార్వతి ఫొటో చూసి ఏడుస్తారు. ప్రమీల వచ్చి నీకు అమ్మ అయినా పిన్ని అయినా నాగవల్లినే అని అంటాడు.
నాగవల్లి ఇంటికి పంతుల్ని పిలుస్తుంది. దేవాతో నిన్న పెద్ద ప్రమాదం తప్పింది కదా ఏమైనా దోషాలు ఉంటే పోతాయి అంటే దానికి పంతులు మృత్యుంజయ హోమం జరిపించి తులాభారం చేస్తే అన్నీ దోషాలు పోతాయని పంతులు చెప్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు అని నాగవల్లి అంటుంది. నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తా అని మహి పరుగులు తీస్తాడు. మహిని అంత ప్రేమగా శ్రద్ధగా చూసుకుంటున్నందుకు దేవా నాగవల్లికి థ్యాంక్స్ చెప్తాడు.
మరోవైప బాలరాజు వంట చేస్తాడు. కావేరి వెళ్లి నువ్వు ఎందుకు చేయడం నేను చేస్తా అంటుంది. నీ కూతురు నీతో వంట చేయొద్దని ఆర్డర్ వేసింది అంటుంది. అత్తయ్య చేస్తారు అని కావేరి అంటే మా చిన్నమ్మని పక్కింటికి నీ కూతురు పంపేసిందని చెప్తాడు. నువ్వు మహారాణిలా కూర్చొ నేను నీ అసిస్టెంట్ చెఫ్‌లా వంట చేస్తా అంటాడు. ఇంతలో కావేరికి మహి కాల్ చేస్తాడు. కావేరి స్పీకర్ పెడుతుంది. మహి పూజ తులాభారం గురించి చెప్పి అందర్ని పిలుస్తాడు. తప్పకుండా వస్తాం ప్రామిస్ అని చిన్ని అంటుంది. కావేరి టెన్షన్ పడుతుంది. బాలరాజు కావేరితో టెన్షన్ పడకు చిన్నికి అనుమానం వస్తుంది అని చెప్తాడు. వంట అవుతుంటే బాలరాజు కంటిలో ఏదో తుల్లితే కావేరి వెళ్లి ఊదుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!





















