Brahmamudi Serial Today March 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : డైవర్స్ పేపర్స్ తీసుకుని ఆఫీసుకెళ్లిన రాజ్ - ఏం జరుగుతుందోనని కావ్య టెన్షన్
Brahmamudi Today Episode: కావ్య ఇచ్చిన డైవర్స్ పేపర్స్ తీసుకుని రాజ్ ఆఫీసుకు వెళ్లడంతో కావ్య ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Telugu Serial Today Episode: డైవర్స్ పేపర్స్ తీసుకుని రాజ్ దగ్గరకు వచ్చిన కావ్య వాటిపై నేను సంతకం చేశాను. మీరు కూడా చేయండి. ఎందుకంటే మీకు కావాల్సింది నా నుంచి డైవర్సే కదా అని అడగుతుంది. దీంతో షాక్ అయిన రాజ్ అలాగే చూస్తుంది పోతాడు. ఇంట్లో అందరికీ మీరే చెప్పండి. ఎందుకంటే డైవర్స్ కావాలని అడిగింది మీరే కాబట్టి. నేను కూడా మా అమ్మానాన్నలకు చెప్పుకోవాలి. మీకు నేనంటే ఇష్టం లేకనే మీరే డైవర్స్ ఇస్తున్నారని.. రాజ్ అలాగే చూస్తుండిపోతాడు.
కావ్య: మీరెప్పటికైనా మారతారన్న నమ్మకం నాకుండేది. ఇప్పుడు లేదు. కాబట్టి విడిపోవడం తప్పా వేరే మార్గమే లేదు. మీ నిర్ణయం ఏంటో నాకు సాయంత్రం లోపు చెప్పండి
అని డైవర్స్ పేపర్స్ రాజ్ చేతిలో పెట్టి బయటకు వెళ్లి ఏడుస్తుంది కావ్య. రాజ్ పేపర్స్ చూస్తూ నిలబడిపోతాడు. రాజ్ ఆత్మ బయటకు వస్తుంది.
రాజ్‌ఆత్మ: కంగ్రాచ్యులేషన్స్ అనుకున్నది సాధించావు. నీకు ఆనందాన్ని ఇచ్చేది నీ చేతిలోనే ఉంది సంతకం చేయ్ .
అనగానే రాజ్ చేతిలోని బ్యాగ్‌ను విసిరికొడతాడు. మరోవైపు అందరూ కింద టిఫిన్ చేస్తుంటారు. కావ్య బాధగా కిందికి వస్తుంటుంది.
ఇందిరాదేవి: ఇచ్చావా? ఏమన్నాడు..?
కావ్య: ఏమీ మాట్లాడలేదు.
ఇందిరాదేవి: దిమ్మతిరిగి మెదడు మొద్దుబారిపోయింటుంది సన్నాసికి
కావ్య: నాకు భయంగా ఉంది అమ్మమ్మగారు
అనగానే ఇందిరాదేవి కావ్యను తిడుతుంది. ఎందుకు భయం ధైర్యంగా ఉండు వాడు దిగిరావాల్సిందే.. అనగానే రాజ్ వస్తుంటాడు. వెంటనే ఇందిరాదేవి, కావ్యను తీసుకుని టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. రాజ్ వెళ్లిపోతుంటే అపర్ణ టిఫిన్ చేద్దువురా అని పిలుస్తుంది.
సుభాష్: ఏరా ఇవాళ అందరికీ శాలరీస్ ఇవ్వాలి..
రుద్రాణి: సాయంత్రం ఇస్తాడేమో అన్నయ్యా..
సుభాష్: నిన్ననే ఇవ్వాళ్సింది కదా.. ఇవ్వాలైనా ఇవ్వాలి గుర్తుపెట్టుకో..
రాజ్: రేపు ఇస్తాను డాడీ..
సుభాష్: మన కంపెనీలో ఎప్పుడు శాలరీస్ ఫస్ట్ డేనే వేస్తాము. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయకు. ఇవాళే ఇవ్వాలి.
రాజ్: ఓకే డాడీ
రుద్రాణి: సాయంత్రం ఇవ్వులే రాజ్.. అదేంట్రా విచిత్రంగా ఎంత తలనొప్పి వస్తే మాత్రం బుర్ర పని చేయడం లేదా ఎంటి?
ఆపర్ణ: ఎమైంది ఇప్పుడు?
రుద్రాణి: వాడు ఇడ్లీ తింటున్నాడు. వాడికసలు ఇడ్లీ అంటేనే పడదు కదా
అనగానే కావ్య నేను మర్చిపోయి పెట్టాను వేరే ప్లేట్ పెడతాను అంటే అవసరం లేదు నా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది అంటూ వెళ్లిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆఫీసులో కూర్చున్న రాజ్ కావ్య డైవర్స్ పేపర్స్ ఇవ్వడాన్నే గుర్తుచేసుకుని ఆలోచిస్తుంటాడు. ఇంతలో శ్వేత వస్తుంది. రాజ్ ఫోన్ చేస్తే ఎత్తడం లేదేంటి? నువ్వు బిజీగా ఉన్నావనుకున్నాను. అంటూ రాజ్ టేబుల్ మీద డైవర్స్ పేపర్స్ చూసి షాక్ అవుతుంది.
శ్వేత: ఇంతదాకా తెచ్చుకున్నావా? కావ్య నీ జీవితం నుంచి నీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది. కావ్య ముందడుగులు వేసింది. ఆ అడుగులు ఆగవు. వీడుకోలు చెప్పు.. ఒక్క సంతకమే కదా చేసేయ్.. మౌనంగా ఉన్నావెందుకు?
అంటూ నీ భార్య అడుగు బయటపెట్టకుండా నీ ప్రేమను బయటపెట్టు.. వెళ్లి నీ మనసులో ప్రేమను కావ్యకు చెప్పు. అని శ్వేత చెప్తున్నా కూడా రాజ్ అలాగే చూస్తుండిపోతాడు. మరోవైపు కిచెన్‌లో ధాన్యలక్ష్మీ దగ్గరకు అనామిక వచ్చి తన ఫ్రెండ్స్ వస్తున్నారని వాళ్లకు నేను కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పానని ఇప్పుడు వాళ్లకు నిజం తెలుస్తుందేమోనని భయంగా ఉందని అనామిక చెప్పడంతో అదేం జరగదు అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. ఇంతలో ఫ్రెండ్స్ వస్తారు. అనామిక ఫ్రెండ్స్ కు అందరినీ పరిచయం చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన మెగా కోడలు ఉపాసన..