Brahmamudi Serial Today October 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య ధైర్యానికి ఫిదా అయిన అపర్ణ – ఎమోషనల్ అయిన అప్పు
Brahmamudi serial today episode October 4th: తనకు బిడ్డే ముఖ్యం అంటూ రాజ్ కు డైవర్స్ ఇస్తానంటుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్ చేసిన పనికి అందరూ తిడుతుంటారు. ఇంటి పరువు బజారు పాలు చేశావని అపర్ణ నిలదీస్తుంది. కావ్య కూడా రాజ్‌ను తిడుతుంది.
కావ్య: నాకు అబార్షన్ ఎందుకు చేయించాలని చూశావు.. అసలు నేను తాగే జ్యూస్‌లో..
అపర్ణ: జ్యూస్ ఏంటి..? మళ్లీ ఏం చేశాడు వీడు
కావ్య: నా నోటితో నేనే ఎందుకు చెప్పడం లేండి అత్తయ్యా అది విని మీరు తట్టుకోలేరు
రాజ్: నువ్వేదో నన్ను కాపాడుతున్నట్టు కవరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. అవును జ్యూస్ గ్లాస్‌లో అబార్షన్ టాబ్లెట్ నేనే కలిపాను. ఆ విషయం నీకు చెప్పకుండా నీకు తాగించడానికి ప్రయత్నించాను.. కానీ దానికి కారణం ఎవరు..? నువ్వు కాదా..? నేను చెప్తున్న నువ్వు నా మాట వినకపోవడం వల్ల కాదా.. అందుకే ఇదంతా చేశాను
కావ్య: అదే ఎందుకు అలా దొంగచాటుగా చేశారని అడుగుతున్నా…? మీరు వినాయక చవితి వరకు బాగానే ఉన్నారు. ఆ రోజు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో చెప్పారు కానీ ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయారు. ఆ రోజు ఏదో జరిగింది మీకు ఏదో విషయం తెలిసింది. అప్పటి నుంచి మీలో ఇలా మార్పు మొదలైంది. నిజం చెప్పండి నా దగ్గర ఏం దాస్తున్నారు మీరు. మన బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారు..
రాజ్: నీకు నువ్వే ఏదో ఊహించుకుని నీకు నచ్చినట్టు కథలు రాసేసుకుంటే నేనేం చేయలేను. నీతో కలిసి కొంతకాలం సంతోషంగా ఉంటానని చెప్పాను కదా..? అయినా సరే పదేపదే అడుగుతుంటే నేనేం చేయగలను చెప్పగలను..
కావ్య: అది అబద్దం అని మీకు తెలుసు..? నాకు తెలుసు..? ఇంకా దాచి పెట్టాలని చూడకండి
రాజ్: దాచిపెట్టాల్సిన అవసరం నాకేంటి..? ఇక్కడ నేను ఎవరిని చూసి భయపడాలి ఎందుకు భయపడాలి.. అయినా మాట మారుస్తుంది నువ్వు… నా మాట వినకుండా తప్పించుకుని తిరుగుతుంది నువ్వు
కావ్య: అప్పుడు ఇప్పుడు నాది ఒక్కటే మాట నాకు బిడ్డే ముఖ్యం.. అయినా నా బిడ్డను చంపాలనుకున్న హక్కు మీకు ఎవరిచ్చారు
రాజ్: నీ మెడలో మూడు ముళ్లు వేసినప్పుడే ఆ హక్కు వచ్చింది.
కావ్య: అయితే తాళి కట్టినందుకే మీకు ఆ హక్కు ఉందని మీరు అనుకుంటే ఈ తాళే నాకు అక్కరలేదు.. మనం కలిసి ఉండటానికి మనకు ఈ బిడ్డే మీకు అడ్డం అవుతుంది అనుకుంటే మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లడానికి కూడా నేను సిదమే
అందరూ షాక్ అవుతారు.
ఇందిరాదేవి: ఒసేయ్ కావ్య నీకేమైనా పిచ్చి పట్టిందా.? వాడేదో వాగుతుంటే.. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి..?
కావ్య: మరింకేం చేయమంటారు అమ్మమ్మ మీ మనవడు నాకు వేరే అవకాశమే ఇవ్వలేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఉన్న కోపంతో ఇంటి పరువును కూడా పణంగా పెట్టేశారు మీ మనవడు. ఇంకా ఈయన వల్ల ఎంత మంది బాధపడాలి.. ఎంత మందిని బాధపెట్టాలి. ఒక ప్రాణాన్ని తీయడానికి సిద్దపడిన ఆయనే అంత మొండిగా ఉంటే.. అదే ప్రాణాన్ని కాపాడటానికి చూస్తున్న నేను ఇంకెంత మొండిగా ఉండాలి..?
రాజ్: ఇన్‌డైరెక్టుగా నన్ను వదిలేస్తాను అని చెప్తున్నావా..?
కావ్య: డైరెక్టుగానే చెప్తున్నాను.. బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో అని చెప్పింది మీరు… ఇంకా ఈ భూమి మీద అడుగుపెట్టని బిడ్డను చంపాలని మీరు చూస్తున్నప్పుడు ఆ బిడ్డకు తల్లిగా ఇంతకంటే నాకు వేరే దారి లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది.. తేల్చుకోవాల్సింది మీరు..
అని కావ్య రూంలోకి వెళ్తుంది. తర్వాత కావ్య దగ్గరకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి ఎందుకలా మాట్లాడావని అడుగుతారు. ఆయన నుంచి నిజం రాబట్టడానికి ఇలా మాట్లాడానని కావ్య చెప్తుంది. మరోవైపు కావ్య, రాజ్ మధ్య గొడవ పెద్దది చేసి వాళ్లిద్దరు విడిపోయేలా చేయాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేస్తారు. ఇక అప్పు ఏడుస్తూ.. రాజ్, కావ్య విడిపోతే ఆ పాపం మనదే అవుతుందని కళ్యాణ్‌కు చెప్తుంది. అందులో మన తప్పేం లేదని పరిస్థితులు అలా ఉన్నాయని కళ్యాణ్ చెప్తాడు. ఇక రూంలో ఉన్న సుభాష్ ఆలోచిస్తూ కింద పడబోతుంటే అపర్ణ వెళ్లి పట్టుకుంటుంది. వాటర్ ఇచ్చి సుభాస్‌ను ఓదారుస్తుంది. తర్వాత అప్పు కావ్య దగ్గరకు వెళ్లి విడాకులు గురించి మాట్లాడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















