Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 14th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ కోసం చేయి విరుచుకున్న విహారి.. యమున నగలు సిద్దార్థ్‌కి ఇచ్చేసిన అంబిక!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్రతో పూజ చేయడం ఇష్టం లేని విహారి కారు డోర్‌లో చేయి పెట్టుకొని చేతికి గాయం చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీ ఇద్దరూ పూజ గురించి మాట్లాడుకుంటారు. యమునమ్మ మన ఇద్దరిని మొదటి సారి దీవించారని లక్ష్మీ అంటుంది. సహస్రమ్మ స్థానంలో నేను ఉన్నానని తెలీక దీవించారని అంటుంది. దేవుడు మనల్ని మా అమ్మ దీవించేలా చేశాడు అంటే మన ఇద్దరి తలరాత ఎలా రాశాడో. మన భవిష్యత్ అని విహారి అంటే కనకం ఆపి మన కాదు విహారి గారు మీ భవిష్యత్ అని అంటుంది.
విహారి లక్ష్మీతో నా జీవిత మలుపు నేను కోరుకున్న మనిషితో ఉంటుందని విహారి అంటే ఆ మనిషి సహస్రనే కావాలి అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు అని లక్ష్మీ అంటుంది. విహారి మనసులో నా భార్య ఎప్పటికీ నువ్వే అని అనుకుంటాడు. ఇద్దరూ వెళ్తూ ఒకరి చేతిని ఒకరు తాకుకుంటారు. తర్వాత లక్ష్మీ చేయి పక్కకు తీసేస్తుంది. తర్వాత విహారి లక్ష్మీ చేయి పట్టుకుంటాడు. లక్ష్మీ పిలిచినా వినడు. ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. లక్ష్మీ దిగి వెళ్లిపోతుంది. విహారి లక్ష్మీనే చూస్తూ ఉంటాడు. కనకం బాధ పడుతున్నా నేను ఓదార్చలేకపోతున్నా అని అనుకుంటాడు. లోపలికి వెళ్లి సహస్రతో ఎలా పూజచేస్తాడు. తను నా భార్య కాదు. లక్ష్మీనే నా భార్య లక్ష్మీ స్థానాన్ని తనకు ఎలా ఇస్తాను అనుకుంటాడు.
విహారి సహస్రతో పూజలో కూర్చొడం ఇష్టం లేక కారు డోర్ మధ్యలో చేయి పెట్టుకొని నలిపేసుకుంటాడు. లక్ష్మీ చూసి ఏమైందని వెళ్తుంది. ఇంతలో సహస్ర చూసి ఏడుస్తూ చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ విహారి చేతిని పట్టుకోవడం చూసి లక్ష్మీని తోసేస్తుంది.
ఫస్ట్ ఎయిడ్ చేస్తానని లోపలికి తీసుకెళ్తుంది. ఇంట్లో అందరూ కంగారు పడతారు. సహస్ర ఏడుస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. నీ మధ్య నీకు టెన్షన్ ఎక్కువ అయిపోతున్నాయి బావ అని సహస్ర అంటుంది. అవును అని యమున అంటుంది. సహస్ర మనసులో ఈ లక్ష్మీ వల్లే టెన్షన్ ఎక్కువ అయిపోయావి అనుకుంటుంది.
అంబిక విహారితో నువ్వు కుడివైపు కారు డోర్ దిగితే కుడి చేయి ఎలా ఇరుక్కుంటుందని అంటుంది. విహారి బాధ పడుతుంటే ఇప్పుడు నీ అనుమానాలు ఏంటి అని చారుకేశవ అంబికను ఆపేస్తాడు. ఇక పద్మాక్షి విహారితో ఎలా పూజ చేస్తావ్ అంటే పూజ వద్దని విహారి అంటాడు. అన్ని ఏర్పాట్లు చేసేశాం అని యమున ఒప్పించబోతే సహస్ర కూడా వద్దని బావ బాధ పడుతుంటే నేను ఎలా సంతోషంగా పూజ చేయగలను అని వద్దని చెప్పేస్తుంది. ఇప్పుడు ఆపితే తప్పు అని పద్మాక్షి అంటే తర్వాత గ్రాండ్‌గా చేసుకుందాంలే అని సహస్ర అంటుంది. సహస్రకు విహారి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు.
సహస్ర మనసులో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నదాన్ని నీతో వ్రతం చేసుకోలేనా త్వరలోనే లక్ష్మీ కళ్లెదురుగానే వ్రతం చేసుకుంటా అంటుంది. ఇక లక్ష్మీ విహారి గురించి టెన్షన్ పడుతుంది. ఇంతలో లక్ష్మీ దగ్గరకు పండు జ్యూస్ తీసుకొచ్చి విహారికి ఇవ్వమని చెప్తాడు. సహస్ర విహారితో నొప్పి తగ్గిందా అని అడుగుతుంది. తగ్గింది అంటాడు. ఈ మధ్య నువ్వు అన్నీ దాచుకుంటున్నావ్ నొప్పి కూడా దాచుకుంటున్నావ్ ఏమో అని అంటుంది. ఇంతలో లక్ష్మీ జ్యూస్ తీసుకొని వస్తుంది. భార్యభర్తలు మాట్లాడుకుంటే నువ్వు ఏంటే చాటుగా వింటున్నావా అని లక్ష్మీని అడుగుతుంది.
విహారి లక్ష్మీని సపోర్ట్ చేస్తే ఈ మధ్య నువ్వు ఎక్కువ లక్ష్మీని సపోర్ట్ చేస్తున్నావ్ బావ అని తిడుతుంది. లక్ష్మీ జ్యూస్ ఇస్తే విహారి చేయి నొప్పి అని అరుస్తాడు. లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు ఏడుస్తున్నావేంటే అని సహస్ర లక్ష్మీ మీద కోప్పడుతుంది. సహస్రకు పద్మాక్షి పిలుస్తుంది. సహస్ర వెళ్తూ లక్ష్మీని రమ్మని పిలుస్తుంది. లక్ష్మీ వెళ్తుంటే సహస్ర చూడకుండా విహారి పిలుస్తాడు. లక్ష్మీ వెళ్లి ఎలా ఉంది అని అడుగుతుంది. తర్వాత వెళ్లిపోతుంటే విహారి చేయి పట్టుకొని ఆపుతాడు. లక్ష్మీ విహారి చేయి పట్టుకొని బాధ పడుతుంది. ఏం కాలేదు అని విహారి సర్ది చెప్తాడు. జ్యూస్ తాగమని చెప్పి లక్ష్మీ వెళ్లిపోతుంది.
విహారి తనలో తాను నీ బాధ నాకు అర్థమవుతుంది కనకం. నీ బాధ వెనక ప్రేమ కూడా నాకు అర్థమవుతుంది అతి త్వరలో అందరి ముందుకు నిన్ను నా భార్యగా తీసుకెళ్తా అనుకుంటాడు. రాత్రి అంబిక దగ్గరకు సిద్దార్థ్ వస్తాడు. నువ్వు ఎంత బెదిరించినా నా దగ్గర ఒక్క రూపాయి లేదు అని సిద్దార్థ్ అంటే మీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటాడు. భయపడిన అంబిక ఏదో ఒకటి చేసి వస్తాను ఆగు అని ఇంట్లోకి వెళ్లి యమున తన గాజులు, చైను తదితర బంగారం తీసి బాక్స్‌లో పెట్టి బాత్‌రూంకి వెళ్లిన తర్వాత అంబిక గాజులు, చైన్‌లు తీసుకొని వెళ్లి సిద్దార్థ్‌కి ఇస్తుంది. సిద్దార్థ్ వెళ్లగానే లక్ష్మీ వచ్చి అంబిక ఎదురుగా నిల్చొంటుంది. అంబిక షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















