అన్వేషించండి

Brahmamudi Serial Today May 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : సాక్ష్యం ఉన్న పెన్‌డ్రైవ్‌ పగులగొట్టిన కావ్య – నిజం తెలియకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతానన్న రుద్రాణి

Brahmamudi Today Episode : రాజ్ నిజం చెప్పకపోతే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని రుద్రాణి అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode : రాజ్‌ తీసుకొచ్చిన బిడ్డకు తండ్రి ఎవ‌ర‌న్నది క‌నిపెట్టి అంద‌రి ముందు రాజ్‌ మంచితనాన్ని నిరూపించాల‌కుంటుంది కావ్య‌. కానీ ఆ బిడ్డ‌కు తండ్రి సుభాష్ అని తెలిసి షాక‌వుతుంది. నిజం కోసం తాను చేసిన పోరాటం వృథాగా మార‌డంతో క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నిజం బ‌య‌ట‌పెడితే  అపర్ణ సూసైడ్‌ చేసుకుంటుందని  భ‌య‌ప‌డుతుంది కావ్య‌. ఈ సమస్యను నువ్వు పరిష్కరించాలని దేవుడ్ని వేడుకుంటుంది కావ్య. మరోవైపు ప్ర‌కాశం మీద అరుస్తుంది ధాన్యలక్ష్మి.

ప్రకాశం: రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడ‌నే బాధ కొంచెం కూడా నీకు లేదా?  

ధాన్యలక్ష్మి: త‌ప్పు చేసిన‌వాళ్లు శిక్ష అనుభ‌వించ‌క‌ త‌ప్ప‌ద‌ని రాజ్ చెప్పేవాడు. ఇప్పుడు రాజ్ త‌ప్పు చేశాడు కాబ‌ట్టి ఇంట్లో నుంచి వెళ్ల‌డంలో త‌ప్పులేదు.

ప్రకాశం: ఒక‌వేళ క‌ళ్యాణ్ ఇలాంటి త‌ప్పు చేస్తే ఇంట్లో నుంచి వెళ్ల‌గొడ‌తావా?

ధాన్యలక్ష్మి: కళ్యాణ్‌ అలాంటి త‌ప్పు ఎప్ప‌టికీ చేయ‌డు. అని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ.

మరోవైపు కావ్యపై అప్పు కోప్పడుతుంది. నిజం తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావని నిలదీస్తుంది.  నిజం తెలిస్తే అపర్ణ ప్రాణాలతో ఉండదని కావ్య చెప్తుంది. నిజం తెలిసి కూడా రాజ్‌ ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు ఇప్పుడే అర్థం అవుతుందని చెప్తుంది. దీంతో సాక్ష్యం ఉన్న పెన్‌ డ్రైవ్‌ను కావ్య పగులగొడుతుంది. అయితే ఆ బిడ్డ తల్లే వచ్చి ఏదో ఒకరోజు నిజం చెప్తుందని అప్పుడు నీకు ఎలాంటి అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని అప్పు చెప్తుంది. అప‌ర్ణపై రుద్రాణి, రాహుల్ సెటైర్స్‌ వేసుకుంటుంటారు. ఇంతలో రాహుల్‌కు అప్పు ఇచ్చిన వ్యక్తి ఫోన్‌ చేసి రుద్రాణిని బెదిరిస్తాడు. రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి నిజం చెప్తానని వార్నింగ్‌ ఇస్తాడు. రుద్రాణి ఫోన్‌ మాట్లాడటం స్వప్న వింటుంది.

స్వప్న: డ‌బ్బు పోయింద‌ని సెలైంట్‌గా ఉండటం మంచిది కాదు. ఈ విషయం ఇంట్లో అందరికి చెప్తాను.  అవ‌స‌ర‌మైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం.

రుద్రాణి: ఒసేయ్‌ స్వప్న డబ్బు నువ్వే కొట్టేసి నువ్వే నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసే ( అని మనసులో అనుకుంటుంది.)  ఆ డ‌బ్బును నేనే ఎలాగోలా స‌ర్ధుబాటు చేస్తాను. దాని గురించి ఇంట్లో ఎవ‌రికి చెప్పొద్దు.

అంటూ రుద్రాణి, స్వప్నను బతిమాలుతుంది. డ‌బ్బు గురించి మీరు వ‌దిలేసినా నేను వ‌ద‌ల‌న‌ని స్వ‌ప్న అన‌డంతో రుద్రాణి భ‌య‌ప‌డుతుంది. మరోవైపు రాజ్‌ మంచితనం గురించి ఆలోచిస్తూ రాజ్‌నే చూస్తుంటుంది కావ్య.

రాజ్‌: ఏంటి అలా చూస్తున్నావ్‌

కావ్య: మా ఆయ‌న‌ను నేను చూసుకుంటున్నాను.. బాబులో మీ నాన్న పోలిక‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయండి. బాబుకు తాత‌గారి పోలిక‌లు వ‌చ్చిన‌ట్లున్నాయి. రేపు ఇంట్లో నుంచి వెళ్లిపోతారని తెలిసిన కూడా ఎంత  నిశ్చ‌లంగా ఉన్నారో కదా?

రాజ్‌: నీ ప్లేస్‌లో స్వ‌ప్న‌, అనామిక ఉంటే ఈ పాటికి నాపై పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ ఇచ్చేవాళ్లు.  నువ్వు మాత్రం నిశ్చ‌లంగా ఎందుకు ఉన్నావో నాకు అర్థం కావ‌డం లేదు.

కావ్య: నా మ‌న‌సాక్షి న‌మ్మిందే నేను చేస్తున్నాను.

అంటూ కావ్య రాజ్‌ను అలాగే చూస్తుండిపోతుంది. రాజ్‌ గార్డెన్‌లోకి వెళ్తూ.. బాబును చూసుకోమని కావ్యకు చెప్తాడు. దీంతో కావ్య బాధ్య‌త‌ను పంచుకోమ‌ని అంటున్నారు. బాబును పెంచుకోమ‌ని చెబుతున్నారా? అంటుంది. అదేమి పట్టించుకోకుండా రాజ్‌ గార్డెన్‌ లోకి వెళ్తుంటాడు. రాజ్‌ను చూసిన అపర్ణ అటు నుంచి అటే బయటకు వెళ్తావా? అని అపర్ణ అడగడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో అపర్ణను నిర్ణయం మార్చుకోమని సుభాష్‌, ఇందిరాదేవి అడుగుతారు. తన నిర్ణయం మారదని కరాకండిగా చెప్తుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్‌ను వెటకారంగా మాట్లాడుతుంది. అవేమీ పట్టించుకోకుండా రాజ్‌ గార్డెన్‌ లోకి వెళ్లిపోతాడు. రేపటిలోగా నిజం తెలియకపోతే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని రుద్రాణి అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramachander Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లే శ్రీకాంత్ ఆత్మహత్య, నిరుద్యోగి సూసైడ్‌పై రామచందర్ రావు ఆరోపణలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లే శ్రీకాంత్ ఆత్మహత్య, నిరుద్యోగి సూసైడ్‌పై రామచందర్ రావు ఆరోపణలు
CM Chandrababu: అంగన్వాడీ బాలుడు లక్షిత్ మృతిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అంగన్వాడీ బాలుడు లక్షిత్ మృతిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Telangana Cabinet:తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు- కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు- కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
Amaravati Quantum Valley: ఐకానిక్‌గా అమరావతి క్వాంటం వ్యాలీ, గాలి చొరబడకుండా ఐసోలేషన్- డిజైన్లపై ప్రభుత్వం కసరత్తు
ఐకానిక్‌గా అమరావతి క్వాంటం వ్యాలీ, కంప్యూటర్ రూంలోకి గాలి చొరబడకుండా ఐసోలేషన్
Advertisement

వీడియోలు

Telangana Cabinet approves Reservation for BC | బీసీలకు 42 శాతం రిజర్వేషన్
India vs England 3rd Test Nitish Bowling | లార్డ్స్‌ టెస్టులో నితీష్‌ రెడ్డి స్పెషల్ షో
Cabinet approves Reservation for BC | బీసీలకు 42 శాతం రిజర్వేషన్
Central Minister Bandi Sanjay Comments on TTD in Tirumala | శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
Bandi Sanjay Comments on TTD | శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramachander Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లే శ్రీకాంత్ ఆత్మహత్య, నిరుద్యోగి సూసైడ్‌పై రామచందర్ రావు ఆరోపణలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లే శ్రీకాంత్ ఆత్మహత్య, నిరుద్యోగి సూసైడ్‌పై రామచందర్ రావు ఆరోపణలు
CM Chandrababu: అంగన్వాడీ బాలుడు లక్షిత్ మృతిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అంగన్వాడీ బాలుడు లక్షిత్ మృతిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Telangana Cabinet:తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు- కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు- కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
Amaravati Quantum Valley: ఐకానిక్‌గా అమరావతి క్వాంటం వ్యాలీ, గాలి చొరబడకుండా ఐసోలేషన్- డిజైన్లపై ప్రభుత్వం కసరత్తు
ఐకానిక్‌గా అమరావతి క్వాంటం వ్యాలీ, కంప్యూటర్ రూంలోకి గాలి చొరబడకుండా ఐసోలేషన్
Andhra Pradesh Police Constable Exam Result 2025: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల; మీ ఫలితం తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల; మీ ఫలితం తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే
Sigachi Tragedy : సిగాచీ దుర్ఘటనలో 8 మృతదేహాలు దొరకని విషాదం.. కుటుంబాలకు తీరని వేదన! యాజమాన్యం తీరుపై ఆగ్రహం
సిగాచీ మరో దారుణం.. కనీసం బిడ్డల బూడిదైనా ఇవ్వమంటే ,15 లక్షలతో ఇంటికి పొమ్మన్నారు
World Population Day : ప్రపంచ జనాభా దినోత్సవం 2025.. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి భారత్ ఆలోచించాల్సిన సమయమిదే, ఎందుకంటే?
ప్రపంచ జనాభా దినోత్సవం 2025.. కుటుంబ నియంత్రణపై భారత్ ఆలోచించాల్సిన సమయమిదే, ఎందుకంటే?
ఏపీ లిక్కర్ స్కామ్: విజయసాయిరెడ్డికి SIT మరోసారి నోటీసులు! అసలు రహస్యం బట్టబయలా?
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో సీఐడీ సిట్ దూకుడు - 12న రావాలని విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు
Embed widget