అన్వేషించండి

Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?

Prabhas: ఇప్పటివరకు ప్రభాస్‌ను ఫ్యాన్స్ అంతా ప్రేమగా డార్లింగ్, రెబెల్ స్టార్, ప్యాన్ ఇండియా హీరో అని పిలుచుకునేవారు. కానీ ‘కల్కి 2898 AD’తో ఆ ట్యాగ్ మారినట్టుగా అనిపిస్తుంది.

Prabhas: సినీ సెలబ్రిటీలు.. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ క్రేజ్‌ను బట్టి పేరుకు ముందు ట్యాగ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ట్యాగ్స్ అనేవి పర్మనెంట్‌గా ఉండవు. క్రేజ్‌ను బట్టి అవి కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పటికే స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు ఎంతోమంది ఈ ట్యాగ్స్‌ను స్వయంగా మార్చుకున్నారు. మరికొందరి ట్యాగ్స్‌ను వారి ఫ్యాన్సే మార్చారు. అలా తాజాగా ‘కల్కి 2898 AD’ సినిమాను మొదటిరోజే చూసిన ప్రేక్షకులు.. ప్రభాస్ పేరుకు ముందు ఉన్న ట్యాగ్ మారినట్టుగా గమనించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్‌కు సంబంధించి ఇది హాట్ టాపిక్‌గా మారింది.

రెబెల్ స్టార్ పోయింది..

కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు కాబట్టి ప్రభాస్‌ను ఇప్పటివరకు యంగ్ రెబెల్ స్టార్, రెబెల్ స్టార్ అని పిలుచుకునేవారు ఫ్యాన్స్. అలాగే తన ప్రతీ సినిమా టైటిల్ కార్డ్స్‌లో యంగ్ రెబెల్ స్టార్ అనే ట్యాగే కనిపించేది. ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అని పిలుచుకోవడం ప్రారంభించినా.. ట్యాగ్ మాత్రం రెబెల్ స్టార్ వరకే పరిమితమయ్యింది. కానీ ‘కల్కి 2898 AD’తో అది ఒక్కసారిగా మారిపోవడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ మూవీ హడావిడి ఉదయం 4 గంటల నుండే మొదలయ్యింది. అయితే ఆ హడావిడిలో చాలామంది టైటిల్ కార్డ్స్‌లో ప్రభాస్ పేరు మారడం గమనించకపోయినా.. గమనించినవారు మాత్రం దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్ మారింది..

‘కల్కి 2898 AD’ టైటిల్ కార్డ్స్‌లో ప్రభాస్ పేరుకు ముందు శ్రీ అని యాడ్ అయ్యింది. మామూలుగా ఎవరినైనా గౌరవంగా పిలవడం కోసం శ్రీ అనే ట్యాగ్‌ను యాడ్ చేస్తారు. ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగిందా, లేదా ఇప్పటినుండి ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్‌గా మారింది. శ్రీ ప్రభాస్ అనేది చూడడం చాలా కొత్తగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం మా ప్రభాస్ మాకు ఎప్పటికీ రెబెల్ స్టారే అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ముందుగానే దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్టుగా ప్రభాస్.. ఇంట్రడక్షన్ ఇలా ఉంటుందని ప్రేక్షకులు ఊహించలేదు. అలా అని శ్రీ ప్రభాస్ అంటూ తన పేరు.. కొత్త ట్యాగ్‌తో వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు.

అందరూ సూపర్..

‘కల్కి 2898 AD’కు బెనిఫిట్ షో నుండే పాజిటివ్ రివ్యూలు రావడం ప్రారంభమయ్యింది. ప్రభాస్ మాత్రమే కాకుండా ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా సమానంగా హైలెట్‌గా నిలిచాడని ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా కమల్ హాసన్ కూడా మరోసారి తన విశ్వరూపం చూపించాడని ప్రశంసిస్తున్నారు. ఇక దీపికా పదుకొనె, దిశా పటానీ తమ తమ రోల్స్‌లో అలరించారని, గెస్ట్ రోల్స్ అయితే ఆడియన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు. మొత్తానికి మొదటిరోజు పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు ‘కల్కి 2898 AD’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: చిరిగిన చెప్పుల ఫోటో పెట్టిన నాగ్ అశ్విన్ - ‘కల్కి 2898 AD’ కోసం తాను పడిన కష్టానికి ఇదే నిదర్శనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget