Chinni Serial Today June 16th: చిన్ని సీరియల్: సాక్ష్యం చూపించి పెళ్లి ఆపేసిన బాల.. బావ చెంప పగలగొట్టిన నాగవల్లి.. చిన్ని కిడ్నాప్!
Chinni Today Episode దేవాకి వ్యతిరేకంగా సాక్ష్యం తీసుకొస్తున్న బాలరాజుని దేవా చిన్నిని అడ్డు పెట్టుకొని ఆపి పోలీసులకు పట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode పెళ్లి కూతురు నాగవల్లికి హారతి ఇవ్వడానికి కావేరి పిలవడానికి చిన్ని వస్తుంది. నాన్న కనిపించడం లేదు ఏంటి అమ్మా అని అడుగుతుంది. మీ నాన్న పని మీద వెళ్లారని కావేరి చెప్తుంది. తర్వాత కావేరి బాలరాజు నెంబరుకి ఎన్ని సార్లు కాల్ చేసిన కలవడం లేదు మరోసారి చేద్దాం అని అనుకుంటుంది. చిన్నిని పంపి ఫోన్ మాట్లాడి వస్తానని చెప్తుంది.
కావేరి బాలరాజుకి కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితే రాజమండ్రిలోనే ఉన్నా మాణిక్యాన్ని ఒప్పించి సాక్ష్యాలు తీసుకొస్తున్నా నేను రాగానే నాగవల్లికి వీడియో చూపిస్తా ఆ నాగవల్లినే దేవాని అరెస్ట్ చేయిస్తుందని బాలరాజు చెప్తాడు. దేవా ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా అని కావేరి అనుకుంటుంది. కావేరి, ప్రమీల వాళ్లు నాగవల్లికి హారతి ఇస్తారు. హారతి ఇస్తుండగా హారతి పళ్లెం కింద పడిపోతుంది. అపశకునంలా ఉందని అందరూ అంటారు. నాగవల్లి కావేరిని కోపంగా చూస్తుంది.
దేవాని పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. అక్కడే కావేరి దేవాకి కాల్ చేస్తుండటం దేవా చూసి తన మనిషిని కావేరి దగ్గరకు పంపిస్తాడు. అతను కావేరి వెనకాలే నిల్చొని ఉంటాడు. కావేరి అతన్ని చూసి అనుమానం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక పంతులు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్తారు. ఇంతలో నాగవల్లి వస్తుంది. ఇంతలో బాలరాజు కూడా వస్తాడు. ఇద్దరూ జీలకర్రా బెల్లం పెట్టుకునే టైంకి బాల ఆపుతాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటాడు. దేవా, వల్లి షాక్ అయిపోతారు. దేవేంద్ర వర్మ బాలరాజు దగ్గరకు వెళ్లి ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవర్రా అంటాడు. నీ నిజస్వరూపం బయట పెట్టడానికి వచ్చిన నీ మిత్రున్ని అంటాడు.
నాగవల్లి కూడా వచ్చి బావ వాళ్ల మాటలు నమ్మొద్దు మొదటి నుంచి వాళ్లకి మన పెళ్లి ఇష్టం లేదు నాకే చాలా సార్లు నిన్ను చేసుకోవద్దని చెప్పాడు. వాడిని మెడ పట్టుకొని బయటకు గెంటేయమని అంటుంది. బాలరాజు సరే అని ఈ వీడియో చూస్తే ఎవరిని మెడపట్టుకొని బయటకు గెంటేయాలో నీకే అర్థం అవుతుందని నాగవల్లికి వీడియో చూపిస్తాడు. అందులో దేవా తన భార్యకి ఆస్తి కోసం విషం పెట్టి చంపినట్లు వీడియో ఉంటుంది. అది చూసిన నాగవల్లి కోపంతో దేవా చెంప పగలగొడుతుంది. నా అక్కని చంపి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావా అని వాయిస్తుంది. దేవా చెమటలు పట్టేస్తాడు. తీరా చూస్తే ఇదంతా దేవా కల.
దేవా తేరుకొని ఆ బాలరాజు సాక్ష్యం తీసుకొస్తే జరిగేది ఇదే అని కంగారుగా తన మనషులకు కాల్ చేసి దేవా కనిపిస్తే వెంటనే చంపేసి అయినా సాక్ష్యాలు తీసుకోమని చెప్తాడు. ఇక ఇంట్లో చిన్ని ఒంటరిగా వెళ్తుండగా చిన్నిని కిడ్నాప్ చేయిస్తాడు. రౌడీ చిన్నిని ఓ గదిలో పెట్టి ఫోటోలు దేవాకి పంపించి గది లాక్ వేసేస్తాడు. ఇక రౌడీలు బాలరాజుని అడ్డు పడి బైక్ ఆపుతారు. బాల వాళ్లని చితక్కొడతాడు. దేవా కాల్ చేస్తే బాల ఎత్తి నీ దగ్గరకే వస్తున్నా అంటాడు. దాంతో దేవా చిన్ని ఫొటో పంపి బాలరాజుకి టెన్షన్ పెడతాడు. నా కూతుర్ని ఏం చేయొద్దని బాలరాజు బతిమాలుతాడు. దాంతో దేవా నీ కూతుర్ని ఏం చేయకూడదు అంటే నువ్వు ఈ పెళ్లి దగ్గరకు రాకూడదు వస్తే నీ కూతురు చస్తుందని అంటాడు.
బాలరాజు టెన్షన్ పడతాడు. ఇక దేవా పోలీసులకు ఫోన్ చేసి బెయిల్ మీద ఉన్న బాలరాజు తన మనుషుల్ని కొట్టాడని అరెస్ట్ చేయిస్తాడు. ఈ పెళ్లిని ఎవడూ ఆపలేడు అని దేవా వెళ్లి పీటల మీద కూర్చొంటాడు. చిన్ని కనిపించడం లేదని మహి మొత్తం చూస్తాడు. చందుని ఆ విషయం అడుగుతాడు. కావేరి, చందు చాలా టెన్షన్ పడతారు. మహి, చందు, కావేరి, వెళ్లి వెతుకుతారు. మహికి చిన్ని కాలి పట్టీ దొరుకుతుంది. అనుమానం వచ్చి అటుగా వెళ్లి గది డోర్ తీసి చూస్తాడు. అక్కడ బెడ్ మీద చిన్ని పడుకోవడం చూసి చిన్నిని లేపుతాడు. చిన్నిని తీసుకొని మహి వెళ్తాడు. చిన్నిని ఎవరో స్టోర్ రూంలో పడేశారని మహి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















