అన్వేషించండి
Nagarjuna in Mumbai: ముంబై బీచ్‌లో నాగార్జున, ధనుష్ - ఫ్యాన్స్‌లో ఒకటే జోష్, ఈ సారి కూడా తోసేశారా?
Kubera Movie: నాగార్జున, ధనుష్ నటిస్తున్న ‘కుబేరా’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ అభిమాని ధనుష్‌తో ఫొటో తీసుకోడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది అతడిని పక్కకు తోసేశారు.

నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల
1/5

అక్కినేని నాగార్జున్, ధనుష్ నటిస్తున్న ‘కుబేరా’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగార్జున, ధనుష్‌తోపాటు దర్శకుడు శేఖర్ కమ్ముల జుహు బీచ్‌లో చక్కర్లు కొట్టారు.
2/5

నాగార్జున, ధనుష్‌లను చూసేందుకు స్థానిక ప్రజలు అక్కడ గుడిగూడారు. కొంతమంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే, ధనుష్ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ఓ అభిమానిని పక్కకు తోసేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
3/5

ఈ సారి నాగార్జున మాత్రం జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటన రిపీట్ కాకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టొద్దని తన సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.
4/5

అడిగిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కూల్‌గా కనిపించారు నాగార్జున. అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడంతో షూటింగ్‌కు విరామం ఇచ్చినట్లు తెలిసింది.
5/5

‘కుబేర’ మూవీని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Published at : 25 Jun 2024 07:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion