Brahmamudi Serial Today March 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ను చెడామడా తిట్టిన శ్వేత - రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన స్వప్న
Brahmamudi Today Episode: బాబును తీసుకుని ఆఫీసుకు వచ్చిన రాజ్ ను శ్వేత వచ్చి తిట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: రుద్రాణి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని రాహుల్ అడుగుతాడు. రాజ్ చేసిన తప్పును మీడియాకు తీసుకెళ్లాలి. అప్పుడు రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పిస్తారు. కళ్యాణ్‌కు ఎలాగో క్లయింట్స్ తో డీల్ చేయడం రాదు కాబట్టి నువ్వే సీఈవో చైర్‌లో కూర్చోవచ్చు అంటుంది. ఇదంతా బయటి నుంచి విన్న స్వప్న దగ్గరకు వస్తుంది.
స్వప్న: నిలువెత్తు నికృష్టులను చూసి నా జన్మ తరించిపోయింది. ఎలా వస్తాయి మీక ఇలాంటి గొప్పగొప్ప ఆలోచనలు. ఇందాక ధాన్యలక్ష్మీ ఆంటీకి గడ్డి పెట్టేటప్పుడు.. రాజ్ మీకు ఇంటి ఆడపడచు హోదా ఇచ్చి గౌరవించాడు. మీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇలాగే ఉంటే ఇద్దరూ రోడ్డు మీద పడతారు.
రాహుల్: మేము రోడ్డు మీద పడితే నువ్వు అమెరికాలో వెళ్లి పడతావా? నువ్వు కూడా రోడ్డు మీదే పడతావు.
స్వప్న: పిచ్చి నా బచ్చా నేనెందుకు రోడ్డు మీద పడతాను. తాతయ్య గారు నాకు బోలెడంత ఆస్థి రాసిచ్చారని మర్చిపోయారా? మీరు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్లా మా కావ్యకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మిమ్మల్ని అందరి ముందు కడిగిపారేస్తాను.
అంటూ స్వప్న వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్, కావ్య బాబును తీసుకుని ఆఫీసుకు వెళ్తారు. ఆఫీసులో స్టాఫ్ అందరూ వింతగా చూస్తుంటారు.
రాజ్: ఏంటి ఆలోచిస్తున్నావు.
కావ్య: ఇంట్లో మీరేదో చెప్పారు.
రాజ్: లక్ష చెప్తా.. ఇంట్లో విషయాలు ఇంట్లోనే మర్చిపోవాలి. ఆఫీసులో పని మాత్రమే చేయాలి. వెళ్లు వెళ్లి నువ్వేసిన డిజైన్స్ తీసుకురా? అప్రూవ్ చేసి క్లయింట్స్ కు పెట్టాలి.
కావ్య: అలాగే మీరు వెళ్లి మీ అబ్బాయితో ఆడుకోండి. ఇదిగోండి బ్యాగు.
అంటూ లోపలికి వెళ్లి తాను వేసిన డిజైన్స్ తీసుకుని రాజ్ దగ్గరకు వస్తారు. రాజ్ బాబును ఆడిస్తుంటాడు.
కావ్య: డిజైన్స్.. ఏంటి సార్ బాబు చేతిలో పెన్స్ స్టాండ్ పెట్టారు. కనీసం బొమ్మలు కూడా లేవా?
రాజ్: బొమ్మలు ఇంట్లో ఉంటాయి. బాబును చూసింది చాలు వీటిని క్లయింట్స్ కు మెయిల్ చెయ్. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు కాసేపట్లో మీటింగ్ ఉంది వెళ్లి ప్రిపేర్ అవ్వు వెళ్లు
కావ్య: మీరు మీ బాబుతో ఆడుకోండి.
అంటూ కావ్య బయటకు వెళ్తుంది. ఆఫీసులో స్టాఫ్ అందరూ రాజ్ గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటుంటే కావ్య విని తిడుతుంది. ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు మూర్తి, కనకం బయటకు వెళ్తుంటే అప్పు వస్తుంది. సెలక్షన్స్ ఏమయ్యాయి అని కనకం అడుగుతుంది. అప్పు డల్‌గా ఉంటుంది. సెలెక్ట్ అయ్యావా? లేదా అంటూ కనకం అడగ్గానే అయ్యాను కానీ నేను ఇంక పోలీసు అవ్వను అంటుంది అప్పు. దీంతో ఎందుకు అంటూ అప్పును నిలదీస్తుంది కనకం. మరోవైపు రాజ్ ఆఫీసుకు వచ్చిన శ్వేత బాబును చూసి షాక్ అవుతుంది.
శ్వేత: ఇంత సులువుగా ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచిపెట్టావు రాజ్. లేదు నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు అబద్దం చెప్తున్నావు.
రాజ్: కావ్య కూడా ఇలాగే అంది నిజాన్ని నమ్మలేకపోతుంది. కానీ కళ్ల ముందు బాబు కనిపిస్తున్నాడు.
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే కావ్య వస్తుంది. డోర్ దగ్గరే నిలబడి వింటుంది. శ్వేత కోపంగా రాజ్‌ను తిడుతుంది. నీ మనసులో ఇంత కుట్ర దాగి ఉందని తెలుసుకోలేకపోయాను అంటుంది. పాపం కావ్యను ఎంత మోసం చేశావు. ఎన్నో నీతులు చెప్పే నీ సంస్కారం ఏమైందని శ్వేత నిలదీస్తుంది. నీకంటే నా మొగుడే నయం అంటూ శ్వేత వెళ్లిపోతుంది. కావ్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మార్కెట్ కు వెళ్లిన కనకం, మూర్తిలకు బొమ్మలు తీసుకుని వెళ్తున్న కావ్య ఎదురుపడుతుంది. దీంతో కనకం, మూర్తి బాధపడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీ అక్కాబావలు అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ మీ సినిమాలు చూస్తారా? రుహానీ శర్మ ఊహించని రిప్లై