Chinni Serial Today july 2nd: చిన్ని సీరియల్: ఒకే కాలేజ్‌లో మధు, మహి, లోహితలకు సీట్.. చందుగా జగధాత్రి యువరాజ్ ఎంట్రీ!
chinni serial july 2nd episode | మహిని దేవా ఎంటెక్ చదవమని చెప్పిన కాలేజ్‌లోనే మధు, లోహితలకు సీట్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుమిత కోసం రాత్రి తన తమ్ముడు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో మధుమిత వచ్చి సంతోషంగా అమ్మా కూరగాయలు అన్ని అమ్మేశా అని డబ్బులు తీసుకొని వస్తుంది. తండ్రికి సంతోషంతో డబ్బులు ఇస్తుంది. ఇక త్వరగా తినాలి ఏదో ఒకటి చేసేయ్ అమ్మ అంటుంది. తమ్ముడికి పది రూపాయలు ఇస్తుంది. షాప్‌కి వెళ్లి అన్నీ కొనుక్కుంటాడు.
మధుమితకి తండ్రి గోరు ముద్దులు తినిపిస్తే తల్లి కొంగుతో విసురుతూ ఉంటుంది. మధుని చూసి తన తమ్ముడు పెట్టి పుట్టావ్ అక్క అమ్మానాన్నలు నీకు సేవలు చేస్తున్నారు నేను వచ్చే జన్మలో ఆడపిల్లలా పుడతాను అంటాడు. దానికి స్వరూప అలా అంటావ్ ఏంట్రా తను ఆడపిల్ల రేపు పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్లిపోతుంది కదా ఇక చుట్టము చూపుగానే వస్తుంది అంటుంది. మధు చాలా బాధ పడుతుంది. తండ్రితో నాన్న నువ్వు నాకు ఇల్లరికం పెళ్లి చేస్తేనే చేసుకుంటా లేకపోతే ఈ జన్మలో పెళ్లి చేసుకొను అంటుంది. దాంతో ఆయన నువ్వు లేకుండా మేం ఎలా ఉండగలం తల్లి ఇల్లరికమే తీసుకొస్తా అంటుంది. మధు చాలా సంతోషంగా ఉంటుంది.
మధు తమ్ముడితో ఎంట్రా అలా చూస్తావ్ నేను ఎక్కడికీ వెళ్లను ఇక్కడే ఉంటాను అని మధు అంటే దానికి ఆ పిల్లాడు అదే నా బాధ నిన్నే భరించలేకపోతున్నా ఇంక బావ కూడా వస్తే అయిపోతా అంటాడు. మధు తమ్ముడి చెవి మెలేస్తుంది. స్వరూప భర్తతో మన అమ్మాయిని చేసుకునే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అనుకుంటుంది. ఇంతలో మహి జాగింగ్ చేసుకొని వస్తాడు. పని వాడు జ్యూస్ ఇస్తాడు. అందులో ఈగ పడి ఉంటుంది. నాగవల్లి అతన్ని కొడుతుంది. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని మహి అంటే నీ విషయంలో ఇంత కూడా పొరపాటు జరగకూడదు అని వరుణ్‌ని పిలిచి అతన్ని వెంటనే పని నుంచి తీసేయ్‌మని అంటుంది.
శ్రియ వచ్చి అత్తా నీకు బావ అంటే ఎంత ఇష్టం అత్త నువ్వు సూపర్ అత్త అంటుంది. ఇంతలో దేవేంద్ర వర్మ వచ్చి మహి నీకు శ్రియ చదివిన కాలేజ్‌లోనే ఎంటెక్‌కి సీట్ తీసుకున్నా అంటాడు. మహి నేను చేయను అంటే నాగవల్లి తన కోసం చేయమని అంటుంది దాంతో మహి ఒకే చెప్తాడు. మహి, శ్రియ దగ్గరకు వెళ్లబోయి మూడు అడుగుల దూరం గుర్తింది బావ అని దూరం జరిగి మహిని తీసుకెళ్తుంది. ఇక వసంత వచ్చి చూడముచ్చటగా ఉన్నారు కదా వదిన అంటే నాగవల్లి ఏం కాదు అస్సలు బాలేరు.. నా కొడుకు సినిమా హీరోలా ఉంటే నీ కూతురు అస్సలు బాలేదు అంటుంది. దాంతో వసంత కన్నీరు పెట్టుకుంటుంది. దాంతో నాగవల్లి శ్రియనే నా ఇంటి కోడలు అది పుట్టగానే ఫిక్స్ అని అంటుంది.
వసంత నాగవల్లి చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. నా భర్త నన్ను వదిలేశాడని తెలిసి నన్ను నా పిల్లల్ని నీ ఇంటికి తీసుకొచ్చావ్.. నీ పిల్లడితో సమానంగా నా పిల్లల్ని పెంచావ్ ఆడపడచు బాధ్యత తీసుకునే వదినలు ఈ రోజుల్లో ఎవరు ఉంటారు అని హగ్ చేసుకుంటుంది. మరోవైపు మధు ర్యాంక్ కోసం ల్యాప్ ట్యాప్ పట్టుకొని ఉంటుంది. చంటి అక్కతో టెన్షన్ పడతావ్ ఎందుకే నేను పాస్ అవడమే ఎక్కువ నీకు అయితే ఫస్ట్ క్లాస్ వస్తుందని అంటాడు. మధుమితకి మంచి ర్యాంక్ వస్తుంది. ఇంట్లో సందడి నెలకొంటుంది. చంటి తండ్రి దగ్గర రెండు వందలు తీసుకొని చికెన్ తీసుకురావడానికి పరుగులు తీస్తాడు.
మధు తనకు రాజమండ్రిలోని టాప్ కాలేజ్‌లో సీట్ వచ్చిందని అంటుంది. స్వరూప, అతని భర్త కావేరి మాటలు తలచుకొని షాక్ అయిపోతారు. ఇద్దరూ మధుతో వద్దమ్మా నువ్వు ఆ ఊరు వెళ్లొద్దు కావేరి అమ్మ చెప్పింది కదా అంటారు. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా నువ్వు వేరే కాలేజ్‌కి వెళ్లు అంటారు. మధు తను గతం కోసం వెళ్లడం లేదని మీరు భయపడేలా ఏం జరగదు అది నెంబర్ వన్ కాలేజ్ అని చెప్తుంది. చదువు కోసం మాత్రమే వెళ్తున్నా నన్ను నమ్మి పంపించండి అని బతిమాలుతుంది. దాంతో సరే అంటారు. మధు ఫ్రెండ్ మధుతో మనం చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు కలిసే చదువుకున్నాం ఇప్పుడు కూడా ఎంటెక్ కూడా కలిసే చదువుకుంటాం అంటుంది.
మరోవైపు చందు ఎంట్రీ ఇస్తాడు. (జగధాత్రి సీరియల్‌లో యువరాజ్) ఇక సరళగా (చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిలో దేవయాని రావడం రావడంతో ఇంటి ముందు చెత్త గొడవ పెట్టుకొని మహిళని చితక్కొడుతుంది. ఇక లోహిత లోపల మాస్ బయట క్లాస్‌లా గది లోపల జీన్స్ వేసుకొని మాస్ డ్యాన్స్ వేసి బయట చక్కగా చుడీదార్ వేసుకొని వస్తుంది. చందు చెల్లికి సర్‌ఫ్రైజ్‌గా తనకు చందు పని చేస్తున్న కాలేజ్ మేనేజ్ మెంట్‌తో మాట్లాడి సీటు ఇప్పిస్తాడు. లోహిత చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మొత్తానికి మహి, శ్రియ, మధుమిత, చందు, లోహిత అందరూ ఒకే కాలేజ్‌లో చదవనున్నారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















