Brahmamudi Serial Today October 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లేబర్ ఆఫీసర్‌గా మారిన కనకం – రాజ్ కు వార్నింగ్ ఇచ్చిన సీతారామయ్య
Brahmamudi Today Episode: కావ్య అగ్రిమెంట్ పేపర్స్ ఎలాగైనా కొట్టేయాలనుకున్న కనకం లేబర్ ఆఫీసర్ అవతారమెత్తడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: నా కొడుకు సంగతి పక్కన పెట్టు అసలు నీ కొడుకు గుడిలో ఏం చేస్తున్నాడో తెలుసుకో అంటూ అపర్ణ ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకుని బయట వేరే ఆమ్మాయితో షికార్లు చేస్తున్నాడు అని చెప్పడంతో స్వప్న, రాహుల్ షాక్ అవుతారు. అపర్ణ వెళ్లిపోతుంది. రాహుల్ ఏదో ఫోన్ వచ్చినవాడిలా వెళ్లిపోతుంటే స్వప్న అడ్డుపడుతుంది. ఇందిరాదేవి బాగా తేల్చుకో స్వప్న అంటూ చెప్పి వెళ్లిపోతుంది.
స్వప్న: కారులో షికారుకు తీసుకెళ్లిన అమ్మాయి ఎవరు? రా మాట్లాడాలి.
రాహుల్: నాక్కొంచెం పని ఉంది తర్వాత మాట్లాడుకుందాం.
స్వప్న: ఇప్పుడు గనక నువ్వు రాకపోతే ముసుగేసి కొడతా..?
రుద్రాణి: ఏయ్ ఏమన్నావు.. ముసుగేసి కొట్టింది నువ్వా..
స్వప్న: నాకు తెలియదు. నేనే కొట్టి ఉంటే మిరిలాగా ఉండేవారా? ఇంట్లో మళ్లీ గొడవలు ఎందుకు పెట్టేవారు. రాహుల్ రా…
అంటూ బలవంతంగా పైకి తీసుకెళ్లి రాహుల్ ను కొడుతుంది. కిందనుంచి రుద్రాణి సౌండ్ వింటూ భయపడుతుంది. మరోవైపు కూరగాయల లిస్టు కావ్యకు ఇచ్చిన తీసుకురమ్మని చెప్తుంది కనకం. కావ్య వెళ్తుంటే అనామిక వస్తుంది.
అనామిక: హాయ్ ఎక్స్ ఫో అవార్డు విన్నర్ ది గ్రేట్ కావ్య గుడ్ మార్నింగ్. అనామిక కంపెనీలో పని చేసే వెరీ టాలెంటెడ్ డిజైనర్ ఆఫ్ట్రాల్ కూరగాయలు తీసుకురావడానికి వెళ్లడమా?
కనకం: ఆప్ట్రాల్ కూరగాయలే కదాని తినటం మానేస్తే.. నువ్వు కూడా ఆప్ట్రాల్ అనామికవు అయిపోతావు. ఏయ్ నువ్వు వెళ్లవే దీనిలాగా వాడిపోయిన పుచ్చిపోయిన కూరగాయలు తీసుకురాకు. కుక్కలకు వేసినా తినవు.
కావ్య: అలాగేనమ్మా ఈ అనామకురాలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుని వెళ్తాను.
మా ఆఫీసులో పని చేయడానికి ఒప్పుకున్నాక ఆఫీసుకు తీసుకెళ్దామని వచ్చాను అంటుంది. దీంతో కావ్య కోపంతో అనామికను తిడుతుంది. ఇంత జరిగినా ఎలా వస్తానని అనుకున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మా కంపెనీలో వర్క్ చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం చేశావు లేదంటే అనవసరంగా ప్లాబ్లెమ్స్ లో ఇరుక్కుంటావు. నువ్వు ఆఫీసుకు రాకపోతే కోర్టులో కేసు వేసి నిన్ను జైలుకు పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
కనకం: ఏంటే అది జైలు గియిలు అంటుంది. నిజంగా అగ్రిమెంట్ ప్రకారం నువ్వు వెళ్లి పని చేయకపోతే సమస్య పెద్దది అవుతుందా?
కావ్య: అవును అమ్మా అగ్రిమెంట్ ప్రకారం అయితే నేను వెళ్లాలి. కానీ దుగ్గిరాల ఇంటికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను.
అని చెప్పి కావ్య మార్కెట్‌కు వెళ్తుంది. అసలు అగ్రిమెంట్ నే లేకుండా చేస్తే అని కనకం ఆలోచిస్తుంది. మరోవైపు కళ్యాణ్ కోచింగ్ సెంటర్ కు వెళ్లి అప్పు కోసం ఫీజు కడతాడు. సగమే కట్టారని కోచింగ్ సెంటర్ అతను అడగ్గానే డబ్బులు అడ్జస్ట్ కాలేదని రెండు రోజుల్లో కడతానని కళ్యాణ్ చెప్పడంతో అతను సరే అంటాడు. బయటకు వచ్చిన అప్పు కళ్యాణ్ ను చూసి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు రాజ్ ను పిలిచి సీతారామయ్య తిడతాడు. కావ్య విషయంలో నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు. రాజ్ మాత్రం త్వరలోనే అందరికీ ఈ విషయం అర్థం అవుతుందని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు కనకం లేబర్ ఆఫీసర్ లాగా సురేష్ ఆఫీసుకు వెళ్తుంది. ఆఫీసులో హడావిడి చేస్తుంది.
సురేష్: మేడం ఏం జరిగింది మేడం సడెన్ గా ఈ విజిటింగ్ ఏంటి మేడం.
కనకం: ఏమీ జరగనట్టు మాట్లాడకు మిస్టర్ సురేష్. మీ బాస్ సామంత్ ఎక్కడ? ఆ సామంత్ ను పట్టిన అనామిక ఎక్కడ? మీరు వర్కర్స్ ను చాలా ఇబ్బంది పెడుతున్నారని రోజుకు 28 గంటల పని చేయించుకుంటున్నారని మాకు కాంప్లైంట్స్ వచ్చాయి.
సురేష్: షటప్.. ఈ కనకేశ్వరినే తప్పు పడతావా? రోజుకు ఉండేది 24 గంటలే అని ఎల్కేజీ స్టూడెంట్స్ కు కూడా తెలుసు. కానీ మీరిక్కడ 28 గంటల పని ఒక్కరోజులోనే చేయిస్తున్నారని చాలా బలమైన పిర్యాదు వచ్చింది.
సురేష్: లేదు మేడం రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు.
కనకం: షటప్.. లేబర్ ఆఫీసరునే మోసం చేద్దామనుకుంటున్నావా? ఏవీ ఎక్కడ అగ్రిమెంట్స్ పేపర్స్ తీసుకురా.. ఐ విల్ చెక్. ఇక్కడ ఇంకా చాలా ఫ్రాడ్స్ జరగుతున్నాయని నా దృష్టికి వచ్చింది.
అంటూ కనకం బెదిరించగానే సురేష్ వెళ్లి అగ్రిమెంట్స్ పేపర్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ పేపర్స్ తన అసిస్టెంట్స్ కు చెక్ చేయమని ఇస్తుంది. అగ్రిమెంట్స్ పేపర్స్ లో కావ్య అగ్రిమెంట్స్ పేపర్ తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుంటుంది కనకం. ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది. దీంతో కనకం షాక్ అవుతుంది. కంగారుపడకండి పిన్ని ఆ అగ్రిమెంట్స్ పేపర్స్ ఇవ్వడం అని అడుగుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు అని కనకం అడుగుతుంది. ఏం చేయను అనగానే కనకం వెళ్లబోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం