అన్వేషించండి

Brahmamudi Serial Today June 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పుకు నిజం చెప్పిన అనామిక – రాజ్ కు హితోపదేశం చేసిన ఇందిరాదేవి

Brahmamudi Today Episode: హోటల్ రూంలో మీడియాకు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది తానేనని అనామిక అప్పుతో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: గార్డెన్‌లో మొక్కలకు నీళ్లు పడుతున్న కావ్య దగ్గరకు రాజ్‌ వచ్చి రొమాంటిక్‌గా చూస్తుంటాడు. చిట్టి నడుమునే చూస్తున్నా అనే సాంగ్‌ పెట్టుకుని కావ్య వైపు దొంగ చూపులు చూస్తుంటాడు. ఇంతలో రాజ్‌ను చూసిన కావ్య కోపంగా మీరేదే చూస్తున్నారు అంటూ తిట్టి లోపలికి వెళ్లిపోతుంది. దీంతో రాజ్‌ డిసప్పాయింట్‌ అవుతాడు. అమ్మాయిలకే లైన్‌ వెయ్యడం తెలియదు. ఇక పెళ్లానికి ఎలా లైన్‌ వేయాలి దేవుడా అని బాధపడుతుంటాడు. మరోవైపు ఇంట్లోంచి బయటకు వెళ్తున్న అప్పును కనకం ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది.

అప్పు: బయటకు వెళ్తున్నాను.

కనకం: ఎందుకు వెళ్తున్నావు.

అప్పు: ఇంతకముందు చాలా సార్లు బయటకు వెళ్లా కానీ ఎప్పుడూ ఇలా అడగలేదే?

కనకం: అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు.

అప్పు: కానీ అప్పుడు ఇప్పుడు బయటకు వెళ్తుంది నేనే కదా?

కనకం: అందుకే వద్దంటున్నా..

  అని కనకం ఎంత చెప్పినా అప్పు వినదు. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోవాలని చెప్తుంది. పోలీస్ ఎగ్జామ్‌ రాయడానికి వెళ్తున్నాను అని చెప్పి  బంటిని తీసుకుని వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు రాజ్‌  ఇంట్లోకి వస్తుంటే ఇందిరాదేవి వచ్చి ఇందాక నువ్వు గార్డెన్‌లో వేసిన వెధవ వేషాలు  అన్ని చూశానని చెప్తుంది.  ఎక్కడో ఒకచోట మనసులో ఉన్న ప్రేమను చూపించాలని రాజ్‌కు  చెప్తుంది ఇందిరాదేవి. అసలు నీ మనసులో ఏముందని అడుగుతుంది.

రాజ్‌: ఇదే ప్రశ్నను నాకు నేను అద్దంలో చూసుకుంటూ ఎన్నోసార్లు వేసుకున్నాను. కానీ అన్నిసార్లు నాదే తప్పు అంటూ నా మనసు చెప్తూనే ఉంది. ఇన్ని రోజులు నాకు కరెక్టు కాదు తను వేరు నేను వేరు కలిసి ఉండలేము అని  ఏవేవో కారణాలు  వెతుక్కుంటూ దూరం పెడుతూనే ఉన్నాను. కానీ కళావతి ఎప్పుడు నా మనసు మార్చేసిందో ఎప్పుడు తనవైపు తిప్పుకుందో నాకే తెలియదు.

 

ALSO READ: ముంబై బీచ్‌లో నాగార్జున, ధనుష్ - ఫ్యాన్స్‌లో ఒకటే జోష్, ఈ సారి కూడా తోసేశారా?

ఇందిర: మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని ఇంకా ఎందుకురా మౌనంగా ఉన్నావు. నీ మనసులో ఉన్న మాటలన్నీ తనతో చెప్పొచ్చు కదా?

రాజ్‌: చెప్పాలని ఉంది కానీ

 ఇందిర: ఇంకా కానీ ఏంట్రా

రాజ్: తను చేసిన ప్రయత్నాల వల్లే ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. దానికోసమే నన్ను భార్యగా అంగీకరించారా అంటూ నన్ను తను ఒక స్వార్థపరుడిలా చూస్తుందేమోనని అనుమానంగా ఉంది నాన్నమ్మా..?

ఇందిర: ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలన్నీ పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. పద ఇప్పుడే వెళ్లి నీ మనసులో మాట చెప్పు.

   అనగానే ఇప్పుడే వద్దు కానీ దానికంటూ ఒక సమయం, సందర్భం  ఉండాలని అప్పుడే మనసులో మాట చెప్పేస్తానని వెళ్లిపోతాడు రాజ్‌. దీంతో తానే అలాంటి సమయం, సందర్భం ఈ రాత్రికి నేనే సెట్‌ చేస్తానని ఇందిరాదేవి అనుకుంటుంది.  మరోవైపు ఎగ్జామ్ కు  వెళ్తున్న అప్పుకు ఎదురుగా అనామిక వెళ్లి తిడుతుంది. మిమ్మల్ని హోటల్‌ లో పట్టించిన ప్లాన్‌  చేసింది నేనే అని చెప్తుంది అనామిక. దీంతో అప్పు, అనామికకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు ఇందిరాదేవి అపర్ణను పిలిచి రాజ్‌, కావ్యలకు శోభనం ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ప్రకాశ్‌ నేను వెళ్లి కావ్యను, రాజ్‌ను పిలవనా మమ్మీ అనడంతో వాళ్లకు తెలిస్తే ఒప్పుకోరని వాళ్లకు తెలియకుండానే మనం అరెంజ్‌ చేయాలని ఇందిరాదేవి చెప్తుంది. దీంతో అందరూ తలా ఒక పని చేయాలని  డిసైడ్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget