Prema Entha Madhuram July 18th: ‘ప్రేమ ఎంత మధురం’: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. టెన్షన్ లో రేష్మ, ప్రీతి?
మాన్సీ అను పూజను ఆపివేయటానికి ప్రయత్నించటంతో తిరిగి అను తనని కొట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 18th: .అను కొలను దగ్గరికి వెళ్తున్న సమయంలో మాన్సీ అను కి అడ్డుపడి ఎలాగైనా పూజ ముహూర్తం దాటేలాగా చేయాలి అని అనుకుంటుంది. ఇక అను హడావుడిగా వస్తూ ఎదురుగా ఉన్న మాన్సీని చూసి షాక్ అవుతుంది. పక్కకు జరగండి అని అను అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మాన్సీ వెనక్కి లాగి మరి నీ మాజీ తోటి కోడలు కనిపించినప్పుడు పలకరించకుండా అలా వెళ్తావు ఏంటి అని మాట్లాడుతుంది.
దాంతో అను ఇప్పుడు నీతో మాట్లాడే తీరిక లేదు అని అనటంతో.. ఓహో పూజ చేస్తున్నావా.. భర్తకు కుటుంబానికి దూరంగా ఉన్నావ్. పిల్లల్ని చూసుకుంటూ దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నావ్ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక అను ఓపికగా తనను వెళ్ళనివ్వమని చెబుతూ ఉంటుంది. కానీ మాన్సీ వినిపించుకోకుండా రెచ్చిపోయి మాట్లాడటంతో లాగి చెంప మీద గట్టిగా కొడుతుంది.
దెబ్బకు మాన్సీ కింద పడిపోతుంది. ఇక అను మాన్సీ మెడ మీద త్రిశూలం పెట్టి బెదిరించడంతో అప్పుడే రేష్మ వచ్చి ఆపుతుంది. వెళ్లి పూజకు పువ్వులు తీసుకొని రమ్మని పంపిస్తుంది. ఇక రేష్మ మాన్సీ తో మా అనుకి మామూలుగా గొడవ రాదు కానీ ఈరోజు తను ఇలా ప్రవర్తించింది అంటే నువ్వే ఏదో చేశావు.. మళ్లీ అను జోలికి వస్తే చంపేస్తాను అని బెదిరిస్తుంది.
ఇక అను కొలనులోకి వెళ్లి పువ్వులను చూసి సంతోషపడి తెంపుతూ ఉంటుంది. మరోవైపు ఆర్య పూజ కూడా ముగియడంతో పూజారి దగ్గరికి వెళ్లి వాటిని నీటిలో వదిలేయమని చెబుతాడు. వెంటనే ప్రీతి అనుని ఆర్య కంటపడకుండా చేయాలి అని రేష్మ దగ్గరికి వెళ్లి అను ఎక్కడ అని అడుగుతుంది. కొలనులో ఉంది అని చెప్పటంతో వెంటనే షాక్ అవుతుంది.
ఆర్య కూడా అక్కడికే వెళ్తున్నాడు అని చెప్పటంతో రేష్మ కూడా టెన్షన్ పడుతుంది. ఇక వెంటనే రేష్మ ఆర్య సార్ అని గట్టిగా పిలవడంతో వెంటనే అను భయపడి అక్కడున్న విగ్రహం వెనుక దాచుకుంటుంది. ఇక మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సార్ అని రేష్మ ఆపి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆర్య కొలను దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడ అను లేకపోయేసరికి రేష్మ ఊపిరి పీల్చుకుంటుంది.
ఆర్య పూజ చేస్తుండగా వెంటనే రేష్మకు అను కనిపించడంతో పూజ చేయండి బాబు మా దగ్గర ఉండటం లేదు అని అంటుంది. ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అను ఆర్య నీటిలో వదిలేసిన పువ్వులు, బొట్టు పెట్టుకుంటుంది. ఆ తర్వాత పూజ దగ్గర కూర్చుంటుంది. మరోవైపు ఆర్య కూడా బాబుని ఎత్తుకొని పూజలో కూర్చుంటాడు. ఇక పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.
ఇంటికి వెళ్ళిన తర్వాత అను పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. అనుని చూసి ప్రీతి కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంది. ఇక అను థాంక్స్ చెప్పడంతో ఇప్పుడు కాదు నీ కష్టాలన్నీ తీరాక థాంక్స్ అని చెప్పు అంటుంది ప్రీతి. తాము ఎప్పుడు కలుస్తామో అన్న అనుమానంలో ఉంటుంది అను. ఆ తర్వాత నీ బర్త్ డే ఈవెంట్ కి వెళ్ళాలి అని అనుతో అంటుంది.
Also read it:
Rangula Ratnam July 17th: రేఖను మోసం చేసిన మూర్తి.. శంకర్ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సత్యం?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial