అన్వేషించండి

Brahmamudi November 20th Today Episode : మూర్తికి తెలిసిన అప్పు లవ్ మేటర్.. అరుణ్ గురించి రాజ్ ఎంక్వైరీ!

Brahmamudi Serial Today Episode : అరుణ్ గురించి రాజ్‌ కావ్యను అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది

Brahmamudi Serial November 20th Episode : కనకం తన భర్తతో మనకు మళ్లీ ఓ సమస్య మొదలైందని చెప్తుంది. కంగారుగా మూర్తి ఏమైందని అడుగుతాడు. అప్పు కల్యాణ్‌బాబును ప్రేమిస్తోందని కనకం చెప్పడంతో మూర్తి షాకైపోతాడు. ఏంటీ ఇలా జరిగింది అని ఇద్దరూ చాలా బాధపడతారు. ఇక మూర్తి(Brahmamudi Serial) అయితే ఈ విషయం అప్పూతోనే తేల్చుకుంటా అని అడుగుతానంటూ వెళ్తుండగా కనకం ఆపేస్తుంది.

కనకం: వద్దు అండీ ఇప్పటికే ఈ విషయం నాకు తెలుసు అని అప్పు నా మొఖం కూడా చూడలేకపోతుంది. ఇక మీకు తెలుసు అని తెలిస్తే ఈ ఇంట్లో కూడా ఉండదేమో. 

మూర్తి: కానీ ఇంతదాకా వచ్చాక ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిరాకా.. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లల్ని ఆ ఇంటికి ఇచ్చామని మన మీద నింద వేశారు కదా.. ఇక ఈ విషయం పొరపాటున తెలిస్తే తల్లిదండ్రులుగా మనద్దరం ఆ ఇంటికి సమాధానం చెప్పాలి. వాళ్లందరి మధ్య దోషులుగా నిలబడాలి. నేను కోలుకోలేకపోతున్నా కనకం. ఏది ఏమైనా అప్పు ఇంకితం తెలిసిన పిల్లా అని నా నమ్మకం

కనకం: నేను కోలుకోలేకపోతున్నానయ్యా అప్పు ఏమైపోతుంది అని ఓవైపు భయం.

మూర్తి: ఏమీ అవ్వదులే అర్ధం చేసుకోవాలి. ఆ ఇంటికి ఈ ఇంటికి చాలా దూరం అని అర్ధం చేసుకోవాలి. అదృష్టం కొద్ది కల్యాణ్ ఇష్టపడి అనామికను ఇష్టపడి జీవితంలోకి రానిచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అప్పు ఇంకా అతడి మీద అశలు పెంచుకునేది అది తెలిసి వాళ్లంతా కావాలనే ముగ్గురు ఆడపిల్లల్ని వాళ్ల వారసులకు కావాలనే వల వేసేలా చేసి కోడళ్లుగా పంపించామని మన మీద నింద పడేది. ఇది ఈ రాత్రి ఈ ఇంట్లోనే సమాధి అయిపోవాలి కనకం ఆ భారమంతా నీదే

చిట్టీ: రాజ్ నీతో ఓ విషయం మాట్లాడాలిరా. చాలా ముఖ్యమైన విషయం. ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు అందుకే నీతో చెప్తున్నా( అని అరుణ్ ఫొటో చూపిస్తుంది) ఇతను ఎవరో నాకూ తెలీదు. ఇంటికి కొరియర్ వచ్చింది. ఎవరు పంపించారో ఎందుకు పంపించారో తెలీదు. ఈ ఫొటోతో పాటు స్వప్నతో ఈ అబ్బాయి దిగిన ఫొటోలు ఆ కొరియర్‌లో ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని వాటిని చింపేశాను. స్వప్నను అడగాలని తన గదిలోకి వెళ్తే స్వప్న ఇతను ఎవరో తనకు తెలీదు అని అబద్ధం చెప్పింది. (Brahmamudi Serial )ఎందుకు దాచాలి అనుకుందో అర్ధం కాలేదు. ఒక్క క్షణం తాను తప్పు చేస్తుందేమో అనిపించింది. కానీ నిజం తెలీకుండా నిందలు వేయడం తప్పు కదా అందుకే తనని ఇంకా అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా వచ్చేశాను. కానీ దీనివల్ల ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తాయేమో అని భయంగా ఉంది. అసలే మీ రుద్రాణి అత్తయ్య గురించి నీకు తెలుసుకదా. తాతయ్యకు ఆరోగ్యం బాగోలేని ఇలాంటి టైంలో ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఈ ఫొటో తీసుకో ఈ అబ్బాయి గురించి తెలుసుకుంటే మనకు నిజం తెలుస్తుంది. అప్పుడు స్వప్నను అడగొచ్చు. అంతవరకు మనం తొందర పడితే అది రాహుల్, స్వప్నల జీవితాల్లో పెద్ద సమస్య అయిపోతుంది.

రాజ్: నువ్వు చెప్పేది నిజమే నానమ్మ (మనసులో ముందు కళావతిని అడగడం దగ్గర మొదలు పెడదాం. తను ఏం చెప్తుందో అప్పుడు ఏం చేయాలో చూద్దాం) ఈ విషయం ఇంట్లో ఇంకెవరికైనా తెలుసా?

చిట్టీ: లేదు. సరే చెప్పకు ఈ విషయం నేనే తెలుసుకుంటా.

రాజ్: (రాజ్ కావ్యకు ఫొటో చూపిస్తూ) ఇతను నీకు తెలుసా 

కావ్య: మనసులో.. ఇతను అరుణ్ కదా. ఇతని గురించి ఈయన ఎందుకు అడుగుతున్నారు. అసలు ఇతని ఫొటో మావారి దగ్గరకు ఎలా వచ్చింది పైగా రాత్రి వాడొచ్చి మాట్లాడి వెళ్లాడు. ఇంతలోనే ఈయన అడగడం ఏంటి. అంతే రాత్రి ఈయన కూడా నాతోపాటు చూశారా ఏంటి. 

రాజ్: హలో మేడమ్ నిన్ను రీసెర్చ్ చేయమని అడగలేదు. ఎవరో నీకు తెలుసా అని అడిగా అంతే.

కావ్య: అతని పేరు అరుణ్ మా అక్క కాలేజ్ ఫ్రెండ్. 

రాజ్: ఇతని గురించి ఇంకేం తెలుసు.

కావ్య: తెలీదు అండీ కానీ డాక్టర్ చదివాడని మాత్రం తెలుసు. మీరు అడిగింది నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు చెప్పండి అతని గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు.

రాజ్: చెప్పను.

కావ్య: ఇదేంటి రాత్రి అక్కను అడిగితే ఏం లేదని చెప్పింది. మరి ఇప్పుడు ఈయన ఎందుకు అడుగుతున్నారు. మా అక్క ఏదో దాచిపెడుతుంది అదేంటో కనిపెట్టాలి.

రాజ్: మనసులో అయినా ఈ కళావతి చెప్పింది నేనెందుకు నమ్మాలి. నానమ్మ చెప్పినట్లు ఇది చాలా సెన్సిటివ్ మేటర్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. 

మరోవైపు కల్యాణ్ అప్పు వాళ్ల ఇంటికి వస్తాడు. బయటకు వెళ్దాం రెడీ అవ్వు అంటే కల్యాణ్ అంటే అప్పు సీరియస్ అవుతుంది. పెళ్లి పనులు చూసుకోవాలని నువ్వు రాకుంటే నాకు చాలా కష్టం అవుతుందని కల్యాణ్ చెప్తాడు. ఇంతలో అప్పు తనతో రావడం కుదరదని మూర్తి చెప్తాడు. కాలేజ్ పని ఉందని చెప్పి కనకం కవర్ చేస్తుంది. దీంతో కల్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  

ఇక కావ్య స్వప్న దగ్గరకు వచ్చి రాజ్ స్వప్నను అనుమానిస్తున్నాడు, అరుణ్ ఫొటో తన భర్త దగ్గరకు వచ్చిందని చెప్తుంది. దీంతో స్వప్న షాక్ అవుతుంది. బామ్మ రాజ్‌కు ఫొటో ఇచ్చుంటుందని అనుకుంటుంది. ఇక స్వప్న, కావ్యలు అరుణ్ గురించి మాట్లాడటం పైనుంచి రాహుల్ చూస్తాడు. అయితే అరుణ్ తనకు ఒకప్పుడు జస్ట్ ఫ్రెండే అని ఎవరు ఎన్ని ఎంక్వైరీలు(Brahmamudi Serial) చేసినా తాను భయపడనని అంటుంది. ఇక రాహుల్ ఈ విషయంలో స్టేజ్ టూ స్టార్ట్ చేయాలని అరుణ్‌కి కాల్ చేస్తాడు. అర్జెంటుగా పది లక్షలు కావాలని స్వప్నకు అడగమని చెప్తాడు.  మరోవైపు రాజ్ పోలీసు ఆఫీసర్ సుమన్‌కు కాల్ చేసి అరుణ్ ఫొటో పంపించి అరుణ్ డిటైల్స్ కనుక్కోమంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget