అన్వేషించండి

Brahmamudi Serial Today March 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తామన్న అప్పు – వైదేహికి యామిని వార్నింగ్‌  

Brahmamudi Today Episode: రాజ్ కు శ్రాద్ద కర్మ చేయోద్దని కావ్య ఏడుస్తూ అడ్డుపడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode: లాన్‌లో రాజ్‌ ఫోటో పెట్టి శ్రాద్దం జరిపిస్తుంటారు. పంతులు మంత్రాలు చదువుతుంటే.. అపర్ణ బోరున ఏడుస్తుంది. రాజ్‌ను గుర్తు చేసుకుని తనలో తానే కుమిలిపోతుంది. ఇందిరాదేవి కూడా ఏడుస్తూ రాజ్‌ను గుర్తు చేసుకుంటుంది.

ఇందిరాదేవి: నా  కళ్ల ముందే నా మనవడిని పోగొట్టుకున్నాను

అపర్ణ: నన్ను అమ్మా అని ఎవరు పిలుస్తారు.ఇంకెప్పటికీ ఆ పిలుపు వినబడనంత దూరంగా వెళ్లిపోయావు కదరా..

రాహుల్‌: మమ్మీ గుండె పట్టినట్టుగా లేదా నీకు

రుద్రాణి: ఉంది అయితే ఏం చేయాలి..?

రాహుల్‌: మరి నీ కళ్లలో నీళ్లు రావడం లేదేంటి మమ్మీ

రుద్రాణి: గుండెను రాయిగా మార్చుకున్నాను. వాడు దూరం అయితేనే కదా..? నువ్వు కంపెనీకి సీఈవో అవుతావు

రాహుల్‌: ఈ కాసేపైనా మనుషుల్లా మట్లాడుకుందాం మమ్మీ.. ఎలాగూ రాజ్‌ తిరిగి రాడు కదా

పైన రూంలో పడుకున్న కావ్య పంతులు చదివే మంత్రాలు విని కిందకు వస్తుంది. రాజ్‌ ఫోటో చూసి షాక్ అవుతుంది.

కావ్య: ఏంటిది మామయ్యగారు ఏం చేస్తున్నారు మీరు..

సుభాష్‌ : తప్పదమ్మా నా కొడుక్కి ఉత్తమగతులు లేకుండా చేసే అధికారం నాకు లేదమ్మా

కావ్య: ఉత్తమ గతులు ఈ లోకంలో లేని వారికి చేయాలి మామయ్య ఉన్నవారికి కాదు

అపర్ణ: గుండెను రాయిని చేసుకో కావ్య.. ఈ నిజాన్ని జీర్ణం చేసుకో చిన్న వసులోనే నీకు చాలా కష్టం వచ్చింది తల్లి.. ఏం చేస్తాం. మన తలరాతను ఎవ్వరూ మార్చలేరు

కావ్య: అత్తయ్యా మీకు ఎన్ని సార్లు చెప్పాలి. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అత్తయ్యా నా కళ్లతో నేను చూశాను. మీరే నమ్మకపోతే ఎలా

ఇందిరాదేవి: అమ్మా కావ్య రాను రాను నువ్వు ధైర్యాన్ని కోల్పోయి మతిస్థిమితం పోగొట్టుకుంటున్నావు. నీకు మేమున్నాం తల్లి.. ఈ కార్యక్రమాన్ని ఆపొద్దు తల్లి.

కావ్య: అయ్యో బతికున్న మనిషికి కర్మకాండలు జరిపించడం ఏంటి..? నన్ను నమ్మండి ఫ్లీజ్‌

రుద్రాణి: కాస్త నిదానంగా ఆలోచించు కావ్య ఈ శ్రాద్దకర్మలు చేయకపోతే వాడి ఆత్మ ఎలా సతోషిస్తుంది. కాస్త లోపలికి తీసుకెళ్లండి

స్వప్న, అప్పు వచ్చి కావ్యను లోపలికి తీసుకెళ్తుంటే..

కావ్య: ఏంటే అందరిలాగే మీరు నమ్మడం లేదా..? ఎందుకే ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు

స్వప్న:  ముందు నువ్వు లోపలికి రావే..

కావ్య: ఇక్కడ నా పసుపు కుంకుమలు తుడిచేసే హక్కు ఎవ్వరికీ లేదు.. నా ఐదో తనాన్ని తీసేసే హక్కు ఎవ్వరికీ లేదు.

అపర్ణ: కావ్య అడ్డుపడకే నీ తలరాత ఇంతేనని సరిపెట్టుకో.. పసుపు, కుంకుమ తీయాలా లేదా అనేది నీ ఇష్టం. కానీ నా కొడుక్కి తిలోదకాలు వదలకపోతే జీవితాంతం అది మమ్మల్ని దహించి వేస్తుంది. ఈ తంతు జరగనివ్వు కావ్య నీకు దండం పెడతాను.

కావ్య: అత్తయ్యా మీ కొడుకు నిజంగా చనిపోయి ఉంటే నేనే మీకు  కొడుకులా ఉండేదాన్ని కానీ ఆయన బతికే ఉన్నారు అత్తయ్యా

అపర్ణ: ఏంటి అత్తయ్యా ఇదంతా అయోమయంగా ఉంది. కావ్య ఇంత నమ్మకంగా చెప్తుంటే.. మనం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా..? మనమే నిజంగా రాక్షసంగా మారిపోయామా..? ఏం చేయాలో నాకు తెలియడం లేదు అత్తయ్యా

ఇందిరాదేవి:  నాన్నా సుభాష్‌.. ఏం చేద్దాంరా..? కావ్య మాటలు వింటుంటే నాకు ఎటూ పాలు పోవడం లేదు. మతి స్థిమితం లేకపోతే తను ఇంత కచ్చితంగా మాట్లాడుతుందా..? ఏం చేద్దాం రా..?

సుభాష్‌: అమ్మా రాజ్‌ నిజంగా బతికే ఉంటే కావ్యనే కనక వాడు చూసి ఉంటే వదిలేసి ఎలా వెళ్లిపోతాడమ్మా.. కావ్య భ్రమ పడుతుంది. మన అందరిని కూడ అదే భ్రమలోకి నెట్టేస్తుంది.

రుద్రాణి: అవును భ్రమ పడుతుంది. ముందు ఎవరైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి.

ధాన్యలక్ష్మీ: కళ్యాణ్‌ నువ్వు అప్పు కలిసి కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లండి.

అని చెప్పగానే.. కావ్య కోపంగా అందరినీ తిట్టి రాజ్‌ ఫోటో తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు యానమిని రాజ్‌ను తిడుతుంది. అదెవరో అమ్మాయిని కాపాడాడట.. దాన్నే పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు అంటుంది. అడ్డొచ్చిన వాళ్లమ్మ వైదేహిని కూడా తిడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
Meghasandesam Serial Today October 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని ఆవహించిన గగన్‌ ఆత్మ – ఆకాష్‌ అసలు రూంప కనిపెట్టిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని ఆవహించిన గగన్‌ ఆత్మ – ఆకాష్‌ అసలు రూంప కనిపెట్టిన అపూర్వ
Gundeninda Gudigantalu Oct 13: విల్లా విజయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాలు,మీనా..మనోజ్‌,రోహిణి మండిపాటు
గుండెనిండా గుడిగంటలు: విల్లా విజయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాలు,మీనా..మనోజ్‌,రోహిణి మండిపాటు
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 13: విక్కీపై పద్మ హత్యాయత్నం...శీనయ్య బతికే ఉన్నాడని చెప్పి ఆమెకు చూపించిన విక్రమ్‌కృష్ణ
నువ్వులేక నేను లేను: విక్కీపై పద్మ హత్యాయత్నం...శీనయ్య బతికే ఉన్నాడని చెప్పి ఆమెకు చూపించిన విక్రమ్‌కృష్ణ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget