Chinni Serial Today july 24th: చిన్ని సీరియల్: మధుకి సేవలు చేసిన 3 అడుగుల దూరం హీరో! లోహితకు 5 లక్షల గిఫ్ట్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chinni Serial Today Episode july 24th మహి మత్తులో ఉన్న మధుకి సేవలు చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, లోహితకు వరుణ్ ఖరీదైన బహుమతి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి మధుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే తలనొప్పి వదిలిపోతుందని మధుని కారు ఎక్కిస్తాడు. అడ్రస్ అడిగితే మధు చెప్పలేకపోతుంది. ఏదో ఒకటి చేసి నన్ను నార్మల్ చేయ్ మ్యాడీ అప్పుడు మీ ఇంటికి నేను మా ఇంటికి నువ్వు వెళ్లిపోవచ్చని అంటుంది.
మధు మాటలకు మిహి తల పట్టుకుంటాడు. ఏదో ఒకటి చేస్తా ఆన్‌లైన్లో వెతికి నీ తిక్క కుదుర్చుతా అని కారు సైడ్‌కి ఆపి ఫోన్‌లో వెతుకుతాడు. నిమ్మకాయ నీరు తాగిస్తే కిక్ తగ్గుతుందని చూసి మొత్తం వెతికి ఓ కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వెళ్లి నిమ్మకాయ నీరు అడుగుతాడు. నిమ్మకాయను వాటర్‌లో ఎక్కువ కలిపి తీసుకెళ్తాడు. మధుకి ఇచ్చి తాగమని అంటే తాగలేకపోతుంది. దాంతో మహినే మధుని దగ్గరకు తీసుకొని తాగిస్తాడు. మనసులో ఈ చెత్త ముఖానికి ఇలా సేవలు చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అనుకుంటాడు. మధు మహి బుగ్గలు గిచ్చేసి మా మ్యాడీ బంగారం అంటుంది. మీ ఇంటికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చెప్పు అని మహి అడిగితే వెనక సీటులో కూర్చొని ఎలా చెప్తా ముందు సీటుకి తీసుకెళ్లు అని అంటుంది. దాంతో మహి మధుని ముందు కూర్చొపెడతాడు.
మహి మధుకి బెల్ట్ పెట్టుకో అని అంటే నేను ప్యాంట్ వేసుకోలే బెల్ట్ పెట్టుకోవడానికి అంటుంది. సీటు బెల్ట్ పెట్టుకో అని మహి అంటే ఏంటి సీటు ప్యాంట్ వేసుకుందా అని అంటుంది. ఇక మహి బెల్ట్ పెడితే మళ్లీ బుగ్గలు గిచ్చేసి మా మ్యాడీ బంగారం అంటుంది. ఇక ఎలా వెళ్లాలి అడ్రస్ చెప్పు అని మహి అడిగితే అలా అలా వెళ్లు అంటుంది. మహి వింతగా చూస్తాడు. మరోవైపు లోహిత కోసం వరుణ్, శ్రేయలు మళ్లీ కేక్ తెప్పించి సర్‌ఫ్రైజ్ చేస్తారు. ఇద్దరూ దగ్గరుండి కేక్ కట్ చేయిస్తారు. వరుణ్ లోహితకు కేక్ తినిపిస్తాడు. లోహిత కూడా వరుణ్‌కి తినిపిస్తాడు. తర్వాత శ్రేయకి తినిపిస్తారు. ఆ వెంటనే వరుణ్ శ్రేయ ఇద్దరూ లోహితకు హ్యాపీనా అని అడుగుతారు. హ్యాపీ అని చెప్పగానే ఇద్దరూ ఇక వెళ్తాం అని చెప్పి వెళ్లిపోతారు.
లోహిత చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. తన ఫ్రెండ్స్ వస్తే ఏంటే ఇది కనీసం ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. వీళ్లు ఫార్మాలిటీ బ్యాచ్‌లా ఉన్నారే గిఫ్ట్‌లు ఇవ్వరేమో అంటుంది. ఇక వరుణ్ శ్రేయతో డ్రైవర్‌ని పిలిచి కారు రెడీ చేయించు నేను ఇప్పుడే వస్తాను అని లోహిత దగ్గరకు వెళ్తాడు. మళ్లీ వచ్చారు అని లోహిత అడిగితే మళ్లీ భర్త్‌డే విష్ చేస్తాడు. ఇక లోహితకు ఓ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇస్తాడు. అది చూసి లోహిత ఓ లక్ష ఉంటుంది కదా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ వద్దు అంటుంది. దానికి వరుణ్ లక్ష కాదు 5 లక్షలు అని చెప్పాడు. లోహితకు కళ్లు తిరుగుతాయి.
వరుణ్ గిఫ్ట్ తీసుకోవాలని లోహికి చెప్పడంతో మీరే మెడలో వేయండి అని అంటుంది. వరుణ్ మెడలో వేస్తాడు. లోహిత చాలా హ్యాపీగా ఫీలైపోతుంది. ఇక లోహిత ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్ ఇవ్వలేదు అని అన్నావ్ కదే చూశావా ఎంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడో అంటుంది. అది నా లవర్ రేంజ్.. అందుకే కదా నేను లవ్ చేసింది అని అంటుంది. ఇక ఇంటికి వెళ్లాలి అని తెగ కంగారు అయిపోతుంది. ఇలా వెళ్తావా అని ఫ్రెండ్స్ అడిగితే ఇలా ఎందుకు వెళ్తా ఎలా వచ్చానో అలానే వెళ్తా అని అంటుంది.
మరోవైపు మహిని మధు అటూ ఇటూ అని తిప్పిస్తూ ఉంటుంది. ఇక మహి కారులో చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన పెళ్లి కూతురు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ బయటకు కనిపించేలా ఉంటుంది. ఇక మహిని మధు పాట పాడమని తాను పాడుతానని మందు బాబులం మేం మందు బాబులం అంటూ పాడితే నువ్వు పాడకు నేను పాడను ఇది పాడుతుందని పాటలు పెడతాడు. మధు డ్యాన్స్‌లు వేస్తుంది. అటూ ఇటూ తిప్పి మొత్తానికి మధుని ఇంటి దగ్గరకు తీసుకొస్తాడు. పద్దు బయట వెయిట్ చేస్తుంది. మహి మధుని దింపి పద్దూకి అప్పగిస్తాడు. మధు మహితో నువ్వు దేవుడివి మహి. నిజంగా దేవుడివి.. రాముడిలా నువ్వు నీ భార్యని తప్ప ఇంక ఏ ఆడపిల్లని ముట్టుకోనని మూడు అడుగుల దూరం ఉన్నావ్ చూడు నువ్వు దేవుడివే. మన కాలేజ్ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి అయినా అప్పు చేసి అయినా నీకు గుడి కట్టించేస్తా అని అంటుంది. ఇక మహితో మ్యాడీ జాగ్రత్తగా ఇంటికి వెళ్లు ఇంట్లో అందర్ని అడిగాను అని చెప్పు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: లోహిత భర్త్‌డే పార్టీని నాశనం చేసిన మధు.. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అంటూ నడిరోడ్డు మీద రచ్చ!





















