Chinni Serial Today April 10th: చిన్ని సీరియల్: సత్యంబాబు కొడుకుని మేనల్లుడు అనేసిన కావేరి.. వదినకు దొరికిపోయిందా!
Chinni Today Episode చిన్ని ఫ్యామిలీ గుడికి రావడం రాజుని చూసిన సత్యంబాబు చిన్నిని అతనికి దూరంగా ఉండమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సరళ చిన్నిని ఎక్కడికి వెళ్లావ్ అని ప్రశ్నించడంతో.. అత్త చాలా అందంగా ఉన్నావ్ అని చిన్న అనడంతో సరళ మురిసిపోతుంది. మీ ముగ్గురికీ నా పోలికలు వచ్చాయని అంటుంది. చందు తల్లితో మా ఇద్దరికీ నీ పోలికలు వస్తాయి కానీ చిన్నికి ఎందుకు నీ పోలికలు వచ్చాయని అడుగుతాడు. దానికి సరళ నేను తన మేనమామ భార్యని కదా ఈ మధ్య అలా కూడా పోలికలు వస్తాయని అంటుంది. అందరూ నవ్వుకుంటారు.
తల్లిని ముస్తాబు చేసిన చిన్ని..
చిన్ని తన తల్లి దగ్గరకు వెళ్లి అందరూ రెడీ అయిపోయారు నువ్వు రెడీ అయ్యావా అని అడుగుతుంది. కావేరి రెడీ అవుతుంటే చిన్ని నేను రెడీ చేస్తాను అని తల్లిని రెడీ చేస్తుంది. అమ్మని పెళ్లి కూతురిలా చూసే అదృష్టం పిల్లలకు షష్టిపూర్తి రోజు లభిస్తుంది కానీ నాకు ఆ అదృష్టం ఈ రోజు వచ్చిందని అంటుంది. తల్లిని హగ్ చేసుకుంటుంది. అందరూ గుడికి బయల్దేరుతారు.
వీడు నా మేనల్లుడు కదా..
కావేరి కిందకి రాగానే జేజమ్మ వస్తున్నట్లుందని చందు సెటైర్లు వేస్తాడు. దాంతో కావేరి ఒక్క మొట్టికాయ ఇస్తుంది. నాలుగు తగిలించమ్మా ఆటపట్టించడం మానేస్తాడు అని సత్యం నవ్వుతూ అంటే దానికి కావేరి పర్లేదులే బ్రో ఎంతైనా నా మేనల్లుడు కదా అంటుంది. మేనల్లుడు ఏంటి అని సరళ నోరెళ్లబెడుతుంది. దాంతో కావేరి అన్నయ్య కాని అన్నయ్య కొడుకు కాబట్టి మేనల్లుడు కానీ మేనల్లుడు అని కవర్ చేస్తుంది. అందరూ గుడికి చేరుకుంటారు.
ఎలా అయినా చిన్నికి గిఫ్ట్ ఇవ్వాలి..
రాజు ముందే గుడికి చేరుకుంటాడు. చిన్నికి గిఫ్ట్‌గా ఇస్తానన్న చైన్‌కి రాజు పూజ చేయిస్తాడు. ఎలా అయినా చిన్నికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు. ఉష వాళ్లిన చూసిన రాజు చిన్నికి హాయ్ చెప్తాడు. చిన్ని, రాజు సైగలు చేసుకోవడం చూసిన సత్యంబాబు.. ఇన్‌డైరెక్ట్‌గా రాజు వాళ్లతో మాట్లాడొద్దని చిన్నికి చెప్తాడు. అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆ దుర్మార్గుడు వచ్చుంటాడా అని కావేరి మనసులో అనుకొని రాజుని చూసి ఛీ అనుకుంటుంది.
దేవా, వల్లి కూడా వచ్చేస్తున్నారు..
నాగవల్లికి తన మనిషి కాల్ చేసి కావేరి వాళ్లు గుడికి వచ్చారని చెప్తుంది. దానికి నాగవల్లి చచ్చారు పది నిమిషాల్లో బయల్దేరుతున్నా అని అంటుంది. దేవా నాగవల్లి కోసం వెయిట్ చేస్తుంటే వల్లి వచ్చేస్తుంది. వల్లి వాళ్లు కూడా గుడికి బయల్దేరుతారు. సత్యం బాబు ఫ్యామిలీతో పాటు ప్రదక్షిణలు చేస్తాడు. చిన్ని డల్‌గా ఉంటే చందు ఏమైందని అడుగుతాడు. రాజు మామతో మాట్లాడాలి అని అందా అని అడుగుతాడు. అవును కానీ మామయ్య వద్దు అన్నాడు కదా అని అంటుంది. దానికి చందు నేను ఏదో ఒకటి చేస్తానని అరటి తొక్క మీద కాలు వేసి జారిపోతాడు. కాళ్లు కడగాలి అని చిన్నిని తీసుకెళ్తాడు.
ఏంటి కొత్తగా మామయ్య అంటున్నావ్..
చందు చిన్నిని రాజుని చూపించి అదిగో మామయ్య అని అంటాడు. ఎప్పుడు అంకుల్ అనేవాడివి ఇప్పుడేంటి మామయ్య అంటున్నావ్ అని అడుగుతుంది. నువ్వు నాన్న అంటున్నావ్ కదా అందుకే మామయ్య అంటున్నా అని చందు అంటాడు. ఇక చిన్ని నాన్నతో మాట్లాడుతుంది. నాన్న మామయ్య ఏం అనకూడదు అంటే నువ్వు టీచరమ్మ ఫ్రెండ్ అయిపోవాలి అని అంటుంది. టీచర్‌ని బురిడీ కొట్టించమని చందు అంటాడు. సంతోషంగా గుడికి వచ్చారు సంతోషంగా వెళ్లండి నేను మాట్లాడితే గొడవలు అవుతాయి అవన్నీ వద్దు అని అంటాడు. చిన్నిని రాజు పంపేస్తాడు. చిన్ని ఫీలైపోతుంది. దేవా ఫ్యామిలీ గుడికి వస్తారు. గుడి నిర్వాహకులు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతారు. దేవా వాళ్లు గుడి లోపలికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















