![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Brahmamudi Serial Today June 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అనామిక కాపురంలో నిప్పులు పోస్తున్న రుద్రాణి – రుద్రాణికి చెక్ పెట్టేలా కావ్య ప్లాన్
Brahmamudi Today Episode: కళ్యాణ్ తో రాజీ పడాలనుకున్న అనామికను రెచ్చగొట్టి గొడవ మరింత పెద్దది అయ్యేలా రుద్రాణి చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
![Brahmamudi Serial Today June 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అనామిక కాపురంలో నిప్పులు పోస్తున్న రుద్రాణి – రుద్రాణికి చెక్ పెట్టేలా కావ్య ప్లాన్ brahmamudi serial today episode June 28th written update Brahmamudi Serial Today June 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అనామిక కాపురంలో నిప్పులు పోస్తున్న రుద్రాణి – రుద్రాణికి చెక్ పెట్టేలా కావ్య ప్లాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/79d66638c10157ae1dfad58b840688421719544764675879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: నాతో కాపురం చేయనని చెప్పి అప్పుతో తిరుగుతావా? అందుకే ఇదంతా చేశాను. నేను చేసింది తప్పా అని అనామిక ప్రశ్నించడంతో ధాన్యలక్ష్మీ, అనామిక చెంప పగులగొడుతుంది. ఇప్పటివరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను అంటుంది. ఇంకొక్కసారి ఇలా చేశావంటే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తుంది. దీంతో స్వప్న మీరు చాన్స్ ఇవ్వండి కానీ మేము మాత్రం వదిలపెట్టము. మా చెల్లికి జరిగిన అవమానానికి రివేంజ్ తీర్చుకుంటాము అని అనామికను కొట్టబోతుండగా కావ్య అడ్డుపడుతుంది. వద్దని వారిస్తుంది. దీంతో అనామిక లోపలికి వెళ్లిపోతుంది. కళ్యాణ్ మాత్రం నేను అనామికకు డివోర్స్ ఇస్తానని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్, కావ్య ఆలోచిస్తుంటారు.
కావ్య: ఏవండి ఏంటండి ఇదంతా.. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది.
రాజ్: నువ్వే చూస్తున్నావుగా ఏం జరుగుతుందో..
కావ్య: జరిగేది ఎవ్వరూ ఆపలేరా? ఎవరికి వాళ్లు తలా ఒకవైపు వెళ్లిపోయారు. మీరు కూడా నిశ్శబ్దంగా వచ్చేశారు.
రాజ్: ఏం చేయమంటావు కళావతి.. వాడికి అనుమానాలు, అపార్థాలు, తెలియవు. వాడు ఎంతగా విసిగిపోయాడో వాడి మాటల్లోనే తెలుస్తుంది.
కావ్య: పెళ్లైన కొత్తలో అందరికీ అండస్టాడింగ్ కుదరాలని లేదండి.
ALSO READ: పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
అంటూ ఇద్దరూ కలిసి కళ్యాణ్, అనామిక ల గురించి మాట్లాడుకుంటారు. అయితే వాళ్లిద్దరి కాపురం నిలబెట్టాలని కావ్య చెప్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. మీ చెల్లెలి పరువు తీసిన అనామిక మీద నీకు కోపం రావడం లేదా? అని అడగ్గానే అదేం లేదని కావ్య చెప్పి వాళ్లిద్దరిని కలపడానికి మనమేం చేయాలో ఆలోచిద్దామని డిసైడ్ అవుతారు. మరోవైపు అనామిక ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది. రాజ్ వస్తాడు. అనామికకు నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లిపోతాడు. అంతా దూరం నుంచి విన్న రుద్రాణి అనామిక దగ్గరకు వచ్చి
రుద్రాణి: రాజ్ కరెక్టుగా చెప్పాడు అనామిక. నువ్విలా గొడవలు పడితే లాభం లేదు. కూల్‌గా డీల్ చేయాలని నీకు లక్ష సార్లు చెప్పాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఎంతదూరం తెచ్చుకున్నావో..
అనామిక: నిజమే ఆంటీ. కానీ ఇప్పుడు బావగారు చెప్పినట్టుగా నేను ఇప్పుడు కళ్యాణ్ తో మాట్లాడినా నా మాట వినడు.
రుద్రాణి: నువ్వు చెప్పేది నిజమే కానీ నువ్వు సైలెంట్‌గా ఉంటే విడాకులు కావాలని ఇంకా మొండిగా కూర్చుంటాడు ఆ కళ్యాణ్.
అనామిక: మరి ఇప్పుడు ఏం చేయమంటారు.
రుద్రాణి: చేసేది ఏముంది నువ్వు మాట్లాడితే గొడవ అవుతుందనుకున్నప్పుడు మీ అమ్మా నాన్నలను పిలిపించి పంచాయతి పెట్టు. పెళ్లి చేసుకుంది విడాకులు ఇవ్వడానికా అని వాళ్ల చేత అడిగించు. పెద్దవాళ్లందరూ కలిసి మాట్టాడుకుని మిమ్మల్ని కలిపేస్తారు.
అనామిక: చాలా మంచి ఐడియా ఇచ్చారు ఆంటీ ఇప్పుడే మా అమ్మా వాళ్లను రమ్మని కబురు పెడతాను.
అంటూ హ్యాపీగా లోపలికి వెళ్లిపోతుంది. రుద్రాణి మాత్రం పిచ్చి అనామిక ఈ సమయంలో వాళ్లు వస్తే సమస్య మరింత పెద్దదైపోతుంది అది కూడా తెలియదు నీకు అనుకుంటుంది. తర్వాత ఓంటరిగా కూర్చుని బాధపడుతున్న కళ్యాణ్ దగ్గరకు కావ్య వెళ్తుంది. కళ్యాణ్‌ను మార్చడానికి ప్రయత్నిస్తుంది. కళ్యాణ్‌ను అనామికతో మాట్లాడాలని కింద హాల్లోకి తీసుకెళ్తుంది. కళ్యాణ్ గొడవలన్నీంటికి పులిస్టాప్ పెట్టాలని అపర్ణతో చెప్పబోతుంటే అనామిక కలగజేసుకుని నాకు విడాకులు ఇవ్వాలనే కదా అలా మాట్లాడుతున్నావు అంటుంది. అప్పును తిడుతుంది. దీంతో కళ్యాణ్ అనామికను కొట్టబోతుంటే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)