Brahmamudi Serial Today October 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను నిలదీసిన రాజ్ - ఇంట్లో వాళ్ల కోసం అన్న కావ్య
Brahmamudi serial today episode October 27th: అబద్దం చెప్పాల్సిన అవసరం ఎందుకు అంటూ రాజ్ నిలదీయడంతో కావ్య ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: కావ్యకు అబార్షన్ చేయాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పగానే అందరూ సంతోషంగా ఇంటికి వెళ్తారు. రాజ్, కావ్యను తీసుకుని రూంలోకి వెళ్తాడు.
కావ్య: హమ్మయ్య పాపం ఇంట్లో వాళ్లు అందరూ నాకు ఏదో అయిపోతుందని చాలా కంగారు పడిపోయారు కదండి. ఇంట్లో వాళ్ల సంగతి పక్కన పెట్టండి అసలు మీకు ఈ విషయం మొదటిసారి తెలిసినప్పుడు ఎంతలా భయపడిపోయి ఉంటారు. మీరు చేసిన ప్రయత్నాలే చెప్తున్నాయి. మీరు మొండిగా బిడ్డను వద్దు అంటుంటే మీరు ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు అని నాకు చాలా కోపం వచ్చింది. ఆఖరికి మీరు ఎక్కువా..? బిడ్డ ఎక్కువా..? అని అడిగితే నేను అలిగి పుట్టింటికి వెళితే నన్ను కాపాడటం కోసం వెతుక్కుంటూ మరీ ఇంటికి వచ్చారు. నా కోసం రోడ్డు మీద కూర్చున్నారు.. ఇంత ప్రేమ నేను కూడా మీకు చూపించలేనండి ఏదైతే ఏం మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడిపోయాను. ఇప్పుడు మీ గుండెల్లో ఉన్న భారం అంతా తీరిపోయి ఉంటుంది కదా.? ఇక మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. నాతో పోరాడాల్సిన పని అంతకన్నా లేదు. కొన్ని నెలల్లోనే మన వారసుడు వస్తాడు. మనం అందరం కలిసి సంతోసంగా ఉండొచ్చు. అప్పుడు వాడికి నీ గురించి తప్పకుండా చెప్తాను. మీ అమ్మ బతికి ఉందంటే దానికి కారణం మీ నాన్నే అని చెప్తాను..
అని కావ్య మాట్లాడుతుంటే.. రాజ్ అనుమానంగా చూస్తుంటాడు.
కావ్య: ఏంటండి అలా చూస్తున్నారు.. డాక్టర్ ఆ నిజం చెప్పగానే.. ఎగిరి గంతేస్తారు అనుకున్నాను.. సంతోషంతో పొంగిపోతారు అనుకున్నాను కానీ మీరేంటి ఏదో పొగొట్టుకున్నవారిలా అలా చూస్తున్నారు
రాజ్: అబద్దం ఎందకు చెప్పావు కళావతి
కావ్య: అబద్దం ఏంటండి.. నేనేం చెప్పాను..
రాజ్: డాక్టర్ చేత ఎందుకలా చెప్పించావు
కావ్య: ఓ నాకు అర్థం అయింది. డాక్టర్ నాకు ఏ ప్రమాదం లేదని చెప్పేసరికి మీరు నమ్మలేకపోతున్నారా..? నేనే చెప్పించాను అనుకుంటున్నారా..? అయినా మీరు డాక్టర్‌తో మాట్లాడినప్పుడు నేను స్పృహలో లేను కదండి
రాజ్: డాక్టర్ తో నేను గదిలో మాట్లాడింది నేను నీకు చెప్పలేదే.. కానీ నువ్వు డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు నేను విన్నాను..
కావ్య బాధపడుతుంది. తాను హాస్పిటల్‌లో డాక్టర్‌తో మాట్టాడిన విషయం గుర్తు చేసుకుంటుంది.
కావ్య: అయితే మీరు మొత్తం వినేశారు అన్నమాట. నా బ్యాడ్ లక్ అండి ఈ విషయం బిడ్డ పుట్టే వరకు ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను.. కానీ మీకు తెలిసిపోయింది. పోనీలేండి మీకు తెలిస్తే తెలిసింది.. ఇంట్లో వాళ్లకు చెప్పకండి.
రాజ్: ఏం మాట్లాడుతున్నావు కళావతి ఇంత పెద్ద విషయం ఎందుకు దాచాలి అనుకున్నావు..
కావ్య: ఇంట్లో వాళ్ల సంతోషం కోసం దాచాలి అనుకున్నాను
రాజ్: కానీ విషయం ఇంట్లో వాళ్లకు చెప్తాను..
దీంతో ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. రాజ్ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. రాజ్‌ను కూల్ చేసేందుకు గార్డెన్ లో ఉన్న రాజ్ దగ్గరకు భోజనం తీసుకుని వెళ్లి ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తుంది కావ్య. మరోవైపు తన నెక్లెస్ కనిపించడం లేదని స్వప్న కోపంగా రాహుల్‌కు వార్నింగ్ ఇస్తుంది. దీంతో రాహుల్ కూడా కొద్ది రోజుల్లోనే నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















