అన్వేషించండి

Brahmamudi Serial Today May 31st : ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కావ్య చెంప పగులగొట్టిన ఇందిరాదేవి – పెళ్లి జరగకుండా చేస్తానని మాటిచ్చిన కావ్య

Brahmamudi Today Episode: మాయ, రాజ్ పెళ్లికి అంగీకరించిన కావ్య చెంప పగులగొడుతుంది. ఇందిరాదేవి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  మాయతో రాజీవ్‌ పెళ్లి జరిపించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేపర్స్‌ మీద కావ్య సంతకం చేయడంతో అపర్ణ కావ్యను తిడుతుంది. నీకు డబ్బు ఆస్థి మీద ఆశ తప్పా భర్తా కాపురం అనేవి నీకు ఇష్టం లేదని తిడుతుంది. దీంతో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి అపర్ణను సమర్థిస్తుంది. కావ్య చెంప పగులగొట్టి.. నీకు అన్ని తెలుసని అనుకున్నాను కానీ నీ కాపురం నువ్వే నాశనం చేసుకుంటున్నావు అంటూ తిడుతుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇక్కడ ఇంత మంది ఉన్నారు ఎవరైనా నీకు సాయం చేశారా? వీళ్ల కోసమా నువ్వు త్యాగం చేసేది అంటూ తిడుతుంది.

అపర్ణ: అత్తయ్య గారు కావ్య సంతకం పెడితేనే కదా ఈ సమస్యకు పరిష్కారం దొరికేది.

ఇందిర: చీ నోర్‌ మూయ్‌.. నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. పెద్ద కొడలుగా అన్ని చూసుకుంటావని అధికారం ఇస్తే ఇదా నువ్వు చేసేది. అన్ని తప్పులు చేసిన అనామికకు ఎందుకు అండగా నిలబడ్డావు రాహుల్‌ను ఎందుకు సమర్థించావు.

అపర్ణ: అత్తయ్యగారు నేను చెప్పేది..

ఇందిర: వినను ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ వినను. నువ్వు ఆ అర్హతను పోగొట్టుకున్నావు అపర్ణ

అంటూ అపర్ణకు క్లాస్‌ తీసుకుంటుంది ఇందిరాదేవి. దేవతలాంటి నీ కోడలుకు అన్యాయం చేసినందుకు ఏదో ఒకరోజు నీలో నువ్వు కుమిలిపోతావు అని చెప్తుంది. తర్వాత గార్డెన్‌లో కూర్చుని ఆలోచిస్తున్న  కావ్య దగ్గరకు కళ్యాణ్‌ వస్తాడు.

కళ్యాణ్‌: అయ్యో ఏంటి వదిన అశోకవనంలో కూర్చున్నారు. లంకలో రాక్షసులున్నారనా? నిజంగా  మీరు ఈ ఇంట్లో ఉండి ఏం సాధించారు వదిన కనీసం అన్నయ్య భార్యగానైనా మీ హక్కును మీరు కాపాడుకోలేకపోయారు.

కావ్య: బాగా అర్థం అవుతుంది. కవిగారు నా భవిష్యత్తు గురించి తల్లడిల్లిపోయే నలుగురిలో మీరు ఉన్నారని. కానీ ఒక్క విషయం నా జీవితం గురించి మీరే ఇంతలా ఆలోచిస్తున్నారే మరి నేను ఎంతలా ఆలోచించాలి.

అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  మరోవైపు రాహుల్‌  హ్యాపీగా రుద్రాణికి కంగ్రాట్స్‌ చెప్తాడు. మొత్తానికి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధించావని మెచ్చుకుంటాడు. రుద్రాణి ఇంకా జరగాల్సింది చాలా ఉందని చెప్తుంది. మాయ నాకు ఇంకా భయంగా ఉందని ఎప్పుడైనా రాజ్‌కు నిజం తెలిసి నన్ను వదిలేస్తే నా పరిస్తితి ఏంటని డౌట్‌ క్రియేట్‌ చేస్తుంది. నీకసలు భయం వద్దని ఎవ్వరూ ఏమీ అనరని రుద్రాణి, రాహుల్‌ చెప్తారు. తర్వాత  కావ్య, రాజ్‌, సుభాష్‌ మాట్లాడుకుంటూ ఉంటారు.

రాజ్: మమ్మీ న్యాయంగానే ఆలోచించింది డాడీ..

సుభాష్‌: ఏం న్యాయం ఏమీ కానీ ఒక మోసగత్తే మెడలో తాళి కట్టించాలనుకోవడం న్యాయమా?

రాజ్: ఆ నిజం మమ్మీకి తెలియదు కదా డాడీ.

సుభాష్‌: మరి మీ అమ్మా తెలియక చేసే అన్యాయానికి కావ్య జీవితం బలైపోయిన పర్వాలేదా? అది నీకు న్యాయంగా అనిపిస్తుందా?

అంటూ సుభాష్‌ ప్రశ్నిస్తాడు. దీంతో నీ ప్రశ్నలకు కావ్యనే సమాధానం చెప్పాలంటాడు. దీంతో ఆ మాయ ఎంత మోసగత్తో ఇంటికి వచ్చాక తెలిసింది అంటుంది కావ్య. ఇంతలో సుభాష్‌ కల్పించుకుని నేను వెళ్లి నిజం చెప్పేస్తాను. అనడంతో వద్దని వారిస్తారు కావ్య, రాజ్‌. మరి ఈ పెళ్లిని ఎలా ఆపేది అంటాడు. ఈ పెళ్లి జరగదని కావ్య చెప్పడంతో ఇద్దరూ షాక్‌ అవుతారు. మరోవైపు అసలైన మాయను వెతకడానికి వెళ్తుంది అప్పు. అక్కడ తిరుగుతూ కొందరిని మాయ గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఇంతలో ఒకావిడ మాయ అడ్రస్‌ చెప్పడంతో అప్పు హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఇందిరాదేవికి కాఫీ తీసుకొచ్చిన కావ్యకు క్లాస్‌ తీసుకుంటుంది ఇందిరాదేవి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: విజయ్‌తో సినిమా అనగానే ఏడ్చేసింది, నేనే తనను ఒప్పించా - ప్రియాంక చోప్రా తల్లి మధు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Comet: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
Liquor Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యంBaba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Comet: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
Liquor Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
iPhone SE 4 Launch Date: చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Jio TRAI: శాటిలైట్ నెట్‌వర్క్‌పై కన్నేసిన జియో - ట్రాయ్‌కి లేఖ!
శాటిలైట్ నెట్‌వర్క్‌పై కన్నేసిన జియో - ట్రాయ్‌కి లేఖ!
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Embed widget