Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు నిజం చెప్పిన అపర్ణ – అబార్షన్ చేయించుకోనన్న కావ్య
Brahmamudi serial today episode September 26th: రాజ్ నిజం చెప్పగానే అపర్ణ వెంటనే కావ్య దగ్గరకు వెళ్లి అబార్షన్ చేయించుకోమని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్ బాధగా వెళ్లి గార్డెన్ లో కూర్చుని ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు. రాజ్ బాధను చూసి తట్టుకోలేక కళ్యాణ్ కూడా ఎమోషనల్ అవుతుంటాడు.
కళ్యాణ్: ఇప్పటికైనా వదినకు నిజం చెప్పు అన్నయ్యా
రాజ్: చెప్పలేనురా నిజం చెప్పి మీ వదినను దూరం చేసుకోలేను
కళ్యాణ్: అయితే కనీసం అమ్మానాన్నలకైనా నిజం చెప్పు అన్నయ్యా అందరూ నిన్ను కార్నర్ చేసి తిడుతుంటే నేను చూడలేకపోతున్నాను
అంటూ కళ్యాణ్ బాధగా వెళ్లిపోతాడు. మరోవైపు రూంలో అపర్ణ, సుభాష్ ఇద్దరూ బాధపడుతుంటారు. అపర్ణ, రాజ్ అన్న మాటలు గుర్తు చేసుకుని తిడుతుంది.
అపర్ణ: అసలు వాడు ఇలాంటి పనులు చేశాడంటే నమ్మలేకపోతున్నాను అండి.
సుభాష్: నేను అదే ఆలోచిస్తున్నాను అపర్ణ. అన్ని విషయాల్లోనూ ఎంతో పర్టిక్యులర్ గా ఉండే రాజ్ ఈ విషయంలో ఎందుకు ఇంత పూలిష్ గా ఉన్నాడో అర్థం కావడం లేదు..
అపర్ణ: లేదంటే వాడికి గతం గుర్తుకు వచ్చినప్పుడే ఏదో జరిగి ఉంటుంది. లేదంటే నా కొడుకు ఇలా చేయడండి. అసలు వాడు మాట్లాడే విధానం చూస్తుంటే అసలు వాడు మన రాజ్ యేనా అనే అనుమానం వస్తుంది. ఇలా ఉన్న పళంగా అబార్షన్ చేయించడానికి తీసుకెళ్లడం ఏంటండి.. అది కూడా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా.. అప్పుడే వాడు అంత పెద్ద వాడు అయిపోయాడా..?
సుభాష్: నువ్వు ఇంకా వాడు మనతో చెప్పలేదు అనే దగ్గరే ఉన్నావు.. కానీ వాడు కావ్యకు కూడా చెప్పలేదు కదా..? మనకే ఇలా ఉంటే పాపం హాస్పిటల్ వరకు చెకప్ కోసం అంటూ వెళ్లిన కావ్యకు ఎలా ఉంటుందో ఆలోచించు.. నిన్నటి వరకు బిడ్డే ప్రాణం అనుకున్న రాజ్ ఈరోజు ఆ బిడ్డ ప్రాణాలే తీయడానికి తీసుకెళ్లాడని తెలియగానే కావ్య ఎలా తట్టుకుని ఉంటుంది. వాడికసలు కామన్‌సెన్సే లేదు
అపర్ణ: కామనె సెన్సే కాదండి వాడికసలు బ్రెయినే పని చేయడం లేదేమో.. అసలు ఎందుకు ఇంత చెత్త పని చేయాలనుకున్నాడో కడిగేసి వస్తాను
అని రాజ్ దగ్గరకు అపర్ణ వెళ్లబోతుంటే.. రాజే దగ్గరకు వస్తాడు.
అపర్ణ: ఓ వచ్చావా..? ఎందుకిలా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నావు.. మమ్మల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నావు.. నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా..?
రాజ్: నాకేం పిచ్చి పట్టలేదు.. నేను బాగానే ఉన్నాను
అపర్ణ: మరైతే దాన్ని హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లావు.. నీ బిడ్డను నువ్వే ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు
రాజ్: ఆ బిడ్డను తీసేయకపోతే కళావతి చచ్చిపోతుంది అమ్మా
అపర్ణ: ఏంట్రా నువ్వు చెప్పేది..
సుభాష్: కావ్య చనిపోవడం ఏంట్రా
రాజ్: అవును నాన్న కళావతి బిడ్డను కంటే తను చచ్చిపోతుంది. ఈ విషయం కళావతికి చెబితే తను ఒప్పుకోదని తెలుసు.. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు.. తనకు బిడ్డే కావాలని అంటుంది. అందుకే ఆ నిజం కళావతికి చెప్పుకోలేక నా బిడ్డను చంపుకోలేక ఇన్ని రోజులు నాలో నేనే నరకం అనుభవించానమ్మా ఇద్దరిని కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నమంటూ లేదు.
సుభాష్: అసలు కావ్యకు నిజం చెబితేనే కదరా ఒప్పుకునేది లేనిది తెలుసేది.
రాజ్: తను ఒప్పుకోదమ్మా.. నాకు తెలుసు
అపర్ణ: అయితే పదరా కావ్యకు నిజం చెప్పేద్దాం ఇప్పుడే
అంటూ రాజ్ చెప్తున్నా వినకుండా కావ్య దగ్గరకు వెళ్తుంది. అప్పటికే హాల్లో కూర్చుని బాధపడుతున్న కావ్య దగ్గరకు ఇందిరాదేవి వెళ్లి ఓదారుస్తుంది. ఇంతలో అపర్ణ వచ్చి కావ్యను అబార్షన్ చేయించుకో అని చెప్తుంది. దీంతో కావ్య ఏడుస్తూనే అపర్ణను ప్రశ్నిస్తుంది. ఎవరు చచ్చిపోతారని చెప్తున్నారు అంటుంది. దీంతో అపర్ణ నువ్వే చనిపోతావే అంటూ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కావ్య మాత్రం తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ తనకు బిడ్డే కావాలంటుంది. ఎవరు చెప్పినా కావ్య కన్వీన్స్ కాదు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















