అన్వేషించండి

Brahmamudi Serial Today October 14th:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఫైనల్‌ ప్లాన్‌ వేసిన అపర్ణ – కనకాన్ని రిపోర్ట్స్‌ అడిగిన రాజ్‌

Brahmamudi Today Episode: తన ఫ్రెండ్‌ క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ ఉన్నాడని రాజ్‌, కనకానికి చెప్పి రిపోర్ట్స్‌ అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: కిచెన్‌ లో వంట చేస్తున్న అపర్ణ, ఇందిరాదేవి దగ్గరకు కనకం వెళ్లి వంట నేను చేస్తాను మీరు కూర్చోండి అంటుంది. దీంతో అపర్ణ, ఇదిరాదేవి వెటకారంగా కనకాన్ని తిడతారు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వంట ఎలా చేస్తావని అంటారు నా చేతులో చేస్తాను అంటుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా కనకానికి మొట్టికాయ వేస్తుంది. తాను నాటకం ఆడుతున్నది గుర్తుకు వచ్చిన కనకం సరే అంటూ బెడ్‌ రూంలోకి వెళ్లిపోతుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు.

రాజ్‌: అత్తయ్య గారు నేను మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను.

కనకం: ఏంటి బాబు అది.

రాజ్: నిన్న మీతో మాట్లాడిన తర్వాత నా ఫ్రెండ్స్‌ లో ఉన్న డాక్టర్స్‌ అందిరితో  మాట్లాడాను. అందులో ఒకరు క్యాన్సర్‌ స్పెషలిస్టు.. మీ రిపోర్స్ట్‌ ఒకసారి ఇస్తారు..

కనకం: లేని రిపోర్ట్స్‌ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి. లేవంటే ఇప్పుడు అల్లుడిగారికి అనుమానం వస్తుంది. ( అని మనసులో అనుకుంటుంది.)

రాజ్‌: అత్తయ్యగారు రిపోర్ట్స్‌ మీరు ఇస్తే అవి నేను డాక్టర్‌ కు పంపిస్తాను.

కనకం: ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి బాబు. రేపు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. రిపోర్ట్స్‌ ఎందుకు డైరెక్టుగా నన్నే టెస్ట్‌ చేయమను..

 అని కనకం చెప్పగానే రాజ్‌ సరే అత్తయ్యా అంటూ వెళ్లిపోతాడు. రూంలోకి బయటకు వస్తున్న కనకానికి కావ్య అడ్డుపడుతుంది.

కనకం: ఏంటే ఇలా అడ్డుపడుతున్నావు.

కావ్య: ఇక్కడ ఏం జరుగుతుంది.

కనకం: రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుంది అని అడిగిందట నీలాంటిది. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం అవ్వటం లేదా? మా పెళ్లి రోజును మీ అత్తారింటి వాళ్లు గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

కావ్య: అదే అడుగుతున్నా వాళ్లు ఇదంతా ఎందుకు చేస్తున్నారు.

కనకం: అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది వెళ్లి వాళ్లనే అడుగు.

కావ్య: కాదు వాళ్లు రావడానికి కారణం నువ్వే. నువ్వే ఏదో చేశావు. ఆయన వచ్చి ఇదంతా చేస్తున్నాడంటే నువ్వే ఏదో చేశావు.

 అంటూ కావ్య నిలదీస్తుంటే ఇంతలో అపర్ణ వచ్చి మీ అమ్మతో ఇలాగేనా ప్రవర్తించేది అని అడుగుతుంది. మీ అమ్మా ఏం చేయలేదు. చేసిందంతా నేనే అంటూ అపర్ణ చెప్తుంది. ఆయన్ని ఇలా తీసుకొస్తే నా మీద ప్రేమ పుట్టేస్తుందా? అని కావ్య ప్రశ్నిస్తుంది. కొత్తగా ప్రేమ పుట్టడం కాదు అని కావ్యను కన్వీన్స్‌ చేస్తుంది. తర్వాత ముగ్గురూ కలిసి రాజ్‌, కావ్యను కలపడానికి ప్లాన్‌ చేస్తారు. మరోవైపు రాజ్‌ డాక్టర్‌తో ఫోన్‌లో కనకం గురించి మాట్లాడుతుంటాడు. చాటు నుంచి విన్న కనకం ఎమోషనల్‌ అవుతుంది. తర్వాత రాజ్‌కు ఆఫీసును ఫోన్‌ చేసి ఆఫీసులో మనం కొన్న గోల్డ్‌ కన్నా ఎక్కువ ఉందని చెప్పడంతో రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అపర్ణ ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి నువ్వు ఇప్పుడు ఆ సిమ్‌ తీసి పక్కన పడేయ్‌. రాజ్ అక్కడికి రాగానే నువ్వు ఫోన్‌ చేయలేదని చెప్పు అంటుంది. సరే అంటాడు శరత్‌. అప్పు, కళ్యాణ్‌ వస్తారు.

అప్పు: మా అమ్మ పెళ్లి రోజును ఇంత గ్రాండ్‌ గా చేస్తుందేంటి?

కళ్యాణ్‌: ఎలా ఉన్నావు అమ్మా..

 ధాన్యలక్ష్మీ:  కళ్యాణ్‌ నీ భార్య పుట్టింట్లో ఫంక్షన్‌ అనగానే పరుగెత్తుకుంటూ వచ్చేశావు. మరి మీ ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంది. తను నీ గురించి కూడా బాధపడుతుంది అని ఆలోచించలేకపోయావా?

కళ్యాణ్‌: ఆలోచించాను కాబట్టే ఆగిపోయాను అమ్మా.. వచ్చి నిన్ను ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక దూరంగా ఆగిపోయాను అమ్మా..

ధాన్యలక్ష్మీ: నువ్వు ఇలా మాట్లాడటం చూసి కొంతమంది చాలా సంతోషంగా ఉన్నారు. తల్లీకొడుకులను వేరు చేయడానికే కొంతమంది పుడతారు.

కళ్యాణ్‌: అమ్మా నువ్వు ఇలా మాట్లాడతావనే నేను నీ దగ్గరకు రాలేదు. నిజంగా నువ్వు బాధపడేదానివే అయితే నా మనసు ఎప్పుడో అర్థం చేసుకునేదానివి.

అంటూ నువ్విలాగే మాట్లాడితే ఇక్కడి నుంచి కూడా నేను వెళ్లిపోతానని కళ్యాణ్‌ చెప్పడంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ షర్ట్‌ మీద నక్షత్ర ఫోటో – కవర్‌ చేయలేక ఇబ్బందిపడ్డ భూమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget