అన్వేషించండి

Brahmamudi Serial Today June 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : రాజ్‌, మాయ పెళ్లికి ముహూర్తం పెట్టించిన అపర్ణ – మాయను అనుమానించిన ధాన్యలక్ష్మీ

Brahmamudi Today Episode: మాయ, రాజ్​ల పెళ్లికి అపర్ణ ముహూర్తం పెట్టిస్తుంది. మరోవైపు అసలైన మాయను తీసుకురావడానికి కావ్య వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode : కావ్య విషయంలో అనామిక, కళ్యాణ్‌ గొడవ పడతారు. ఇంత జరిగినా కూడా ఇంకా ఈ ఇల్లు పట్టుకుని కూర్చుందని తనకు సిగ్గు లేదని అనామిక అనడంతో కళ్యాణ్‌ ఫీలవుతాడు. అయినా వినకుండా నేనే కనుక కావ్య ప్లేస్‌ ఉండి ఉంటే ఈ పాటికి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి అందరి మీద కేసు పెట్టేదాన్ని, ఈ కుటుంబాన్ని మొత్తం రోడ్డుకు లాగేదాన్ని అంటుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా నీకు తెలిసింది అదేగా ప్రేమ, బంధం, కుటుంబం అనే పదాలే నీ డిక్షనరీలో లేవనుకుంటాను అంటాడు. మరోవైపు మాయ రాజ్‌ రూంలోకి వెళ్లనందుకు బాధపడుతుంది.

రుద్రాణి: ఎందుక అంత డిసప్పాయింట్‌ అవుతున్నావు. నువ్వు అనుకుంటున్న పని అంత సులువు అనుకుంటున్నావా? ఆ కావ్యకు కూడా రాజ్‌ గదిలో అడుగు పెట్టడానికి 6 నెలలు పట్టింది. నువ్వు వచ్చి 6 రోజులు కూడా కాలేదు

మాయ: రాజ్‌ గదిలోకి వెళ్లడానికి నాకు అంత సరదా ఏం లేదు ఆంటీ? ఆ కావ్య పొగరుగా మాట్లాడేసరికి దానికి నేను ఏంటో చూపించాలి అనుకున్నాను.

అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే కావ్య బాబును తీసుకుని వస్తుంది. రాజ్‌ గదిలోకి వెళ్లడం కాదు ముందు బాబును ఎవరు చూసుకుంటారు అనడంతో మాయ బాబును తీసుకుంటుంది. తల్లిగా నటించడానికి, తల్లిగా మారి ప్రేమను పంచడానికి చాలా తేడా ఉందని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. తర్వాత అపర్ణ పంతులును పిలిపించి పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయా అని అడుగుతుంది. ఇంట్లో అందరూ షాక్‌ అవుతారు. పంతులుకు మాయ, రాజ్‌ల  పెళ్లి గురించి చెప్పగానే పంతులు అతికష్టం మీద రెండు రోజుల్లో ఒక ముహూర్తం ఉందని చెప్తాడు. దీంతో రుద్రాణి, మాయ, రాహుల్‌ హ్యాపీగా ఫీలవుతారు. రాజ్‌, సుభాష్‌, కావ్య కంగారుపడుతుంటారు. తర్వాత రాజ్‌ కోపంగా కావ్యను తిడతాడు.

రాజ్‌: నిన్ను... నీ మొహం పచ్చడి చేయాలనుంది..?

కావ్య: నేనేం చేశాను. మాయ బాగానే ఉంది. మీరు బాగానే ఉన్నారు. బాబు బాగానే ఉన్నారు. మీ నాన్న బాగానే ఉన్నారు. అసలు మాయ ఎక్కడో చచ్చింది మధ్యలో నన్ను అంటారేంటి?

రాజ్: నువ్వే కదా నో అబ్జక్షన్‌ లెటర్‌ రాసి ఇచ్చింది.

కావ్య:  మీ అమ్మగారే కదా ఆ లెటర్‌ రాసి తెచ్చింది.

అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటే కావ్య చెప్పకుండా రూం లోంచి బయటకు వెళ్తుంది. ఇంతలో  అప్పు కావ్యకు ఫోన్‌ చేసి బయలుదేరుతున్నావా? అని అడగ్గానే బయలుదేరుతున్నాను కానీ ఆ నిజమైన మాయ ఈరోజు నిజంగా వస్తుందా? అని అడుగుతుంది. నువ్వేం అనుమానపడకుండా వెంటనే బయలుదేరు అని అప్పు చెప్పగానే కావ్య వెళ్లిపోతుంది. అంతా వెనక నుంచి విన్న రుద్రాణి  నువ్వెంత కష్టపడ్డా నేను వినేలా చేయకూడదని నీకు తెలియదా? నువ్వు అనుకున్నది జరగకుండా చేయడానికి నేను వస్తున్నా అంటూ రుద్రాణి వెళ్తుంది. తర్వాత బాబు ఏడుస్తుంటే ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవి, అపర్ణ వస్తారు.

ధాన్యలక్ష్మీ: ఏడుస్తున్నవాణ్ని ఎత్తుకోవాలి కానీ పక్కన పెడితే ఊరుకుంటాడా?

మాయ: ఎత్తుకుంటే ఏడుపు ఆపుతాడా?

ధాన్యలక్ష్మీ: ఏమంటున్నావు. ఎత్తుకుంటే ఏడుపు ఆపుతాడా అని అడుగుతున్నావు అసలు నువ్వు తల్లివేనా?

ఇందిరాదేవి: అసలు నువ్వు ఆడదానివేనా అని అడుగుతున్నాను.

మాయ: నేను ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోవడం లేదు..   

 అనగానే ధాన్యలక్ష్మీ నీ దగ్గర ఉండటం లేదు ఎందుకు అని అడుగుతుంది. దీంతో కావ్య ఎక్కడుందని బాబును బుజ్జగిస్తుందేమోనని అడుగుతుంది. డాక్టర్‌ కన్నతల్లి స్పర్శ ఉంటే బాబు ఏడవడం ఆపేస్తాడని చెప్పాడని ధాన్యలక్ష్మీ అడగడంతో మాయ ఆయోమయంలో పడిపోతుంది. ఇంతలో తేరుకుని మాయ, మాయమాటలు చెప్పి తప్పించుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మరోసారి అమూల్ పాల ధర పెంపు, నిద్ర లేవడంతోనే కస్టమర్లపై భారం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget