Brahmamudi Serial Today October 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గర్ల్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన రాహుల్ - అయోమయంలో స్వప్న
Brahmamudi serial today episode October 28th: రోడ్డు పక్కన గర్ల్‌ఫ్రెండ్‌తో ఐస్‌క్రీమ్ తింటూ రెడ్‌హ్యాండెడ్‌గా స్వప్నకు దొరికిపోతాడు రాహుల్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కావ్య యోగాసనాలు వేస్తుంటే రాజ్ వచ్చి తిడతాడు. దీంతో కావ్య ఇంకా గట్టిగా తిట్టండి ఇంట్లో వాళ్లు వినేలా తిట్టండి అంటుంది. ఇంతలో అక్కడికి ఇందిరాదేవి వస్తుంది.
ఇందిరాదేవి: ఏమైందని ఎందుకు అరుస్తున్నావు రాజ్
రాజ్: కావ్య యోగాసనాలు వేస్తుంది
ఇందిరాదేవి: అదేం తప్పు కాదే.. మంచిదే కదా
రాజ కోపంగా ఇద్దరినీ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పు రూంలో రెడీ అవుతుంటే.. కళ్యాణ్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు.
అప్పు: ఏంటి కూచి పొద్దు పొద్దున్నే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు అయినా ఈ రోజు ఎవరినో ప్రొడ్యూసర్‌ని కలవాలి అన్నావు మర్చిపోయావా
కళ్యాణ్: మర్చిపోలేదు పొట్టి.. వద్దు అనుకుని వదిలేశాను
అప్పు: అదేంటి ఎందుకు అలా అనుకున్నావు…?
కళ్యాణ్: వదినకు డెలివరీ అయ్యే వరకు అన్నయ్య ఇంట్లోనే ఉంటూ తనను చూసుకుంటానని చెప్పాడు కదా.. మరి ఈ కళ్యాణ్ కూడా అన్నయ్య అడుగుజాడల్లో నడిచేవాడు కదా..? అందుకే నా పొట్టికి కూడా డెలివరీ అయ్యే వరకు తనకు తోడుగా ఉందామని డిసైడ్ అయిపోయాను
అప్పు: అన్ని నెలలు నువ్వు నాతో పాటు కూర్చున్నావు అంటే నీ ప్రొడ్యూసర్లు వేరే రైటర్‌ను చూసుకుంటారు..
కళ్యాణ్: పోతే పోనీ పొట్టి నాకు నీకంటే ఏమీ ఎక్కువ కాదు.. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా..? ఎటువంటి టెన్షన్లు లేవు దేనికీ భయపడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉంది
అప్పు: నువ్వు చెప్పింది నిజమే కూచి నిన్నటి వరకు అక్క ఆపరేషన్‌కు ఒప్పుకోకపోతే తనను ఎలా కాపాడుకోవాలా అని అందరం చాలా కంగారు పడిపోయాము.. ఏదో చిటికె వేసినట్టు ఆ దేవుడు వరం ఇచ్చినట్టు ఒక్కసారిగా సమస్యలన్నీ తీరిపోయాయి ఇప్పుడు బావగారు కోరుకున్నట్టుగా అక్క సేఫ్.. అక్క కోరుకున్నట్టుగా అక్క కడుపులో బిడ్డ కూడా సేఫ్ నువ్వు అన్నట్టు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు..
కళ్యాణ్: ఆ అలా అంటావేంటి పొట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ముఖ్యంగా రెండు ఉన్నాయి
అప్పు: అవునా.. ఏంటది..?
కళ్యాణ్: నీ బుజ్జి పొట్ట లోపల రాబోతున్న మన పాప గురించి నీ కళ్ల ముందు ఉన్న ఈ బాబు గురించి ఆలోచించాలి కదా
అప్పు: పొట్టలో ఉన్న పాప గురించి ఓకే కానీ కళ్ల ముందు ఉన్న ఈ బాబు గురించి చూసుకోవడం నా వల్ల కాదు
అంటూ అప్పు వెళ్తిపోతుంది. ఇక హాల్లో కూర్చున్న సుభాష్ రాజ్‌ను పిలిచి ఇక నుంచి ఆఫీసుకు వెళ్లమని చెప్తాడు. రాజ్ అప్పుడే వెళ్లడం తన వల్ల కాదని చెప్తాడు. దీంతో ఎందుకని అపర్ణ అడగ్గానే.. కావ్యను చూసుకోవడానికి అంటూ రాజ్ చెప్తాడు. కావ్యను చూసుకోవడానికి మేమున్నాం కదా అంటూ ఇందిరాదేవి తిట్టగానే.. కావ్య కూడా రాజ్‌ను ఆఫీసుకు వెళ్లమని చెప్తుంది. తర్వాత స్వప్న, కావ్య హాస్పిటల్ వెళ్తుంటే మధ్యలో రాహుల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపిస్తాడు. దీంతో కావ్య కోప్పడినా స్వప్న మాత్రం ఏమీ అనకుండా వచ్చేస్తుంది. తర్వాత రాత్రికి కావ్య గ్లామర్‌గా రెడీ అయి వెళ్తుంటే చూసిన అపర్ణ, ఇందిరాదేవి అనుమానంతో రాజ్‌కు జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు. ఇందిరాదేవికి వెళ్లి చెప్పగానే.. రాజ్ అయోమయంలో పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















