Brahmamudi Serial Today May June 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పు చెప్పినట్టే చేసిన రఘు – సంగీత్‌లో డాన్స్ చేసిన రాజ్, కావ్య
Brahmamudi Today Episode: సంగీత్‌లో యామిని బయటకు వెళ్లడంతో రాజ్, కావ్యతో కలిసి డాన్స్ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్యను గార్డెన్‌లోకి తీసుకెళ్లిన రాజ్, తనతో కనకం చెప్పిన మాటలు గుర్తు చేస్తుంటాడు. దీంతో కావ్య మా అమ్మను అంత గుడ్డిగా నమ్మకు అని చెప్తుంది. అయితే ఏ అమ్మ అయినా బిడ్డల గురించి అబద్దం చెప్పదు అంటాడు రాజ్. ఇంతలో యామిని వచ్చి సంగీత్‌కు టైం అవుతుంది వెళ్దాం పద బావ అని పిలుస్తుంది. రాజ్ కోపంగా కరెక్ట్ టైంకు వచ్చి చెడగొడుతుంది ఈ యామిని అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు. స్వప్న ఫోన్ మాట్లాడుతుంటే రుద్రాణి, రాహుల్ ఎదురు వస్తారు.
స్వప్న: మీకోసం ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను. కానీ మీరు రాలేదు. ఇక మీరు వెళ్లిపోయారేమో అనుకుని నేను వచ్చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు రాలేదని అసలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లిపోయారు మీరు
రుద్రాణి: ఏయ్ ఓవరాక్షన్ చేసింది చాలు. చాలు ఆపు నీ నాటకాలు. మేము గదిలో స్ట్రక్ అయ్యేలా చేసింది నువ్వే అని మాకు తెలుసు
రాహుల్: అంతే కాదు. మమ్మల్ని ఈ పెళ్లికి రాకుండా అడ్డుకోవడానికి బయటి నుంచి గడియ పెట్టావని కూడా మాకు తెలుసు
స్వప్న: కంగ్రాచ్యులేషన్..
రుద్రాణి: కంగ్రాచ్యులేషన్ ఎందుకే
స్వప్న: ఏడిసన్ బల్బును కనిపెట్టినట్టు, రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టినట్టు నేను ఘడియ పెట్టిన విషయం మీరు కనిపెట్టారు కదా అందుకు కంగ్రాచ్యులేషన్ చెప్పాను
రుద్రాణి. స్వప్నను కొట్టబోతుంటే.. రాహుల్ ఆపేసి దీని సంగతి తర్వాత చూద్దాం పద మమ్మీ అంటూ రుద్రాణిని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక పెళ్లి చెడగొట్టడానికి దుగ్గిరాల ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంటుంది. అందుకోసం అప్పు కోసం ఎదరుచూస్తుంటారు. అప్పు కళ్యాణ్ వస్తారు.
అపర్ణ: అప్పు, కళ్యాణ్ వచ్చేశారు అత్తయ్యా
ఇందిరాదేవి: ఏంటి అప్పు పని పూర్తి చేశావా ఇక ఏ సమస్య ఉండదు కదా
అప్పు: ఏ సమస్య ఉండదు అమ్మమ్మగారు. ఈ అప్పు ఒక్కసారి చెప్పింది అంటే ఇంక ఏ తప్పు చేయదు. ఇక అంతా రెడీగా ఉంది. ఆ రఘు కాల్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్‌గా ఉంది.
రఘు కాల్ చేస్తాడు.
రఘు: మేడం మీరు చెప్పినట్టే వచ్చాను. బయట గార్డెన్‌లో వెయిట్ చేస్తున్నాను.
అప్పు: అయితే నువ్వు అక్కడే వెయిట్ చేయ్ నేను హింట్ ఇస్తాను కరెక్టుగా నువ్వు అప్పుడే యామినికి ఫోన్ చేయాలి. అలాగే నేను చెప్పిన ప్లేస్ గుర్తుంది కదా అక్కడే నువ్వు డబ్బులు తీసుకోవాలి
రఘు: మీరేం కంగారు పడకండి మేడం అంతా మీరు చెప్పినట్టే చేస్తాను
అప్పు: సరే.. అమ్మమ్మ గారు మీరేం టెన్షన్ పడకండి అంతా మన కంట్రోల్ లోనే ఉంది
అంటూ అప్పు చెప్తుంది. అందరూ కలిసి సంగీత్ లోకి వెళ్తారు. ఒక్కోక్కరుగా డాన్స్ చేస్తుంటారు. ప్రకాష్, ధాన్యలక్ష్మీ, తర్వాత అప్పు, కళ్యాణ్ డాన్స్ చేస్తుంటే.. రఘు, యామినికి కాల్ చేస్తాడు. యామిని బయటకు వెళ్లబోతుంటే.. ఇందిరాదేవి ఆపి నెక్స్ నువ్వు రాజ్ డాన్స్ చేయాలని చెప్తుంది. అప్పు యామిని చేయి పట్టుకుని స్టేజీ మీదకు లాగుతుంది. అప్పు తనకు బయట పనుందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అందరూ కలిసి రాజ్, కావ్య కలిసి డాన్స్ చేసేలా చేస్తారు. యామిని బయటకు వెళ్లి రఘుకు డబ్బులు ఇస్తుంది. దూరం నుంచి కళ్యాణ్ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ చేస్తాడు. తర్వాత రాజ్, కావ్య దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















