Chinni Serial Today April 17th: చిన్ని సీరియల్: తల్లి ఎదురుగానే రాజుతో కలిసి అవార్డు తీసుకున్న చిన్ని.. దేవాకి వార్నింగ్ ఇచ్చిన రాజు!
Chinni Today Episode రాజుని గుడ్డిగా నమ్మొద్దని వాడిని దుర్మార్గుడిగానే చూడాలని చిన్నికి ఉష వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని ప్రిన్సిపల్ మేడం పిలుస్తుంది. అవార్డు తీసుకోవడానికి నీ ఫ్యామిలీ వాళ్లు ఎవరైనా వచ్చారా అని అడిగితే చిన్న మా నాన్న వచ్చారని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఉష బాలరాజుని గుర్తు చేసుకొని కంగారు పడుతుంది. చిన్ని నాన్న అని పిలవడంతో బాలరాజు కన్నీరు పెట్టుకుంటూ అక్కడికి వస్తాడు. చిన్ని చాలా సంతోష పడుతుంది.
రాజు అందరికీ నమస్కారం పెడతాడు. ఉష కోపంగా చూస్తుంది. రాజుతో టీచర్స్ అందరూ చిన్ని బాగా చదువుతుందని స్పోర్ట్స్‌లో కూడా టాప్‌లో ఉందని మీ సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని తల్లిలేని పిల్లకు తల్లిదండ్రీ అన్నీ మీరు అయి సపోర్ట్‌గా ఉన్నందుకు మీ అమ్మాయి ఈ స్థితిలో ఉందని అంటారు. ఇక సర్టిఫికేట్ మెమెంటోని ప్రిన్సిపల్ మేడం ఇస్తుంటే చిన్ని నాన్నతో కలిసి తీసుకుంటానని చెప్పి బాలరాజుతో కలసి తీసుకుంటుంది. ఉష కోపంగా ఉంటుంది. అందరూ ఫోటోలు తీస్తారు. చిన్ని థ్యాంక్స్ చెప్పి నాన్నతో వెళ్లిపోతుంది. ఉష ఉలుకు పలుకు లేకుండా చూస్తూ ఉంటుంది.
మహి కోసం అంతా ఎదురు చూస్తుంటారు. రాజు చిన్నిని తీసుకొని బయటకు వెళ్తూ దేవాని చూస్తాడు. చిన్ని నాన్నతో నిన్ను తీసుకొచ్చినందుకు అమ్మకి కోపం వచ్చిందని చిన్ని అంటుంది. దాంతో రాజు అమ్మ కోపం ఎంత సేపు ఉంటుందిలే అది వదిలేసి ఫ్రెండ్స్‌తో సరదాగా ఉండు అని చెప్పి పంపేస్తాడు. ఇంతలో దేవా రాజు దగ్గరకు వచ్చి నీ కూతురు ఇక్కడ లేనప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్ నీ భార్యని అదే భార్య కాని భార్యని చూడటానికి వచ్చావా అంటాడు. కంగారు పడకు నీ భార్య జైలులో చనిపోయింది కదా అంటాడు దేవా. దానికి రాజు నా భార్య జైలులో చనిపోయింది అంటే ఎందుకు జైలుకి వెళ్లిందో కూడా గుర్తుంది కదా అంటాడు. నీకు ఫ్రెండ్ అయిన పాపానికి నా భార్య చావుకి కారణం అయ్యాను అంటాడు. నీ కూతురుని చంపేస్తా అని దేవా ఇన్‌డైరెక్ట్‌గా చెప్తే దానికి రాజు మహిని చూసి నాకు కూతురు ఉన్నట్లే నీకు కొడుకు ఉన్నాడు నువ్వు నా కూతురికి ఏం చేస్తే నీ కొడుకుకి అదే రిపీట్ అవుతుందని రాజు దేవాకి వార్నింగ్ ఇస్తాడు. చిన్ని తన కూతురు అని కానీ ఉష తన భార్య అని కానీ దేవాకి తెలీకూడదు అనుకుంటాడు.
దేవా మహిని తీసుకొని అవార్డు తీసుకోవడానికి వెళ్తాడు. అందరి టీచర్లతో పాటు ఉషని పలకరిస్తాడు. ప్రిన్సిపల్ మేడం అవార్డు ఇస్తుంది. తర్వాత దేవా ఉష వెనక వెళ్లి కావేరి అని పిలుస్తాడు. నేను కావేరి కాదు అని మీకు ఎన్ని సార్లు చెప్పాలి అని కోప్పడుతుంది. బాగా కలవరిస్తున్నారు చనిపోయిన కావేరి వస్తే మీరు చనిపోతారని అంటుంది. నేను కావేరి కోసమే ఎదురు చూస్తున్నా అని దేవా అంటాడు. చనిపోయిన మనిషి రావడం అంటే దెయ్యంలా రావడం అలా వచ్చింది అంటే నిన్ను చంపుకొని తింటుందని చెప్పి ఉష వెళ్లిపోతుంది.
చిన్ని తన ఫ్రెండ్‌తో నాన్నతో అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉందని మాట్లాడుతుంది. ఇంతలో ఉష అక్కడికి వెళ్తుంది. ఏమైంది చిన్ని ఏమైంది నీకు వాడిని తీసుకొచ్చి మీ నాన్న అని అందరికీ పరిచయం చేయడం ఏంటి బుద్ధి లేదా అని తిడుతుంది. ఇప్పటి వరకు నా పక్కన నిలబడకపోయినా ఈ రోజు నా పక్కన నిలబడ్డాడు కదా తల్లిదండ్రులు ఉన్నా లేనట్లు అనాథగా బతుకుతున్నానని అందుకే నాన్నని పిలిచాను అంటుంది. నాన్న మారిపోయాడు అందుకే నీ ప్రాణాలు కాపాడాడు అని చెప్తుంది. వాడి మాయ మాటలు నమ్మి మామయ్యని వదిలి వాడి దగ్గరకు వెళ్తున్నావ్ అని తిడుతుంది. చివరి సారి చెప్తున్నా వాడి గురించి ఆలోచించొద్దు అని అంటుంది. వాడు మంచిగా మారాడు అని నువ్వు నమ్మకు నన్ను నమ్మించకు అని చిన్నికి వార్నింగ్ ఇచ్చి ఉష వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















