Brahmamudi Serial Today March 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : హారతి కిందపడేసిన అపర్ణ – పూజ మధ్యలొ వెళ్లిపోయిన రాజ్
Brahmamudi Today Episode: పూజలో హారతి కిందపడిపోవడంతో అందరూ షాక్ అవుతారు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య అంటే అపర్ణకు ఇంకా ఇష్టం లేదని లేకపోతే ఇప్పటి వరకు తన కోడలు కోసం చేయించిన నగలు ఎందుకు ఇవ్వలేదని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు. దీంతో అపర్ణ కోపంగా తన రూంలోకి వెళ్లి నగలు తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది. నీ పెళ్లిలో తీసుకున్న ఈ నగలు మళ్లీ నీ పెళ్లిరోజుకు గిఫ్టుగా ఇస్తున్నాను అంటూ అపర్ణ నగలు ఇవ్వడంతో తనకు ఎలాంటి నగలు అవసరం లేదని కావ్య చెప్పడంతో.. అపర్ణ కోపంగా తీసుకో అని చెప్తుంది. దీంతో కావ్య నగలు తీసుకుంటుంది. ధాన్యలక్ష్మీ, రుద్రాణి నోరు మూసుకుంటారు. తర్వాత కావ్య నగలు తీసుకుని అపర్ణ రూంలోకి వెళ్లగానే అపర్ణ కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా రూంలోకి వస్తావు అనగానే కావ్య తిరిగి వెళ్తుంటే రూంలోకి ఎందుకు వచ్చావు ఎందువు వెళ్తున్నావు అని అడుగుతుంది అపర్ణ. క్లారిటీ కోసం వచ్చానని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు అటూ ఇటూ తిరుగుతూ తింటుంటే
కనకం: అటూ ఇటూ తిరుగుతూ తినకపోతే ఒకచోట కూర్చుని తినొచ్చు కదా?
అప్పు: నిన్నెవడు వడ్డించమన్నాడు.. నేనే వడ్డించుకు తింటానులే..
కనకం: కాబోయే పోలీసువి డిటర్జెంట్ తో ఉండటం నేర్చుకో..
అప్పు: అది డిటర్జెంటో డిష్ వాషో కాదు డిసిప్లీన్..
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే కావ్య ఫోన్ చేస్తుంది. ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి మీరందరూ ఫంక్షన్‌కు రావాలని పిలుస్తుంది. సాయంత్రం అందరూ కలసి రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక కనకం హ్యాపీ ఫీలవుతూ.. ఈ విషయం ఇంటాయనకు కూడా చెప్పాలి అని లోపలకి వెళ్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు.
ధాన్యలక్ష్మీ: రాజ్ ఇంకా కిందకు రాలేదు ఈ పూజ అంటేనే ఇష్టం లేనట్టుంది.
అపర్ణ: ఇష్టం లేదు అని నీకు చెప్పాడా?
రుద్రాణి: చెప్పలేదు అలా అని ఇష్టం ఉన్నట్లు కూడా లేడు. మార్నింగ్ నుంచి ఏదో కంగారుపడుతూ తిరుగుతున్నాడు. ఈ పూజ ఎక్కడ జరిగిపోతుందోనని తిరుగుతున్నట్టున్నాడు.
అపర్ణ: కంపెనీ బాధ్యతలు చూసుకునేవాడికి ఆ మాత్రం కంగారు ఉంటుంది రుద్రాణి. నీ కొడుకులాగా ఖాలీగా ఇంట్లో కూర్చుంటాడు అనుకుంటున్నావా? రాజ్‌కు ఎప్పుడు ఏది పూర్తి చేయాలో బాగా తెలుసు.
ధాన్యలక్ష్మీ: అందుకేనా పూజకి టైం అవుతున్నా ఇంకా గదిలోనే కూర్చున్నాడు. ఒకవేళ నువ్వు నా ముందు కావ్య మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నట్లు రాజ్ కూడా నటిస్తున్నాడేమో అక్క.
అపర్ణ: నటించాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుక్కి అంతకన్నా లేదు. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను.
అని అపర్ణ పైకి వెళ్తుంది. పూజ మొదలవుతుంది. కావ్య ఒక్కతే పీటల మీద కూర్చుని ఉంటుంది. అందరూ రాజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. అందరూ వెడ్డింగ్ యానివర్సరీ విషెష్ చెప్తారు. తర్వాత కావ్య పక్కన పూజలో కూర్చుంటాడు రాజ్. పూజ ఎందుకు చేస్తున్నారో పంతులు వివరించగానే రాజ్, కావ్య షాక్ అవుతారు. తర్వాత పంతులు పూజ పూర్తి చేసి హారతి ఇస్తూ ఇద్దరూ జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేయమని చెప్తాడు. కావ్య ప్రమాణం చేస్తుంటే.. రాజ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇందిరాదేవి ప్రమాణం చేయమని గట్టిగా చెప్పగానే రాజ్ ప్రమాణం చేయబోతాడు ఇంతలో హారతి పట్టుకున్న అపర్ణ చేయి కాలడంతో హారతి కిందపడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. హారతి మరోసారి వెలిగించమని ఇందిరాదేవి చెప్పగానే అపర్ణ అలాగేనని వెలిగిస్తుంటే రాజ్ కు ఆఫీసు నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు. తర్వాత సాయంత్రం పార్టీకి అంతా రెడీ అవుతుంది. రూంలో మాత్రం కావ్య ఇంకా రెడీ కాకుండా అలాగే ఉండిపోతుంది. ఇందిరాదేవి వచ్చి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతే కావ్య ఏడుస్తుంది. ఉదయం పూజలో అపశృతి జరిగినప్పటి నుంచి నాకు భయమేస్తుంది అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ టిల్లు గాడి బ్రేకప్ సాంగ్ విన్నారా?