Brahmamudi Serial Today March 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు భాస్కర్ ను దూరం చేసేందుక రాజ్ ప్లాన్ - సుభాష్‌కు ప్రకాష్ క్షమాపణ
Brahmamudi Today Episode: మూర్తి ఇంట్లో అందరూ క్యారమ్స్ అడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ప్రకాష్ మతిమరుపు వల్ల ఆఫీస్‌లో యాభై లక్షల నష్టం రావడంతో సుభాష్ ఫైర్ అవుతాడు. తన కళ్ల ముందే భర్తను సుభాష్ ఇష్టం వచ్చినట్లు తిట్టడం ధాన్యలక్ష్మి తట్టుకోలేకపోతుంది. తన భర్తను తిట్టే హక్కు మీకు లేదంటూ సుభాష్‌కు ఎదురుతిరుగుతుంది ధాన్యలక్ష్మి. మా ఆయనేం మీ బానిస కాదంటూ సుభాష్‌తో అంటుంది. ధాన్యలక్ష్మిమాటలతో సుభాష్ హర్ట్ అవుతాడు. ఆమెకు క్షమాపణలు చెబుతాడు.తర్వాత ధాన్యలక్ష్మీ మాటలను గుర్తుచేసుకొని సుభాష్ ఎమోషనల్ గా ఫీలవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలో ప్రకాష్ రూంలోకి వస్తాడు.
ప్రకాష్: అన్నయ్యా బాధపడుతున్నావా? సారీ అన్నయ్యా..
సుభాష్: ధాన్యలక్ష్మి అన్న మాటల్లో నిజం ఉంది. నా తమ్ముడిని ఎలా తిట్టినా చెల్లుబాటు అవుతుందని ఇన్నాళ్లు అనుకున్నాను, కానీ నీకు ఓ మనసు ఉందని ఈ రోజే అర్థమైంది. నా తమ్ముడు అన్నింట్లో బెస్ట్ ఉండాలని కోరుకునేవాడినని, ఎవరు వేలేత్తి చూపించకూడదని తప్పు చేస్తే నీకు మతిమరుపు ఉందనే సంగతి మర్చిపోయి తిట్టేవాడిని
అంటూ సుభాష్, ప్రకాష్‌కు క్షమాపణలు చెబుతాడు. మన మధ్య క్షమాపణలు ఎందుకని ప్రకాష్ అంటాడు. మరోవైపు రాజ్‌ను ఏడిపించాలని ఫిక్సవుతారు.. కావ్య వాళ్ల బావ భాస్కర్. ఇద్దరు కలిసి క్యారమ్ బోర్డ్ ఆడబోతున్నట్లు రాజ్‌కు వినిపించేలా గట్టిగా అరుస్తారు. నన్ను ఆడుకుంటున్నారుగా ఇది చాలదా అంటూ వారిపై రాజ్ సీరియస్ అవుతాడు. నేను ఆడతానని వస్తాడు.
భాస్కర్: బుజ్జీ ఈ గేమ్‌లో నువ్వు, నేను ఒక టీమ్.
రాజ్: అలా ఎలా కుదురుతుంది. కళావతి అప్పు ఒక టీమ్. మనిద్దరం ఒక టీం..
అని రాజ్ చెప్పగానే అలాగే అందరూ కలిసి క్యారమ్ ఆడుతుండగా కాయిన్స్ ఎలా కొట్టాలో భాస్కర్ కావ్యకు నేర్పిస్తుంటాడు. ఆ సీన్ చూసి రాజ్ తట్టుకోలేకపోతాడు. కావ్య కాయిన్ పడేయగానే భాస్కర్ హ్యాపీగా గంతులు వేస్తాడు. కావ్య మన అపోజిషన్ టీమ్ అని రాజ్ అతడిపై సెటైర్ వేస్తాడు. రాజ్ కాయిన్ పడేసినప్పుడు మాత్రం అతడు సెలైంట్‌గా ఉంటాడు. తర్వాత కావ్య, భాస్కర్ ఆట గురించి తెగ బిల్డప్ ఇస్తుంది. కానీ భాస్కర్ ఒక్క కాయిన్ కూడా వేయడు.
భాస్కర్: బుజ్జి నిన్ను గెలిపించడానికే నేను ఈ గేమ్ సరిగ్గా ఆడటం లేదు.
అనగానే కావ్య వరుసగా కాయిన్స్ వేస్తుంది. దీంతో భాస్కర్, కావ్య లేచి డాన్స్ చేస్తుంటారు. దీంతో రాజ్ లేచి గేమ్ ఆడనని వెళ్లిపోతాడు. రాజ్ లోలోన రగిలిపోతుంటాడు. కావ్యను, భాస్కర్‌ను ఎలాగైనా దూరం చేయాలని మనసులో అనకుంటాడు రాజ్. తర్వాత కావ్య వేసిన డిజైన్‌పై కావాలని ఇంక్ పోస్తాడు రాజ్. తర్వాత ఏమీ తెలియనట్లుగా బయటకు వచ్చి తనకు టీ కావాలని కావ్యతో అంటాడు. భర్తకు టీ ఇవ్వడం కోసం కావ్య లేస్తుండగా కనకం ఆపుతుంది.
కనకం: బావతో నువ్వు గేమ్ ఆడు.. అల్లుడు గారికి నేను కాఫీ పెట్టి ఇస్తాను.
రాజ్: అయితే సరే నువ్వు వేసిన డిజైన్స్ తీసుకురాపో ఒకసారి చూడాలి.
అనగానే కావ్య లోపలికి వెళ్లి డిజైన్స్ పై ఇంక్ పడటం చూసి షాక్ అవుతుంది. దీంతో రాజ్‌కు ఏం సమాధానం చెప్పాలో తెలియక భయపడుతుంది. ఇంతలో లోపలికి వచ్చిన రాజ్ డిజైన్స్ చాలా అర్జెంట్ అని వెంటనే మళ్లీ వేయమని రాజ్ చెప్పడంతో కావ్య సరే అని మళ్లీ కొత్తగా వేయబోతుంటే భాస్కర్ వచ్చి డిజైన్స్ మళ్లీ వేయాల్సిన అవసరం లేదని తన ఫోన్‌లో అన్ని డిజైన్స్ ఫోటో తీశానని చెప్పడంతో కావ్యం హ్యాపీగా ఫీలవుతుంది. రాజ్ మాత్రం ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు. మరోవైపు ధాన్యలక్ష్మి తన భర్త ను నానా మాటలు అనడం అపర్ణ సహించలేకపోతుంది. ఆ విషయాన్ని ఇందిరాదేవికి చెబుతుంది. తన కోపాన్ని భర్త సుభాష్‌పై చూపించిందని, తప్పు చేసిన ప్రకాశాన్ని మందలించబోతే తప్పుపట్టిందని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మి చాలా ప్రమాదకరంగా మారిపోతుందని, తనకు నచ్చచెప్పకపోతే త్వరలోనే ఇళ్లు ముక్కలవ్వడం ఖాయమని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘జై సింహా’ హీరోయిన్ - నెలరోజుల తర్వాత ఫోటోలు షేర్ చేసిన నటి