Rangula Ratnam July 18th: ‘రంగులరాట్నం’ సీరియల్ : కూతురి చెంప పగలగొట్టిన చక్రి, పూర్ణ పై ఫైరైన శంకర్ ప్రసాద్?
తండ్రిని స్వప్న గట్టిగా నిలదీయడంతో తిరిగి ఆయన చెంప పగలగొట్టడం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం తెలుసుకుందాం.
Rangula Ratnam July 18th: పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సత్యం, రఘు పోలీసు వాళ్లకు ఎలాగైనా శంకర్ ప్రసాద్ ను వెతకండి అని అంటారు. ఇన్స్పెక్టర్ కూడా వెతుకుతామని అంటారు. ఇక బయటికి వచ్చినా రఘు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దాంతో సత్యం ఎందుకు భయపడుతున్నావు ఇంత పిరికి వాడిగా ఎందుకు ఉన్నావు అని ఇప్పుడు కాకుండా రేపైనా శంకర్ తిరిగి వస్తాడు అని అంటాడు.
ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు.. ఇప్పుడు తనను అందరు మోసం చేశారన్న భ్రమ లో ఉన్నాడు. ఆయన ఏమైనా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది.. కన్న కూతురు దూరం అవటంతో కూడా.. ఎవరూ లేరని అనుకుంటున్నాడని అందుకే ఆవేశంలో ఏదైనా చేసుకుంటాడేమో అని కంగారుగా ఉంది అనటంతో సత్యం నా ఫ్రెండ్ అలాంటివాడు కాదు.. వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అని ధైర్యం ఇస్తాడు.
ఇక ఇంట్లో పూర్ణ భర్త గురించి బాధపడుతూ ఉంటుంది. ఎన్ని రోజులైంది ఇంకా తిరిగి రాలేదు ఏమైపోయాడో అని సీతతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రఘు ఇంట్లోకి రావడంతో ఏం జరిగింది అని అడుగుతుంది. పోలీసులు సిటీ మొత్తం వెతికినా కూడా దొరకలేదు అనటంతో పూర్ణ మరింత బాధపడుతుంది. ఇక సిటీలోనే దొరకలేదు అంటే బయటికి వెళ్తే అసలే దొరకడు అని ఏడుస్తుంది.
అదే సమయంలో సత్యం, జానకి కూడా ఇంటికి వస్తారు. ఇక సత్యం తన ఫ్రెండు పిరికివాడు కాదని.. ఎక్కడ ఉన్న క్షేమంగానే ఉంటాడు అని.. ఇవాళ కాకుండా రేపైనా ఇంటికి వస్తాడు అని ధైర్యం ఇస్తాడు. ఇక పూర్ణ కూడా నేను కూడా అంతే ధైర్యంగా ఉన్నాను అని.. ఎప్పుడెప్పుడు వస్తాడా అని గుమ్మం వైపు చూస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత జానకి అడగాలా వద్దా అని మొహమాటం కొద్దీ కూతురికి శ్రీమంతం చేస్తాము అని అంటుంది.
కానీ సీత ఒప్పుకోదు. పుట్టింటి వాళ్లను బాధ పెట్టొద్దు అని పూర్ణ చెబుతూ ఉంటుంది. కానీ సీత మామయ్య ఇంటికి వచ్చాక అందరం కలిసాకే ఘనంగా చేసుకుందాము అని అంటుంది. రఘు కూడా అదే మాట అంటాడు. వాళ్ళ నిర్ణయాన్ని కాదనకుండా జానకి కూడా సరే అంటుంది. మరోవైపు రోడ్డుపై స్వప్న నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.. రేఖ కారులో తన తండ్రి చక్రి కనిపించడంతో వెంటనే కారును ఫాలో అవుతుంది.
ఇక రేఖ డాక్యుమెంట్స్ గురించి చక్రిని అడుగుతుంటే అవి కారులో ఉన్నాయని మళ్లీ వెనక్కి తిరిగి వస్తాడు. ఇక రేఖ చక్రిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కారు దగ్గరికి వెళ్లిన చక్రికి స్వప్న ఎదురు పడుతుంది. జైలు నుండి వచ్చాక నా దగ్గరికి రాకుండా దాని దగ్గరికి ఎందుకు వెళ్లావు అంటూ రేఖ గురించి మండిపడుతూ మాట్లాడటంతో.. రేఖను ఏమీ అనకూడదు తను నాకు అన్నం పెట్టిన దేవత అంటూ రేఖను వెనకేసుకొస్తూ ఉంటాడు.
అయినా కూడా స్వప్న రేఖ గురించి నానా రకాలుగా మోసం చేసింది అని మాట్లాడటంతో వెంటనే కూతురు అని చూడకుండా చక్రి స్వప్న చెంప పగలగొడతాడు. దాంతో స్వప్న ఛీ కొట్టి అక్కడ నుంచి వెళ్తుంది. అదంతా చూసిన రేఖ లోపలికి వెళ్లగా అక్కడికి చక్రి వస్తాడు. ఇక్కడే ఉన్నారు ఏంటి అని అడగటంతో...నువ్వు స్వప్న తో మాట్లాడుతున్న మాటలు విన్నాను అని అంటుంది.
తన మాటలు పట్టించుకోకు అని చక్రి అనటంతో.. ఎప్పుడు అంటూనే ఉంటుంది కానీ నీ మీద డౌట్ ఉండే.. అది ఇప్పుడు క్లియర్ అయింది అని అంటుంది. ఆవేశంగా ఇంటికి వెళ్లిన సప్న జరిగిన విషయం మొత్తం రఘు కి చెబుతుంది. తరువాయి భాగంలో శంకర్ ప్రసాద్ ఇంటికి రావడంతో పూర్ణ దగ్గరికి వెళ్లి ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి అనటంతో.. వెంటనే శంకర్ అమాయకంగా ఉంటూ నమ్మకం ద్రోహం చేశావని కోపంగా అంటాడు. దాంతో నేనేం ద్రోహం చేశాను నీ భార్య ని అండి అని అనడంతో నిన్ను అని చెయ్యి ఎత్తుతాడు. దాంతో పూర్ణ షాక్ అవుతుంది.
also read it : Prema Entha Madhuram July 18th: ‘ప్రేమ ఎంత మధురం’: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. టెన్షన్ లో రేష్మ, ప్రీతి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial